AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీచర్‌గా మారిన ఎస్పీ.. క్లాస్‌లో పాఠాలు చెబుతూ..

టీచర్‌గా మారిన ఎస్పీ.. క్లాస్‌లో పాఠాలు చెబుతూ..

Phani CH
|

Updated on: Jun 22, 2026 | 8:52 PM

Share

సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయుడిగా మారి పాఠాలు బోధించారు. 8వ తరగతి విద్యార్థులకు భూగోళ నిర్మాణం, ఉత్తర-దక్షిణ ధ్రువాలపై పాఠాలు చెప్పడంతో పాటు క్రమశిక్షణ, రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. ఆయన బోధనా శైలి విద్యార్థులను ఆకట్టుకోగా, ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యాన్ని కూడా వివరించారు.

ఖాకీ డ్రెస్సులో నేరస్థులకు వణుకు పుట్టించే ఆ పోలీస్ బాస్.. కాసేపు తన అధికార బాధ్యతలను పక్కనపెట్టి చేతిలో చాక్ పీస్ పట్టుకుని బ్లాక్ బోర్డు ముందు నిలబడ్డారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయుడిగా మారి పాఠాలు బోధించి అందరి ప్రశంసలు అందుకున్నారు. సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలోని ఉన్నత పాఠశాలను ఎస్పీ నర్సింహా సందర్శించారు. ఆయన పోలీస్ శాఖలోకి రాకముందు ఉపాధ్యాయ వృత్తిలో పనిచేశారు. తన పూర్వ వృత్తిని గుర్తుచేసుకుంటూ ఆయన నేరుగా 8వ తరగతి గదిలోకి వెళ్లారు. చాక్ పీస్ చేతబట్టి ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, భూగోళ నిర్మాణం వంటి సాంఘికశాస్త్రం పాఠాలను విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించారు. ప్రశ్నలు అడుగుతూ, సమాధానాలు రాబడుతూ ఆయన క్లాస్ చెప్పిన తీరు విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంది. పాఠాలతో పాటు క్రమశిక్షణ, రోడ్డు భద్రత, మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై విద్యార్థులకు ఎస్పీ అవగాహన కల్పించారు. ఇదే సమయంలో తాను పనిచేస్తున్న పాఠశాలలోనే తన కుమారుడు రుత్విక్‌ను చేర్పించిన జూనియర్ అసిస్టెంట్ హరితను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని, విద్యార్థులు ఉన్నత ఆశయాలతో మంచి పౌరులుగా ఎదగాలని ఎస్పీ నర్సింహా ఆకాంక్షించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నవ జంట ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ అంతలోనే విషాదం!

ఏపీలో 50 టన్నుల బంగారు కొండ! దేశంలోనే అతిపెద్ద గోల్డ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్!

Follow Us