కౌన్ బనేగా బీహార్ సీఎం.. NDA చర్చల్లో తేలిందేంటి..? కేబినెట్ షేరింగ్‌లో ఎవరికెంత..?
బీహార్ ఎన్నికల్లో NDA కూటమి సంచలన విజయం సాధించింది. 243 సీట్లలో ఏకంగా 202 స్థానాలు కైవసం చేసుకుని గ్రాండ్ విక్టరీ కొట్టేసింది. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలను క్లీన్ స్వీప్ చేసేసింది. బీహార్-కాషేర్ నితీష్‌కుమార్ మరో రికార్డ్ సృష్టించబోతున్నారా..? 10వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారా..? NDA చర్చల్లో తేలిందేంటి..? అటు కేబినెట్ షేరింగ్‌లో ఎవరికెంత..? ఇప్పుడివే అంశాలు ఆసక్తికరంగా మారాయి.

బీహార్ ఎన్నికల్లో NDA కూటమి సంచలన విజయం సాధించింది. 243 సీట్లలో ఏకంగా 202 స్థానాలు కైవసం చేసుకుని గ్రాండ్ విక్టరీ కొట్టేసింది. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలను క్లీన్ స్వీప్ చేసేసింది. బీజేపీ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరిస్తే.. జేడీయూ 85 సీట్లతో విజయదుందుభి మోగించింది. ఇదిలా ఉంటే, 18వ బీహార్ అసెంబ్లీ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ కావడంతో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. ఈ నేపధ్యంలో నితీష్ కుమార్ ఇవాళ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. 17వ అసెంబ్లీ రద్దుకు ఈ సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఆ తర్వాత నితీష్ కుమార్ తన రాజీనామాను గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌కు సమర్పిస్తారు. దీంతో, తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది.
NDA భాగస్వామ్య పక్షాల సమావేశంలో సీఎం అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైనట్లు గవర్నర్‌కు సమాచారం ఇవ్వనున్నారు. దాదాపుగా నితీష్‌కుమారే మరోసారి సీఎం పీఠం ఎక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రధాని మోదీ షెడ్యూల్ చూసుకుని నవంబర్ 19-20 తేదీల్లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉండనుంది. ఇప్పటికే, పాట్నాలోని గాంధీ మైదానంలో సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రధాని మోడీతో పాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.
ఇక కేబినెట్ కూర్పుపై ఇప్పటికే చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఎన్డీయే ప్రతిపాదించినట్టు చెబుతున్న ఫార్ములా ప్రకారం, బీజేపీకి కేబినెట్‌లో సింహభాగం వాటా దక్కనుంది. 15 నుంచి 16 మంత్రి పదవులు లభించే అవకాశం ఉంది. జేడీయూకు 14 మంత్రి పదవుల వరకూ దక్కొచ్చు. చిరాగ్ పాశ్వాన్ LJPకి 3 మంత్రి పదవులు, జితిన్ రామ్ మాంఝీ సారథ్యంలోని HAMకు ఒకటి, రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహ RLMకు కూడా ఒక మంత్రి పదవి దక్కే వీలుంది.
మొత్తంగా… ఇటు సీఎంగా ఎవరు ప్రమాణం చేస్తారు…? అటు కేబినెట్‌లో ఎవరి షేరింగ్ ఎంత…? అన్న విషయాలపై ఇవాళో,రేపో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




