AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : 16 ఏళ్లకే గ్లామర్ సంచలనం.. 2 ఏళ్లల్లో 20 సినిమాలు.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఆమె మరణం ఇప్పటికీ మిస్టరీనే..

అందమే అసూయపడే రూపంతో వెండితెరపై మెరిసింది ఆమె, అతి చిన్న వయసులోనే సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసింది. 1974 ఫిబ్రవరి 25న జన్మించిన ఆమె, 19 ఏళ్ల వయసులోనే తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. తొలుత సినిమాలకు దూరంగా ఉండాలనుకున్నా తొలి సినిమా అవకాశం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. రెండేళ్ల వ్యవధిలోనే 14 హిందీ, 6 తెలుగు చిత్రాలలో నటించి రికార్డు సృష్టించింది.

Tollywood : 16 ఏళ్లకే గ్లామర్ సంచలనం.. 2 ఏళ్లల్లో 20 సినిమాలు.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఆమె మరణం ఇప్పటికీ మిస్టరీనే..
Divya Bharati
Rajitha Chanti
|

Updated on: Jun 23, 2026 | 9:49 PM

Share

అందానికే అందం, ఆ అందమే తనను చూసి అసూయపడేట్లు ఉండే చందమామ దివ్యభారతి. ఆమె మరణించి 28 ఏళ్లు గడుస్తున్నా, తెలుగు, హిందీ సినీ ప్రేక్షకుల హృదయాలలో ఆమె జ్ఞాపకాలు పచ్చగా పదిలంగా ఉన్నాయి. ఒక వ్యక్తి జ్ఞాపకాలు ఇంతకాలం చెక్కుచెదరకుండా ఉండటం అరుదైన విషయం. 19 ఏళ్ల వయసులోనే భారతీయ సినీ ప్రపంచంలో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన దివ్యభారతి జీవితం ఆశ్చర్యకరమైన మలుపులతో నిండి ఉంది. 1974 ఫిబ్రవరి 25న జన్మించిన దివ్యభారతి, నైన్త్ స్టాండర్డ్ వరకు చదువుకుంది. పదో తరగతి పాస్ కావాలని తాపత్రయపడిన మామూలు ఆడపిల్లలా కనిపించిన ఆమె, ఐదేళ్లలోనే అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుని అందాల తారగా ఎదిగిపోయింది. ఆమె సినీ రంగ ప్రవేశం, ప్రస్థానం అంతా అతి తక్కువ సమయంలోనే జరిగింది. ఎంత వేగంగా వెలుగులోకి వచ్చిందో, అంతలోనే అనూహ్యంగా అందరికీ దూరమై ఆకాశంలోకి ఎగిరిపోయింది. దివ్యభారతి మరణం వెనుక అనేక ప్రశ్నలు, మిస్టరీలు అలుముకున్నాయి. ఆమెది హత్యనా, ఆత్మహత్యా లేక ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనా అనేది నేటికీ జవాబు దొరకని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. చిన్నతనం నుండే స్వతంత్ర భావాలున్న దివ్యభారతి, తన కాళ్లపై తాను నిలబడాలని తపించేది.

సినిమాల్లోకి రాకముందే మోడలింగ్ చేసింది. కాలచక్ర చిత్ర నిర్మాత దిలీప్ శంకర్ ఆమెను చూసి తన సినిమా కోసం ఎంపిక చేసి, ఆమె పేరును ప్రతీక్షగా మార్చాడు. ఆ తర్వాత నటుడు గోవిందా సోదరుడు కీర్తి, తన రాధా కా సంఘం సినిమా కోసం దివ్యను ఎంపిక చేసి పేరును రాధగా మార్చాడు. అయితే, అతని ప్రవర్తన నచ్చక ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. బోనీ కపూర్ కూడా మొదట తన ప్రేమ్ చిత్రానికి ఆమెను తీసుకుని తర్వాత తీసేశారు. ఈ సంఘటనలతో విసిగెత్తిపోయిన దివ్యభారతి, సినిమాల్లో నటించనని తల్లిదండ్రులకు చెప్పేసింది. అలాంటి సమయంలోనే విక్టరీ వెంకటేష్ నటించిన “బొబ్బిలి రాజా” చిత్రంలో అవకాశం లభించింది. ఈ చిత్రం ఆమె జాతకాన్ని మార్చేసింది. ఆ ఒక్క సినిమాతోనే దివ్యభారతి అందరికీ హాట్ ఫేవరెట్ అయింది, శ్రీదేవి పోలికలు ఆమెకు అదనపు ఆకర్షణగా మారాయి. రెండేళ్లు తిరక్కుండానే దివ్య 20 చిత్రాల్లో నటించింది. ఇందులో 14 హిందీ చిత్రాలు, 6 తెలుగు సినిమాలు ఉన్నాయి. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, రమేష్ బాబు సరసన ఒక్కో సినిమాలో, మోహన్ బాబుకు జంటగా రెండు చిత్రాల్లో నటించింది. అధిక పారితోషికం డిమాండ్ చేస్తుందని వార్తలు వచ్చినా, ఆ రోజుల్లోనే రోజుకు లక్ష రూపాయల పారితోషికం తీసుకుందని చెబుతారు.

