వీడు మామూలోడు కాదు.. పగలు ఇళ్లకు రంగులు.. రాత్రయితే చాలు..
ఇళ్లకు రంగులు వేస్తూ వాటిపైనే రెక్కీ నిర్వహించి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ఘరానా దొంగను బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహ్మద్ సలీం అలియాస్ సునీల్‌షెట్టిపై ఇప్పటికే 78 చోరీ కేసులు నమోదయ్యాయి. తాజా బంగారు ఆభరణాల దొంగతనం కేసులో సీసీటీవీ ఆధారంగా అతడిని గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు, దొంగిలించిన నగలను స్వాధీనం చేసుకున్నారు.
నమ్మకంగా ఇళ్లకు రంగులు వేస్తూ, ఆపై అదే ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఒక అంతర్రాష్ట్ర ఘరానా దొంగను బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాహీన్‌నగర్ ఆన్‌లైన్ కాలనీకి చెందిన మహ్మద్ సలీం అలియాస్ సునీల్‌షెట్టి నూతన గృహాలకు రంగులు వేసే పెయింటర్‌గా పని చేస్తుంటాడు. నగరంలో ఎక్కడ పని దొరికితే అక్కడ ఉంటూ, పగలు ఇళ్లకు రంగులు వేస్తూ.. రెక్కీ నిర్వహిస్తాడు. చీకటి పడితే చాలు.. తాళం వేసి ఉన్న ఇళ్లే కాకుండా, మనుషులు ఉన్న ఇళ్లలోకి కూడా చొరబడి అత్యంత చాకచక్యంగా చోరీలకు పాల్పడతాడు. నగరంలో ఇతనిపై ఇప్పటివరకు ఏకంగా 78 దొంగతనం కేసులు ఉన్నాయి. గతంలో పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ సలీం తన బుద్ధి మార్చుకోలేదు. జైలు నుంచి విడుదలయ్యాక మళ్లీ నమ్మకంగా పని చేస్తున్నట్లు నటిస్తూ దొంగతనాలు కొనసాగిస్తున్నాడు. వారం రోజుల క్రితం ఒక ఇంట్లో బంగారు ఆభరణాల చోరీకి పాల్పడటంతో, బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, పాత నేరస్థుడైన సలీంను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా నేరాన్ని అంగీకరించడంతో, అతని వద్ద నుండి దొంగిలించిన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అంతరిక్షంలో వింత.. ‘ఆ గ్రహం’ పై ఉప్పు వర్షం..
టీచర్‌గా మారిన ఎస్పీ.. క్లాస్‌లో పాఠాలు చెబుతూ..
నవ జంట ప్రీ వెడ్డింగ్ షూట్ అంతలోనే విషాదం!
ఏపీలో 50 టన్నుల బంగారు కొండ! దేశంలోనే అతిపెద్ద గోల్డ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్!
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్.. కట్ చేస్తే
రూమ్‌లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్ చూస్తే వణుకే
అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు
వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
మటన్ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

