24 గంటలు AC వాడినా నో ప్రాబ్లమ్.. ఈజీగా కరెంట్ బిల్లు తగ్గించే చిట్కాలు ఇవే!

Samatha

02  march 2026

సమ్మర్ వచ్చిందంటే చాలు, అధిక వేడి, ఉక్కపోతతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. దీంతో కూలర్, ఏసీ కొనుగోలు చేసి ఉపయోగిస్తుంటారు.

సమ్మర్

ముఖ్యంగా ఎక్కువ మంది రోజు మొత్తం ఏసీ పెట్టుకొని ఉండటానికి ఇష్టపడుతుంటారు. కానీ కొందరు కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని ఏసీని ఎప్పుడో ఒకసారి ఆన్ చేస్తుంటారు.

ఏసీ

కానీ రోజులో 24 గంటలు ఏసీ వాడిన నో ప్రాబ్లమ్ అంటున్నారు నిపుణులు. ఎందుకంటే? ఈ సింపుల్ చిట్కాల ద్వారా కరెంట్ బిల్లు సులభంగా తగ్గించుకోవచ్చునంట.

24 గంటలు

ఏసీలో కూలింగ్ సెట్టింగ్ విద్యుత్ బిల్లును ప్రభావితం చేస్తుంది. అందువలన దాదాపు 24 నుంచి 26 డిగ్రీల మధ్య ఏసీ ఉంచడం చాలా మంచిది.

కూలింగ్ సెట్టింగ్

అదే విధంగా,  ఏసీ వాడినంత సేపు కిటికీలు, తలుపులు మూసి వేయాలి. దీని వలన బయటి వేడి గాలి లోపలికి రాదు, ఏసీ ఆఫ్ చేసిన రూమ్ చల్లగా ఉంటుంది.

డోర్స్ క్లోజ్

అదే విధంగా,  ఏసీ ఫిల్టర్ క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. దీని వలన కరెంట్ బిల్లు తక్కువా వస్తుందంట.

ఏసీ ఫిల్టర్

చాలా మంది ఏసీని రిమోట్‌తో ఆఫ్ చేసి, ఏసీ ఆఫ్ చేశాం అనుకుంటారు. కానీ ఇలా చేయడం వలన ఏసీ కరెంట్‌‌ను వినియోగించుకుంటుంది. అందుకే ప్లగ్ వద్ద ఆఫ్ చేయాలి.

ప్లగ్

అలాగే ఏసీ వాడుతున్న సమయంలో ఫ్యాన్ కూడా వేయడం వలన చల్లదనం రూమ్ మొత్తం వ్యాపించి, త్వరగా రూమ్ చల్లగా మారుతుంది. దీని వలన కరెంట్ ఆదా అవుతుంది.

ఫ్యాన్