ఉమా తెలుగు ట్రావెలర్ నెల సంపాదన ఎంతో తెలసా? కష్టానికి తగ్గ ఫలితం

23-06-2026

Pic credit - Instagram

Phani Ch

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, కేవలం ఎనిమిదో తరగతి వరకే చదివిన ఒక సాధారణ తెలుగు యువకుడు ఏకంగా 100 దేశాలు చుట్టేసి రికార్డు సృష్టించాడంటే నమ్ముతారా?

అతనే మన ఉమా ప్రసాద్, అలియాస్ 'ఉమా తెలుగు ట్రావెలర్'. ఒకప్పుడు తినడానికి తిండి కూడా లేక తీవ్రమైన పేదరికాన్ని అనుభవించిన రోజుల నుంచి నేడు స్టార్ యూట్యూబర్‌గా ఎదిగాడు.

కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆగిపోయాక పొట్టకూటి కోసం ఉమ ఎన్నో పనులు చేశాడు. వ్యవసాయం, సైకిల్ షాపులో పని, ఆటో నడపడం, సినిమాల్లో చిన్న వేషాలు వేయడం లాంటివి చేశాడు.

ఆ తర్వాత బతుకుదెరువు కోసం ఆఫ్రికా దేశమైన మాలీకి వెళ్లి అక్కడ ఒక వాటర్ ప్లాంట్‌లో చిన్న ఉద్యోగంలో చేరాడు. సరిగ్గా అక్కడే అతని జీవితాన్ని మార్చే యూట్యూబ్ ఆలోచన వచ్చింది.

ఆఫ్రికాలోని మాలీలోనే తన మొదటి ట్రావెల్ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఎనిమిదేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో దేశాల సంస్కృతులను తెలుగు వారికి పరిచయం చేశాడు.

ఇటీవలే ఆఫ్రికా ఖండంలోనే తన 100వ దేశాల మైలురాయిని విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం అతని యూట్యూబ్ ఛానెల్‌కు దాదాపు 15 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

ఉమ తన వీడియోలలో ఎలాంటి బెట్టింగ్ యాప్స్ కానీ, ఇతర వివాదాస్పద ప్రమోషన్లు కానీ చేయడు. కేవలం జెన్యూన్ వ్యూస్ ద్వారానే నెలకు దాదాపుగా 20 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నాడు.

యూట్యూబ్‌తో పాటు తమిళనాడుకు చెందిన తోటి ట్రావెలర్ భువనీతో కలిసి 'ట్రిపెట్' అనే సొంత ట్రావెల్ కంపెనీని కూడా ప్రారంభించి, బిజినెస్‌లో విజయవంతంగా రాణిస్తున్నాడు.