హీరోయిన్‌గా మంచి పొజిషన్‌లో ఉన్న తరుణంలో, సాజిద్ నడియాడ్ వాలాను ప్రేమించి, తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకుంది. తన పేరును సనగా మార్చుకుంది కూడా. తన పెళ్లి విషయం తెలిస్తే డిమాండ్ పడిపోతుందని రహస్యంగా ఉంచింది. 19 ఏళ్ల వయసు కలిగిన దివ్యభారతికి జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకుని నిలిచే మనోధైర్యం ఎక్కడ నుండి వస్తుంది? ఆమె మరణించడానికి ఒకరోజు ముందు మద్రాస్‌లో షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చి, తల్లితో ఘర్షణ పడిందని చెబుతారు. 1993 ఏప్రిల్ 5, దివ్యభారతి మన అందరికీ దూరమైన రోజు. అంధేరీలో ఉన్న తులసి బిల్డింగ్స్ ఐదో అంతస్తు నుంచి కింద పడి మరణించింది. ప్రమాదవశాత్తు ఆమె కిందపడిందా లేక ఎవరైనా ఆమెను కిందకు తోసేశారా అన్నది ఇప్పటికీ మిస్టరీనే. దివ్యభారతి మరణించే నాటికి 36 చిత్రాలకు కమిట్ అయి ఉంది. వాటిలో 14 చిత్రాలు నిర్మాణం పూర్తి కావస్తుండగా, నాలుగు చిత్రాలు డబ్బింగ్ దశలో, రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తెలుగులో దివ్య నటించిన చివరి చిత్రం తొలి ముద్దు. ఆమె ఆకస్మిక మరణంతో మిగిలిన వర్క్‌ను హీరోయిన్ రంభతో చిత్రీకరించి పూర్తి చేశారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరో.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. కానీ తెలుగులో అట్టర్ ప్లాప్.. కారణం ఇదే..

దివ్యభారతి ఫోటో..

Divya Bharati News

Divya Bharati News

ఎక్కువమంది చదివినవి : Rajanna Movie : రాజన్న సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. టాలీవుడ్ నటుడు..

Follow Us
స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కి ఇక పండుగే.. హైదరాబాద్‌లో స్ట్రీట్ హబ్..
స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కి ఇక పండుగే.. హైదరాబాద్‌లో స్ట్రీట్ హబ్..
అమ్మవారికి ఇష్టమైన శ్రావణ మాస ప్రసాదం.. ఇలా చేస్తే తప్పక దీవెనే
అమ్మవారికి ఇష్టమైన శ్రావణ మాస ప్రసాదం.. ఇలా చేస్తే తప్పక దీవెనే
గ్రహణానికి ముందే జాగ్రత్త.. గర్భిణీలు పాటించాల్సిన నియమాలు ఇవే
గ్రహణానికి ముందే జాగ్రత్త.. గర్భిణీలు పాటించాల్సిన నియమాలు ఇవే
వరంగల్‌కు రెండో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ హాస్పిటల్‌.. ఆరోగ్యశాఖ
వరంగల్‌కు రెండో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ హాస్పిటల్‌.. ఆరోగ్యశాఖ
శ్రీలంకపై  డబుల్ సెంచరీ బాదిన రికార్డ్ వీరులు వీరే
శ్రీలంకపై  డబుల్ సెంచరీ బాదిన రికార్డ్ వీరులు వీరే
300లకు పైగా సినిమాలు.. 66 ఏళ్లకే ఆత్మహత్య..
300లకు పైగా సినిమాలు.. 66 ఏళ్లకే ఆత్మహత్య..
ఒక ఫీల్డింగ్ కోచ్ కోసం టీమిండియా క్రికెటర్ల కన్నీళ్లు!
ఒక ఫీల్డింగ్ కోచ్ కోసం టీమిండియా క్రికెటర్ల కన్నీళ్లు!
ఈ 3 భారతీయ నగరాల్లో దొరికే స్ట్రీట్ ఫుడ్‌కు ప్రపంచమే ఫిదా!
ఈ 3 భారతీయ నగరాల్లో దొరికే స్ట్రీట్ ఫుడ్‌కు ప్రపంచమే ఫిదా!
డిగ్రీ ప్రవేశాలకు ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ 2026 విడుదల
డిగ్రీ ప్రవేశాలకు ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ 2026 విడుదల
కీలక గ్రహాల అనుకూలత.. వారికి ఆర్థిక, రుణ సమస్యల నుంచి విముక్తి!
కీలక గ్రహాల అనుకూలత.. వారికి ఆర్థిక, రుణ సమస్యల నుంచి విముక్తి!
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!