నాటి లుక్స్ తో నెట్టింట వైరల్ అవుతున్న తేజస్వి పిక్స్ 

23-06-2026

Pic credit - Instagram

Phani Ch

సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా నిలిచే టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ తేజస్వి మదివాడ, తన తాజా గ్లామరస్ ఫోటోషూట్‌తో మరోసారి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

తెలుగు ప్రేక్షకులకు తేజస్వి మదివాడ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తనదైన బోల్డ్ నెస్, చలాకీతనంతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో ఒక చిన్న పాత్రతో కెరీర్ మొదలుపెట్టిన ఈ భామ, ఆ తర్వాత వైవిధ్యమైన సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది.

ముఖ్యంగా 'కేరింత' చిత్రంలో తేజస్వి పోషించిన క్యారెక్టర్, ఆమె చూపించిన యాక్టింగ్ అండ్ గ్లామర్ యువతను విశేషంగా ఆకట్టుకుని మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి.

సినిమాల తర్వాత రియాలిటీ షో బిగ్ బాస్‌లో పాల్గొని మరింత పాపులారిటీ పొందింది. ఆ తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, ఓటీటీ షోలలో హోస్ట్‌గా రాణిస్తోంది.

తన అందచందాలను పర్ఫెక్ట్‌గా ఎలివేట్ చేస్తూ ఆమె ఇచ్చిన స్టైలిష్ పోజులు చూసి నెటిజన్లు, అభిమానులు ఒక్కసారిగా ఫిదా అయిపోతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇటు ట్రెడిషనల్, అటు మోడరన్ లుక్స్‌తో ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ పిక్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తెగ వైరల్ అవుతుంటాయి.