AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంతరిక్షంలో వింత.. 'ఆ గ్రహం' పై ఉప్పు వర్షం..

అంతరిక్షంలో వింత.. ‘ఆ గ్రహం’ పై ఉప్పు వర్షం..

Phani CH
|

Updated on: Jun 22, 2026 | 8:54 PM

Share

భూమికి 57 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ‘జీజే-504బి’ అనే పింక్ ప్లానెట్‌పై ఉప్పుతో కూడిన మేఘాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సేకరించిన డేటా ఆధారంగా ఈ సంచలన ఆవిష్కరణ జరిగింది. పొటాషియం క్లోరైడ్, మాంగనీస్ సల్ఫైడ్‌తో ఏర్పడిన ఈ మేఘాలు ఉప్పు వర్షాన్ని కురిపిస్తున్నాయని పరిశోధకులు వెల్లడించారు.

అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ విశ్వంలోని ఒక సుదూర గ్రహంపై ఉప్పుతో కూడిన మేఘాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అమెరికాలోని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ భారతీయ ఖగోళ శాస్త్రవేత్త అనిష్ బాబురాజ్ నేతృత్వంలోని అంతర్జాతీయ పరిశోధక బృందం ఈ సంచలన ఆవిష్కరణ చేసింది. నాసాకు చెందిన అత్యంత అధునాతన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (JWST) పంపిన డేటాను విశ్లేషించడం ద్వారా ఈ వింత ప్రపంచం గుట్టు వీడింది. అంతరిక్షంలో ప్రత్యేకమైన గులాబీ రంగు కాంతితో మెరుస్తూ ఉండటం వల్ల ‘పింక్ ప్లానెట్’గా పిలుస్తున్న ‘జీజే-504బి’ అనే గ్రహంపై ఈ వింత వాతావరణం ఉన్నట్లు పరిశోధకులు ధ్రువీకరించారు. ఇది భూమికి దాదాపు 57 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. పరిమాణంలో బృహస్పతి కంటే నాలుగు రెట్లు పెద్దదైన ఈ గ్రహం వయసు సుమారు 250 నుంచి 400 కోట్ల ఏళ్లు ఉంటుందని అంచనా. ఈ గ్రహాన్ని మొట్టమొదటిసారిగా 2013లో గుర్తించినప్పటికీ, తాజాగా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సాయంతో దీని వాతావరణాన్ని పూర్తిగా అధ్యయనం చేశారు. ఈ గ్రహంపై పొటాషియం క్లోరైడ్, మాంగనీస్ సల్ఫైడ్ వంటి లవణాలతో కూడిన మేఘాలు దట్టంగా అలముకున్నట్లు తేలింది. భూమిపై నీటి ఆవిరితో మంచు స్ఫటికాలుగా మారి మేఘాలు ఏర్పడినట్లే, ఈ గ్రహంపై ఉన్న తీవ్రమైన చలి వాతావరణం కారణంగా ఉప్పు కణాలు స్ఫటికాలుగా మారి మేఘాలుగా రూపాంతరం చెంది, ఉప్పు వర్షాన్ని కురిపిస్తున్నాయి. వాతావరణంలో ఉప్పు మేఘాలు ఉంటాయంటూ 15 ఏళ్ల క్రితం శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన సిద్ధాంతాలకు ఈ ఆవిష్కరణ తొలి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. ఈ పరిశోధన వివరాలు ప్రఖ్యాత ‘ది ఆస్ట్రానమికల్ జర్నల్’లో ప్రచురితమయ్యాయి. ఈ గ్రహంపై ఉప్పుతో పాటు నీటి ఆవిరి, మీథేన్, కార్బన్ డై ఆక్సైడ్, అమ్మోనియా వంటి వాయువులు కూడా ఉన్నట్లు స్పెక్ట్రమ్ విశ్లేషణలో తేలింది. సౌర కుటుంబానికి అవతల ఉన్న గ్రహాల వైవిధ్యతను అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధన ఎంతగానో దోహదపడుతుందని అంతరిక్ష నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టీచర్‌గా మారిన ఎస్పీ.. క్లాస్‌లో పాఠాలు చెబుతూ..

నవ జంట ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ అంతలోనే విషాదం!

ఏపీలో 50 టన్నుల బంగారు కొండ! దేశంలోనే అతిపెద్ద గోల్డ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్!

Follow Us