AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉద్యోగులకు సీఈవో వింత గిఫ్ట్! ఒక్కొక్కరికీ రూ. 2.6 లక్షల పరుపు

ఉద్యోగులకు సీఈవో వింత గిఫ్ట్! ఒక్కొక్కరికీ రూ. 2.6 లక్షల పరుపు

Phani CH
|

Updated on: Jun 23, 2026 | 8:05 PM

Share

ఉద్యోగుల ఉత్పాదకతను పెంచాలంటే ముందుగా వారి నిద్ర నాణ్యత మెరుగుపడాలని భావించిన ఓ AI స్టార్టప్ సీఈఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఉద్యోగికి రూ.2.6 లక్షల విలువైన స్మార్ట్ మ్యాట్రెస్ కవర్‌ను బహుమతిగా అందించారు. మంచి నిద్ర ఏకాగ్రత, సృజనాత్మకత, నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుతుందని చెబుతూ ఉద్యోగుల సంక్షేమానికి కొత్త దిశను చూపించారు.

సాధారణంగా ప్రైవేటు సంస్థల్లో ముఖ్యంగా టెక్‌ కంపెనీల్లో కొందరు యజమానులు ఉద్యోగులతో గొడ్డు చాకిరీ చేయించుకుంటారు. ఆఫీసులో ఉన్నంత సేపూ వారి నుంచి శ్రమను పిండేసుకుంటారు. ఈ క్రమంలో ఉద్యోగులు పడుతున్న ఒత్తిడి, శారీరక, మానసిక ఆరోగ్యం గురించి ఏ మాత్రం పట్టించుకోరు. దీంతో అలాంటి బాస్‌లు ఉద్యోగులను కనీసం పడుకోనివ్వకుండా నిద్రలోనూ కలలోకి వస్తుంటారు. కానీ దీనికి భిన్నంగా, రోజంతా కష్టపడిన తమ ఉద్యోగులు సుఖంగా నిద్రపోవాలని ఓ కంపెనీ సీఈవో ఏం చేశారో తెలుసా. కార్యాలయాల్లో ఉచిత భోజనం, గేమింగ్ జోన్లు ఇవ్వడం టెక్ కంపెనీల్లో సాధారణమే. అయితే అమెరికాకు చెందిన AI స్టార్టప్ సీఈఓ మాటన్ గ్రిన్బర్గ్ మాత్రం భిన్నంగా ఆలోచించారు. ఉద్యోగుల ఉత్పాదకతను పెంచాలంటే ముందుగా వారి నిద్ర నాణ్యత మెరుగుపడాలని భావించి, కంపెనీలో ఉన్న ప్రతి ఉద్యోగికి దాదాపు 3,000 డాలర్లు అంటే రూ.2.6 లక్షల విలువైన ఎయిట్ స్లీప్ స్మార్ట్ మ్యాట్రెస్ కవర్‌ను బహుమతిగా ఇచ్చారు. ఇటీవల “20VC” పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన గ్రిన్బర్గ్, తన ఇంజనీర్లను ప్రొఫెషనల్ అథ్లెట్లతో పోల్చారు. క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలంటే సరైన విశ్రాంతి ఎంత అవసరమో, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు కూడా నాణ్యమైన నిద్ర అంతే కీలకమని అన్నారు. “మనుషులు తమ మెదడు సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించాలంటే ముందుగా బాగా నిద్రపోవాలన్నారు. ఇటీవల ఉద్యోగుల ఆరోగ్యం, మానసిక శ్రేయస్సుపై కంపెనీలు ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. కోవిడ్‌ మహమ్మారి తర్వాత “స్లీప్ మాక్సింగ్” అనే ధోరణి పెరిగింది. స్లీప్ ట్రాకర్లు, స్మార్ట్ వేరబుల్స్, నిద్ర సాంకేతిక ఉత్పత్తుల వినియోగం కూడా పెరిగింది. మంచి నిద్ర… నిర్ణయ సామర్థ్యం, ఏకాగ్రత, సృజనాత్మకతను మెరుగుపరుస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. స్టార్టప్‌ నిర్ణయం భవిష్యత్తులో ఉద్యోగి సంక్షేమానికి కొత్త ప్రమాణాలను నిర్దేశించే అవకాశముందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

11 ఏళ్లకే యూకే యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా రికార్డ్‌.. వైజాగ్ టు లండన్ కలశ నాయుడు ప్రయాణం

ఉద్యోగితో రూ. 2.5 లక్షల ఫిట్‌నెస్ బెట్ లో ఓడిన జెరోదా బాస్

ఫోన్‌ దొంగిలించి పారిపోతూ కుప్పకూలిన దొంగ.. క్షణాల్లో ప్రాణాలు గాల్లో..

వీడు మామూలోడు కాదు.. పగలు ఇళ్లకు రంగులు.. రాత్రయితే చాలు..

అంతరిక్షంలో వింత.. ‘ఆ గ్రహం’ పై ఉప్పు వర్షం..

Follow Us