SIM Card: మీ పాత సిమ్ కార్డ్ వేరేవారికి ఇస్తున్నారా..? మీరు డేంజర్‌లో ఉన్నట్లే.. జైలుకు కూాడా వెళ్లే ఛాన్స్..
ఫ్రెండ్ అని లేదా తెలిసినవారని మీ సిమ్ కార్డులు వేరేవారికి ఇస్తున్నారా.. అయితే ఇప్పటినుంచి ఇక మీు జాగ్రత్తగా ఉండాల్సిందే.. ఇక నుంచి అలా చేయడం నేరం. ఆ తప్పుకు మీరు జైలుకు కూడా వెళ్లే అవకాముంది. తాజాగా వచ్చిన కొత్త రూల్స్ ఇలా ఉన్నాయి.

ఎక్కువ సిమ్ కార్డులు వాడే అలవాటు చాలామందికి ఉంటుంది. పదే పదే కొత్త నెంబర్లను తీసుకుని సిమ్ కార్డులు మారుస్తూ ఉంటారు. పాత సిమ్ కార్డులను ఎక్కడో మూలన పడేసి వాటి గురించి పట్టించుకోవడమే మానేస్తారు. కొంతమంది వేరే వ్యక్తులకు లేదా తెలిసిన వ్యక్తులకు అలాంటి సిమ్ కార్డులను ఇస్తూ ఉంటారు. ఒకవేళ మీరు అలా ఇచ్చిన సిమ్ కార్డులను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వాడితే మీరే నష్టపోతారు. తప్పు వేరేవాళ్లు చేసినా మీ పేరు మీదే నెంబర్ ఉంటుంది గనుక మీరు జైలు పాలు కావాల్సి వస్తుంది. ఇటీవల సైబర్ నేరాలు, చట్ట వ్యతిరేక పనుల కోసం సిమ్ కార్డులను ఇలా దుర్వినియోగం చేసే మోసగాళ్లు ఎక్కువైపోయారు. ఈ క్రమంలో భారత టెలికాం విభాగం కీలక సూచనలు జారీ చేసింది.
మీ పేరు మీద ఉన్న నెంబర్లను వేరేవారికి ఇవ్వడం నేరమని టెలికాం విభాగం వెల్లడించింది. ఇలాంటి సిమ్‌లను చట్ట వ్యతిరేక పనులకు వాడితే తీవ్ర పరిమాణాలు ఉంటాయని హెచ్చరించింది. సిమ్ వాడిన వ్యక్తితో పాటు సిమ్ యాజమానిపై కూడా చర్యలు తీసుకుంటామంటూ వార్నింగ్ జారీ చేసింది. వేరేవాళ్లకి ఇచ్చినందుకు మీరు ఇబ్బంది పడాల్సి వస్తుందని తెలిపింది. ఇక నకిలీ డాక్యుమెంట్స్ ఉపయోగించి సిమ్ కొనుగోలు చేయడం, ట్యాంపర్ చేసిన సిమ్ బాక్సులను కొనుగోలు చేయడం నేరమని స్పష్టం చేసింది. కాలింగ్ లైన్ ఐడెంటిటీ, ఇతర టెలికాం గుర్తింపులను మార్చే వెబ్‌సైట్లు, యాప్స్‌ను వాడొద్దని ప్రజలకు సూచించింది.
ఇక టెలికమ్యూనికేషన్స్ చట్టం ప్రకారం మొబైల్స్, ఇతర డివైజుల్లో IMEI నెంబర్‌ను ట్యాంపర్ చేస్తే మూడేళ్ల జైలు, 50 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని భారత టెలికాం విభాగం తెలిపింది. ఇక 2024 టెలికమ్యూనికేషన్ రూల్స్ ప్రాకంర IMEI మార్పు చేసిన డివైజ్‌లను వాడటం తీవ్ర నేరమని, మీరు మొబైల్ కొనుగోలు చేసే సమయంలో సంచార్ సాథి వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవాలని సైచించింది. ఇక మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు.




