AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉద్యోగితో రూ. 2.5 లక్షల ఫిట్‌నెస్ బెట్ లో ఓడిన జెరోదా బాస్

ఉద్యోగితో రూ. 2.5 లక్షల ఫిట్‌నెస్ బెట్ లో ఓడిన జెరోదా బాస్

Phani CH
|

Updated on: Jun 22, 2026 | 9:04 PM

Share

జెరోదా వ్యవస్థాపకుడు నితిన్ కామత్ ఉద్యోగుల ఆరోగ్యం కోసం పెట్టిన ఫిట్‌నెస్ ఛాలెంజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏడాదిలో 30 కిలోలు తగ్గితే రూ.2.5 లక్షలు ఇస్తానన్న బెట్‌ను ఉద్యోగి రోహిత్ అగర్వాల్ విజయవంతంగా పూర్తి చేశాడు. 104 కిలోల నుంచి 75 కిలోలకు చేరిన రోహిత్‌ను కామత్ అభినందించగా, నెటిజన్లు ఇద్దరిపైనా ప్రశంసలు కురిపిస్తున్నారు.

జెరోదా వ్యవస్థాపకుడు నితిన్ కామత్, తన కంపెనీ ఉద్యోగి రోహిత్ అగర్వాల్ మధ్య జరిగిన ఫిట్‌నెస్ బెట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉద్యోగులకు ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడానికి జెరోదా అధినేత నితిన్ కామత్ ఫిట్‌నెస్ బెట్ కట్టారు. ఏడాది కాలంలో 30 కిలోల బరువు తగ్గితే రూ.2.5 లక్షల క్యాష్‌ ప్రైజ్‌ ఇస్తానని ప్రకటించారు. బాస్ ఇచ్చిన ఆ ఛాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకున్న రోహిత్ అగర్వాల్ అనే ఉద్యోగి కఠోర సాధనతో అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఈ బెట్‌లో విజయం సాధించారు. ఉద్యోగి రోహిత్ అగర్వాల్ ఏడాది కాలంలో ఎంతో కష్టపడి తన బరువును 104 కిలోల నుంచి 75 కిలోలకు తగ్గించుకున్నారు. డబ్బు కంటే కూడా ఫిట్‌నెస్ సాధించడమే తనకు ఆనందాన్ని ఇచ్చిందని, తన బాస్ నితిన్ కామత్ ప్రోత్సాహం వల్లే అది సాధ్యమైందని రోహిత్‌ అన్నారు. అటు నితిన్ కామత్ కూడా ఈ బెట్‌లో తాను ఓడిపోయి రూ.2.5 లక్షలు కోల్పోయినా, తన ఉద్యోగి బరువు తగ్గి ఆరోగ్యంగా మారడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని పోస్ట్ పెట్టారు. బెట్‌లో ఓడినా తనకు ఎంతో ఆనందంగా ఉంది అంటూ నితిన్ కామత్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఉద్యోగుల ఆరోగ్యం కోసం చొరవ తీసుకున్న జెరోదా బాస్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. డబ్బులు ఓడిపోయినా ఒకరి జీవితాన్ని కామత్ గెలిపించారని కామెంట్లు పెట్టారు. 30 కిలోల బరువు తగ్గడమే రోహిత్ సాధించిన అసలైన విక్టరీ అంటూ నెటిజన్లు ఇద్దరికీ అభినందనలు తెలుపుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫోన్‌ దొంగిలించి పారిపోతూ కుప్పకూలిన దొంగ.. క్షణాల్లో ప్రాణాలు గాల్లో..

వీడు మామూలోడు కాదు.. పగలు ఇళ్లకు రంగులు.. రాత్రయితే చాలు..

అంతరిక్షంలో వింత.. ‘ఆ గ్రహం’ పై ఉప్పు వర్షం..

టీచర్‌గా మారిన ఎస్పీ.. క్లాస్‌లో పాఠాలు చెబుతూ..

నవ జంట ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ అంతలోనే విషాదం!

Follow Us