AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Scam: మీ కష్టార్జితం భద్రంగా ఉండాలంటే.. ఇవి తప్పక తెలుసుకోండి!

దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరిగే కొద్దీ ఆన్‌లైన్ ఆర్థిక మోసాలు కూడా పెరుగుతున్నాయి. బ్యాంకింగ్, యూపీఐ, క్రెడిట్ కార్డు మోసాల బారిన పడకుండా ఉండాలంటే వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. OTP, పిన్ వంటి వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు. ఫిషింగ్ లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

Scam: మీ కష్టార్జితం భద్రంగా ఉండాలంటే.. ఇవి తప్పక తెలుసుకోండి!
Gratuity
SN Pasha
|

Updated on: Mar 02, 2026 | 8:32 PM

Share

దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న కొద్దీ ఫైనాన్షియల్ ఫ్రాడ్‌లు కూడా వేగంగా పెరుగుతున్నాయి. బ్యాంకింగ్, UPI, క్రెడిట్ కార్డు మోసాల ద్వారా సాధారణ ప్రజల డబ్బు దోచుకునే ఘటనలు ఇటీవల ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిపుణుల ప్రకారం.. వ్యక్తిగత సమాచారం రహస్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. OTP, CVV, పిన్, నెట్‌బ్యాంకింగ్ పాస్‌వర్డ్ వంటి వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు. బ్యాంకులు లేదా అధికార సంస్థలు ఎప్పుడూ ఫోన్‌లో ఈ వివరాలు అడగవని గుర్తుంచుకోవాలి. అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజ్‌లు వస్తే వెంటనే నిర్లక్ష్యం చేయడం ఉత్తమం.

ఫిషింగ్ లింకులు పెద్ద ప్రమాదంగా మారుతున్నాయి. బహుమతులు, క్యాష్‌బ్యాక్‌లు లేదా KYC అప్‌డేట్ పేరుతో వచ్చే లింకులను క్లిక్ చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారానే సేవలు వినియోగించాలి. అదనంగా మొబైల్‌లో యాంటీవైరస్, అధికారిక యాప్‌లనే ఉపయోగించడం సురక్షిత పద్ధతి. UPI ఉపయోగించే వారు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు స్వీకరించేందుకు కలెక్ట్ రిక్వెస్ట్ కు పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోవాలి. పిన్ ఎంటర్ చేస్తే డబ్బు డెబిట్ అవుతుంది. అలాగే స్క్రీన్ షేర్ యాప్‌లు డౌన్‌లోడ్ చేయమని ఎవరైనా చెప్పితే వెంటనే తిరస్కరించాలి.

ఏదైనా మోసం జరిగినట్లు అనుమానం వచ్చిన వెంటనే బ్యాంకును సమాచారం ఇవ్వాలి. అలాగే 1930 హెల్ప్‌లైన్ లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. చిన్న నిర్లక్ష్యం పెద్ద ఆర్థిక నష్టానికి దారితీసే అవకాశం ఉన్నందున డిజిటల్ లావాదేవీల్లో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండటం అత్యంత కీలకమని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర