AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సన్‌స్క్రీన్ రాస్తున్నా చర్మం నల్లబడుతోందా? ఎండ నుండి స్కిన్‌ను కాపాడుకోవడానికి SPF సరిపోదు!

వేసవి కాలం మొదలైందంటే చాలు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటాడు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమైన యూవీ (UV) కిరణాల నుండి చర్మాన్ని కాపాడుకోవడం ఇప్పుడు అందరికీ పెను సవాలుగా మారింది. ముఖ్యంగా భారతీయ చర్మంపై ఎండ ప్రభావం చాలా భిన్నంగా ఉంటుంది.

సన్‌స్క్రీన్ రాస్తున్నా చర్మం నల్లబడుతోందా? ఎండ నుండి స్కిన్‌ను కాపాడుకోవడానికి SPF సరిపోదు!
Summer Skin Care.jpg
Nikhil
|

Updated on: Mar 02, 2026 | 9:27 PM

Share

కేవలం సన్‌స్క్రీన్ రాసుకుంటే సరిపోతుందని చాలా మంది భావిస్తారు, కానీ అది నిజం కాదు. భారతీయ చర్మ తత్వానికి తగ్గట్టుగా ప్రత్యేకమైన రక్షణ అవసరమని చర్మ రోగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండలో బయటకు వెళ్లే ముందు సన్‌స్క్రీన్ రాసుకున్నా కూడా ముఖంపై నల్లటి మచ్చలు, టానింగ్ వస్తున్నాయా? ఎండ తగిలినా మా చర్మం కందిపోదు కదా అని ధీమాగా ఉంటున్నారా?

అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే. భారతీయ చర్మం పైన కనిపించే రంగు కంటే లోపల జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. కొల్లాజెన్ విచ్ఛిన్నం కావడం నుండి అకాల వృద్ధాప్యం వరకు ఎన్నో సమస్యలు పొంచి ఉన్నాయి. ఈ వేసవిలో మీ చర్మాన్ని మెరిసేలా ఉంచుకోవడానికి సన్‌స్క్రీన్‌తో పాటు ఇంకా ఏం చేయాలో తెలుసుకుందాం..

  • భారతీయ చర్మం సాధారణంగా ఫిట్జ్‌పాట్రిక్ స్కిన్ టైప్ III-V కిందకు వస్తుంది. మన చర్మంలో మెలనిన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఎండకు త్వరగా కాలిపోకపోయినా, మొండి పిగ్మెంటేషన్, మెలస్మా, టానింగ్ వంటి సమస్యలకు త్వరగా గురవుతుంది. “చర్మం ఎర్రబడటం లేదు కదా అని నష్టం జరగడం లేదని అనుకోవద్దు.. లోపల చర్మ పొరలు దెబ్బతినడం వల్ల ముడతలు, రంగు మారడం వంటివి జరుగుతాయి” అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
  • ఎండ నుండి రక్షణలో మొదటి అడుగు సరైన సన్‌స్క్రీన్. UVA మరియు UVB కిరణాల నుండి రక్షణ ఇచ్చే SPF 30-50 ఉన్న ‘బ్రాడ్-స్పెక్ట్రమ్’ సన్‌స్క్రీన్‌ను ఎంచుకోవాలి. మన దేశంలోని తేమతో కూడిన వాతావరణానికి జిడ్డు లేని, చెమటకు తట్టుకునే ఫార్ములాలు ఉత్తమం. ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి సన్‌స్క్రీన్‌ను మళ్ళీ అప్లై చేయడం చాలా ముఖ్యం.
  • సన్‌స్క్రీన్‌తో పాటు చర్మానికి లోపలి నుండి రక్షణ ఇచ్చేవి యాంటీ ఆక్సిడెంట్స్. ఉదయం వేళ చర్మ సంరక్షణలో విటమిన్-సి, నియాసినామైడ్, గ్రీన్ టీ ఎక్స్‌ట్రాక్ట్స్ వంటివి వాడటం వల్ల యూవీ కిరణాల వల్ల కలిగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడమే కాకుండా పిగ్మెంటేషన్ పెరగకుండా అడ్డుకుంటాయి.
  • తీవ్రమైన వేడి వల్ల చర్మం తన సహజ తేమను కోల్పోయి సున్నితంగా మారుతుంది. దీనిని నివారించడానికి హైలురోనిక్ యాసిడ్, సెరమైడ్స్, పాంథెనాల్ వంటి పదార్థాలు ఉన్న మాయిశ్చరైజర్లను వాడాలి. ఇవి చర్మం యొక్క సహజ అవరోధాన్ని బలోపేతం చేసి, మంటను తగ్గిస్తాయి.

స్క్రీన్ కేర్ తో పాటు భౌతిక రక్షణ కూడా అవసరమే. ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల మధ్య ఎండలో వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ, సన్ గ్లాసెస్ తప్పనిసరిగా వాడాలి. మొండి మచ్చలు ఉంటే మెడి-ఫేషియల్స్, కెమికల్ పీల్స్ వంటి నిపుణుల చికిత్సలు తీసుకోవడం మేలు. ఈ వేసవిలో మీ చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే సన్‌స్క్రీన్, హైడ్రేషన్, రక్షణ అలవాట్లను క్రమం తప్పకుండా పాటించాలి.

Follow Us