AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Deverakonda Rashmika : పెళ్లి తర్వాత విజయ్, రష్మిక కీలక నిర్ణయం.. మెచ్చుకుంటున్న అభిమానులు..

టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ తన సతీమణి రష్మిక మందన్నతో కలిసి తన సొంతూరుకు వెళ్లారు. పెళ్లి తర్వాత మొదటిసారిగా తన గ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా, బల్మూర్ మండలం, తుమ్మెన్‌పేటలో కుటుంబంతో కలిసి సందడి చేశారు. అక్కడ నూతనంగా నిర్మించిన ఇంట్లో సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. అలాగే ఊరందరికీ పెళ్లి విందు ఏర్పాటు చేశా. ఈ స్టార్ జంట రాకతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

Vijay Deverakonda Rashmika : పెళ్లి తర్వాత విజయ్, రష్మిక కీలక నిర్ణయం.. మెచ్చుకుంటున్న అభిమానులు..
Vijay, Rashmika Movies
Rajitha Chanti
|

Updated on: Mar 03, 2026 | 12:06 PM

Share

ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన హీరో విజయ్ దేవరకొండ తన సతీమణి రష్మిక మందన్న, కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఊరు తుమ్మన్ పేటకు వెళ్లారు. నాగర్ కర్నూలు జిల్లాలోని బల్మూరు మండలంలో ఉన్న తుమ్మన్ పేట విజయ్ సొంతూరు. పెళ్లైన తర్వాత తొలిసారి సొంతూరుకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు విజయ్ దేవరకొండ. దీంతో తుమ్మన్ పేట గ్రామస్థులు విజయ్ కుటుంబానికి ఘన స్వాగతం పలికారు. ఈ గ్రామంలో ఉన్న తమ స్వగృహంలో సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకున్నారు విజయ్, రష్మిక. అలాగే స్థానిక ప్రజలందరికీ విజయ్ కుటుంబ సభ్యులు పెళ్లి విందు ఏర్పాటు చేశారు. అనంతరం రష్మిక, విజయ్ ఇద్దరూ అక్కడున్న ప్రజలతో మాట్లాడారు.

ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu: ఆ హీరోను ప్రతిరోజూ తలుచుకుంటా.. బతికితే అతడిలా బతకాలి.. జగపతి బాబు..

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ సొంత గ్రామంలో పెళ్లి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. “సొంత గ్రామంలో పెళ్లి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉంది. మా జంటకు ఆశీస్సులు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మన గ్రామానికి చాలా మంచి పనులు చేయాలని ఉంది. ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ మాకు సొంత ఇళ్లు, పొలమూ ఉన్నాయి. ఇక నుంచి తరుచుగా మన గ్రామానికి వస్తాను. అచ్చం పేట డివిజన్ లో ఉన్న 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 9, 10వ తరగతి విద్యార్థులకు విజయ్ దేవరకొండ ఛారిటబుల్ ట్రస్ట్ తరుపున స్కాలర్ షిప్స్ అందిస్తాం” అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : సందీప్ రెడ్డి వంగాకు మెసేజ్ చేసి పిచ్చోడిని అయిపోయా.. టాలీవుడ్ హీరో..

మరోవైపు మార్చి 4న హైదరాబాద్ లో రష్మిక, విజయ్ రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకు సినీప్రముఖులు, రాజకీయ నాయకులు హజరు కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్, రష్మిక ఇద్దరు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అలాగే వీరిద్దరి కలిసి రణబాలి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఏందయ్యా సామీ సాంగ్ వైరలవుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. ఎర్ర ఎర్ర రుమాల్ పాటకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే..

Follow Us
ఆటో కాదన్న.. అది టీవీఎస్.. ఆరుగురిని ఎక్కించుకుని..
ఆటో కాదన్న.. అది టీవీఎస్.. ఆరుగురిని ఎక్కించుకుని..
రోడ్డుకి ఇరుపక్కల కూర్చుని పరీక్ష రాసిన విద్యార్ధులు! వీడియో
రోడ్డుకి ఇరుపక్కల కూర్చుని పరీక్ష రాసిన విద్యార్ధులు! వీడియో
పవర్ ప్లాంట్‌లో భారీపేలుడు.. 9 మంది మృతి!
పవర్ ప్లాంట్‌లో భారీపేలుడు.. 9 మంది మృతి!
మీ ఇంట్లో క్యాలెండర్ ఈ దిశలో ఉందా? దురదృష్టం వెంటాడుతుందట!
మీ ఇంట్లో క్యాలెండర్ ఈ దిశలో ఉందా? దురదృష్టం వెంటాడుతుందట!
సిలిండర్ ఎందుకు పేలుతుంది? మీ ప్రాణాలను కాపాడుకునే బెస్ట్‌ టిప్స్
సిలిండర్ ఎందుకు పేలుతుంది? మీ ప్రాణాలను కాపాడుకునే బెస్ట్‌ టిప్స్
గ్యాస్ సిలిండర్లు డెలివరి చేయడం లేదని.. గ్రామస్తులు ఏం చేశారంటే
గ్యాస్ సిలిండర్లు డెలివరి చేయడం లేదని.. గ్రామస్తులు ఏం చేశారంటే
ఏసీ కొనాలని ఉందా? కేవలం రూ.1 కే కొత్త ఏసీని ఇంటికి తీసుకెళ్లండి..
ఏసీ కొనాలని ఉందా? కేవలం రూ.1 కే కొత్త ఏసీని ఇంటికి తీసుకెళ్లండి..
భారీ మోసం.. రూ. 500 కోట్లతో బోర్డు తిప్పేసిన మరో సంస్థ..!
భారీ మోసం.. రూ. 500 కోట్లతో బోర్డు తిప్పేసిన మరో సంస్థ..!
మీ జుట్టు పెరగకపోవడానికి అసలు కారణం ఇదే.. ఇలా చెక్ పెట్టండి!
మీ జుట్టు పెరగకపోవడానికి అసలు కారణం ఇదే.. ఇలా చెక్ పెట్టండి!
తెలంగాణలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు.. రోజుకు 20 మంది మృతి!
తెలంగాణలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు.. రోజుకు 20 మంది మృతి!