AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతను చాలా మంచి నటుడు.. సరైన అవకాశాలు వస్తే రాణిస్తాడు..

దర్శకుడు, రచయిత బీవీఎస్ రవి తన జీవితంలో సత్యం సినిమా ఎంతటి ప్రభావం చూపిందో వెల్లడించారు. సుమంత్ నటించిన సత్యం సినిమా చూసి రైటర్‌గా స్థిరపడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ సినిమా కోసం తాను రాసిన డైలాగ్స్ ఎప్పటికీ ఆకట్టుకుంటున్నాయని అన్నారు.

అతను చాలా మంచి నటుడు.. సరైన అవకాశాలు వస్తే రాణిస్తాడు..
Director Bvs Ravi
Rajeev Rayala
|

Updated on: May 31, 2026 | 7:18 PM

Share

ప్రముఖ డైలాగ్ రైటర్, నటుడు బీవీఎస్ రవి తన రచనా ప్రస్థానానికి సత్యం సినిమా ఎలా ఉపయోగపడిందో ఓ ఇంటర్వ్యూలో వివరించారు.  సత్యం సినిమా కోసం కథా రచన అనుభవాలను బీవీఎస్ రవి పంచుకున్నారు. మొదట శ్రీచందన అనే కథను సుమంత్ కోసం రాశానని, దానిని అన్నపూర్ణ స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుప్రియకు వివరించానని చెప్పారు. సుప్రియకు ఆ కథను బాగా నచ్చి సుమంత్‌కు వినిపించారు. అయితే, సుమంత్ కూడా ఓకే తెలిపిన తర్వాత, నాగార్జున గారికి కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు అనూహ్య పరిణామం ఎదురైంది. అప్పటికే మన్మథుడు చిత్రీకరణలో ఉన్న నాగార్జున, తమ కాలేజీ కథ సుమంత్‌కు సరిపోదని, అతనికి వరుస ఫ్లాపులు ఉన్నాయని, కాబట్టి మరో  కథను చేయమని సూచించారని బీవీఎస్ రవి గుర్తుచేసుకున్నారు. హీరో మంచివాడై ఉండి, అందరూ తిడుతుంటే, అతని గొప్పదనం ఎవరికీ తెలియని కథను తీసుకురావాలని నాగార్జున చెప్పారట. నాగార్జున సూచనల తర్వాత, బీవీఎస్ రవికి కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన చెల్లెలి కాపురం సినిమా గుర్తుకొచ్చిందట.

ఇది కూడా చదవండి : వామ్మో..! మెంటలెక్కిపోయే ట్విస్ట్‌లు.. ఒంటరిగా చూడాల్సిన సినిమా… స్ట్రీమింగ్ ఎక్కడంటే

ఒక కవి, తన చెల్లెలి పెళ్లి కోసం మరో కవి దగ్గర ఘోస్ట్ రైటర్‌గా పనిచేసే కథాంశం అది. దానికి మార్పులు చేసి కొత్త కథను రూపొందించారట. ఈ కొత్త కథాంశం నాగార్జునకి బాగా నచ్చింది. అక్కడికక్కడే సినిమాను నిర్మించడానికి సుప్రియకు సూచనలు ఇచ్చారటనాగ్ . అలాగే రవి మాట్లాడుతూ.. సత్యం సినిమా విజయానికి సంగీత దర్శకుడు చక్రి, గీత రచయితలు కందికొండ, భాస్కరభట్లల పాత్ర ఎంతో కీలకమని బీవీఎస్ రవి అన్నారు. చక్రి పాటల కోసం పడిన తపనను, కందికొండ ‘మధురమే మధురమే’ పాటను, భాస్కరభట్ల ‘పిలిచినా పలకదు ప్రేమ’ వంటి పాటలను స్టూడియోలో, తోటలో కూర్చుని రాశారని తెలిపారు.

ఇది కూడా చదవండి : బాలయ్య బిడ్డా మజాకా..! ఆ గ్రేస్ ముందు హీరోయిన్స్ తేలిపోతారుగా.. వీడియో వైరల్

ఈ సినిమాతోనే సత్యం రాజేష్‌కి తన పేరు వచ్చిందని, అతని కెరీర్ సత్యంతోనే మొదలైందని బీవీఎస్ రవి పేర్కొన్నారు. జోరుగా హుషారుగా సినిమా సమయంలో సత్యం రాజేష్‌ను మొదటిసారి చూశానని, అతని స్లో మోషన్ నడక శైలి తనను ఆశ్చర్యపరిచిందని చెప్పారు. వర్షం సినిమా షూటింగ్ సమయంలోనూ సత్యం చిత్రీకరణకు ప్రాధాన్యతనిచ్చిన సత్యం రాజేష్ క్రమశిక్షణ, అంకితభావాన్ని బీవీఎస్ రవి ప్రశంసించారు. మధ్యలో సత్యం రాజేష్‌కు అతని ప్రతిభకు తగిన అవకాశాలు రాకపోయినా, అతను దృఢంగా నిలబడ్డాడని, ఒక నటుడిగా అతనిని ఎంతో ఇష్టపడతానని తెలిపారు. సత్యం రాజేష్‌తో పాటు ప్రవీణ్, జోష్ రవి, చిత్రం శీను వంటి నటులు కూడా అద్భుతమైన ప్రతిభ కలవారని, వారికి కూడా మరింత గుర్తింపు రావాలని బీవీఎస్ రవి చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ప్రివ్యూ చూసి ఇదేం సినిమా.. అట్టర్ ఫ్లాప్ అన్నారు..! కట్ చేస్తే ఇండస్ట్రీలోనే క్లాసిక్ హిట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us