కోట్ల కొద్దీ ఆస్తిపాస్తులు.. కూతురు ఉన్నా లేనట్టే..! చివరి రోజుల్లో ఒంటరిగా నరకం చూసిన నిర్మలమ్మ
తెలుగు సినీ చరిత్రలో బామ్మ పాత్రలకు పర్యాయపదంగా నిలిచిన గొప్ప నటి నిర్మలమ్మ. ఎన్టీఆర్ నుంచి చిరంజీవి, రజినీకాంత్ వరకు ఎందరో అగ్రనటులకు అమ్మ, అత్తగా, బామ్మగా నటించారు. 1927లో కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో జన్మించిన ఈమె, నాటకాలపై ఆసక్తితో సినీ రంగ ప్రవేశం చేశారు.

తెలుగు సినిమా రంగంలో బామ్మ పాత్రలకు చిరునామాగా నిలిచారు నిర్మలమ్మ, ఒక అద్భుతమైన నటీమణి. ఆమె సుదీర్ఘ సినీ ప్రస్థానంలో తరతరాల అగ్రనటులైన ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, శోభన్ బాబు, కృష్ణ వంటి వారి నుండి చిరంజీవి, బాలకృష్ణ వరకు, చివరికి రజినీకాంత్, కమల్ హాసన్ వంటి ఇతర భాషా చిత్రాలలోనూ అమ్మ, అత్త, బామ్మ పాత్రలలో నటించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. బామ్మ పాత్ర అనగానే ప్రతి దర్శకుడు, నిర్మాతకు వెంటనే గుర్తుకు వచ్చే పేరు నిర్మలమ్మదే. ఆమె సినీ ప్రస్థానంలో కులగోత్రాలు చిత్రం ఒక మైలురాయి. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు తల్లిగా నటించి, కులం కాని అమ్మాయిని పెళ్లి చేసుకున్న కొడుకును ఇంట్లోకి రానివ్వని భర్త (గుమ్మడి) కారణంగా నలిగిపోయే తల్లి పాత్రలో ఆమె చూపిన అభినయం ప్రేక్షకుల హృదయాలను కలచివేసింది. అలాగే, గ్యాంగ్ లీడర్లో చిరంజీవి బామ్మగా, చిన్నరాయుడులో వెంకటేష్ బామ్మగా ఆమె నటన తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
ఇది కూడా చదవండి : 15 రోజుల కోమా.. నాలుగేళ్లపాటు నరకం.. ముమైత్ ఖాన్ జీవితంలో ఇంత విషాదం ఉందా.!
తమిళ నటి మనోరమ తరహా పాత్రలు తెలుగులో ఆమెకు ప్రత్యేక గుర్తింపుని తెచ్చిపెట్టాయి. నిర్మలమ్మ 1927లో కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో గంగమ్మ, కోటయ్య గంగమ్మ దంపతులకు తొమ్మిదో సంతానంగా జన్మించారు. ఆమె పెదనాన్న రంగస్థల నటులు కావడం వల్ల చిన్నతనం నుండే నాటకాలపై అపారమైన ఆసక్తి పెంచుకున్నారు. పాఠశాల విద్యను పదో తరగతి వరకు కొనసాగిస్తూనే, నాటకాలకు అవసరమైన వాచకం, భావం కోసం రామాయణ మహాభారతాలను ఆపోసన పట్టారు. ఆనాటి బందరు నాటకాలకు పెద్ద పేరు పొందిన ప్రాంతం కావడంతో, ఆమెకు రంగస్థల అనుభవం లభించింది.
ఇది కూడా చదవండి : పుట్టుకతోనే గుండెజబ్బు.. షూటింగ్‌లోనే రక్తపు వాంతులు.. కట్టుకున్న భర్త కూడా వదిలేశాడు..
ఆమె జీవితంలో అనేక ఒడిదుడుకులు, కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ, తన కళ పట్ల అంకితభావంతో ముందుకు సాగారు. పిల్లలు లేకపోవడంతో ఓ కూతురిని దత్తత తీసుకొని పెంచి పెళ్లి చేశారు నిర్మలమ్మ. చివరి రోజులో అనారోగ్యంతో బాధపడ్డారు నిర్మలమ్మ. అయితే నిర్మలమ్మకు హైదరాబాద్ లో ఒక ఇల్లు, చెన్నైలో ఒక ఇల్లు ఉంది.. అయితే చెన్నైలో ఉన్న ఇంట్లో కూతరు ఉండేది. కాగా చివరి రోజుల్లో నిర్మలమ్మ దగ్గర ఇద్దరు పనివాళ్లను ఉంచి కూతురు(దత్తపుత్రిక) భర్తతో కలిసి చెన్నైలో ఉండేది. కూతురు ఉన్నా లేనట్టే అనాథలా ఆఖరి జీవితం గడిపారు. చివరి రోజుల్లో లేచి నడవలేని స్థితిలో ఉండేవారు నిర్మలమ్మ. ఎవ్వరూ పట్టించుకోక చాలా ఇబ్బందిపడ్డారట నిర్మలమ్మ. ఒక రోజు నిర్మలమ్మను చూడటానికి రమా ప్రభ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె పరిస్థితి చూసి కన్నీళ్లుపెట్టుకున్నారట.. రమా ప్రభానే నిర్మలమ్మ ఇంటిని శుభ్రం చేసి ఆమెకు వండిపెట్టిందట. చివరికి ఒంటిగా ఉంటూ.. లేవలేని స్థితిలో 2009లో దీన స్థితిలో నిర్మలమ్మ మరణించారు.
ఇది కూడా చదవండి : ఎన్టీఆర్ అద్భుతంగా డైలాగ్ చెప్పగానే ఆ హీరోయిన్ కన్నీళ్లుపెట్టుకుంది.. సెట్‌లో అందరూ షాక్ అయ్యాం..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




