AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

11 ఏళ్లకే యూకే యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా రికార్డ్‌.. వైజాగ్ టు లండన్ కలశ నాయుడు ప్రయాణం

11 ఏళ్లకే యూకే యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా రికార్డ్‌.. వైజాగ్ టు లండన్ కలశ నాయుడు ప్రయాణం

Phani CH
|

Updated on: Jun 22, 2026 | 9:08 PM

Share

విశాఖకు చెందిన 11 ఏళ్ల కలశానాయుడు సామాజిక సేవ, నాయకత్వ లక్షణాలతో అంతర్జాతీయ గుర్తింపు పొందింది. యూకే యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా ఎంపికైన ఆమె, బాలకార్మికుల విద్య కోసం కృషి చేస్తూ చిన్న వయసులోనే గౌరవ డాక్టరేట్ అందుకుంది. ప్రపంచ వేదికలపై భారతీయ యువత సామర్థ్యాన్ని చాటుతూ కొత్త తరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

‘కలలు కనాలి.. వాటిని సాకారం చేసుకోవాలి’ అన్న అబ్దుల్ కలాం మాటలను నిజం చేస్తూ, అంతర్జాతీయ వేదికపై తెలుగు వెలుగును చాటింది విశాఖకు చెందిన చిన్నారి డాక్టర్ కలశానాయుడు. కేవలం 11 ఏళ్ల ప్రాయంలోనే సామాజిక సేవ, నాయకత్వ లక్షణాలతో గ్లోబల్ లెవెల్‌లో గుర్తింపు తెచ్చుకుని, ప్రతిష్టాత్మక ‘యూకే యూత్ పార్లమెంట్’ సభ్యురాలిగా ఎంపికైంది. ఆగస్టు 13, 2013న జన్మించిన కలశానాయుడు, చిన్నతనం నుంచే సమాజం పట్ల బాధ్యతను అలవర్చుకుంది. తన వయసు చిన్నారులు బాలకార్మికులుగా మారడం చూసి చలించిపోయిన ఆమె, వారికి పలకలు, పుస్తకాలు, ఆటబొమ్మలు అందిస్తూ అండగా నిలిచింది. ఆమె సేవాభావాన్ని గుర్తించిన ‘యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ పీస్ కౌన్సిల్’, కలశకు 11 ఏళ్ల వయసులోనే గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. తద్వారా ప్రపంచంలోనే అతి చిన్న వయసులో డాక్టరేట్ అందుకున్న తొలి చిన్నారిగా లండన్ పార్లమెంట్ భవనంలో రికార్డు సృష్టించింది. అక్కడ బ్రిటిష్ ఎంపీలు, ఇండియన్ హైకమిషనర్ వంటి ప్రముఖుల ముందు ఆమె చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. యువత సమస్యలు విద్య, ఉపాధి, మానసిక ఆరోగ్యం, సామాజిక న్యాయం తదితర అంశాలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు 1999లో యూకే యూత్ పార్లమెంట్‌ను ఏర్పాటు చేశారు. 11 నుండి 18 ఏళ్ల లోపు యువతకు ప్రాతినిధ్యం వహించే ఈ ప్రతిష్టాత్మక వేదికకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో గెలిచి సభ్యురాలిగా ఎంపికైన కలశానాయుడు, గ్లోబల్ లీడర్లతో కలిసి అంతర్జాతీయ చర్చల్లో పాల్గొంటోంది. ప్రపంచ పౌరసత్వం అంటే కేవలం విదేశాలలో నివాసం కాదు ప్రపంచ శ్రేయస్సు కోసం ఆలోచించడం, వివిధ సంస్కృతులను గౌరవించడం, మానవతా విలువలను కాపాడడం. ఈ లక్షణాలను కార్యచరణ చేస్తూ కొత్త తరానికి ఆమె దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రపంచ వేదికలపై భారతీయ యువత సామర్థ్యాన్ని చాటుతూనే ప్రపంచ సమస్యల పరిష్కార లో భాగస్వామ్యం కావాలని యువతను ప్రోత్సహిస్తున్నారు. సాధారణ కుటుంబం నుండి వచ్చి, భారతీయ విలువలు-ప్రపంచ దృక్పథాన్ని జోడించి అంతర్జాతీయ వేదికపై రాణిస్తున్న కలశానాయుడు ప్రస్థానం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం. ఈమె సాధించిన విజయాలపై బంగారుపాళ్యం ఎమ్మెల్యే మురళీమోహన్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉద్యోగితో రూ. 2.5 లక్షల ఫిట్‌నెస్ బెట్ లో ఓడిన జెరోదా బాస్

ఫోన్‌ దొంగిలించి పారిపోతూ కుప్పకూలిన దొంగ.. క్షణాల్లో ప్రాణాలు గాల్లో..

వీడు మామూలోడు కాదు.. పగలు ఇళ్లకు రంగులు.. రాత్రయితే చాలు..

అంతరిక్షంలో వింత.. ‘ఆ గ్రహం’ పై ఉప్పు వర్షం..

టీచర్‌గా మారిన ఎస్పీ.. క్లాస్‌లో పాఠాలు చెబుతూ..

Follow Us