ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఫలితాలు

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి(విధాన పరిషత్) రాష్ట్ర శాసన వ్యవస్థలోని సభల్లో ఎగువ సభ అని అంటారు. 1958 నుండి 1985 వరకు, మరలా తిరిగి 2007 నుండి 2014 వరకు ఈ వ్యవస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉనికిలోవుంది. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం, 2014లోని సెక్షన్ 22 ప్రకారం రెండు రాష్ట్రాలకు శాసనమండలులు ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనమండలి కొనసాగుతుంది. శాసన మండలి శాశ్వత సభ. ఇందులో 58 మంది సభ్యులు ఉంటారు. సభ్యుల సాధారణ కాలపరిమితి ఆరు సంవత్సరాలు. అందులో 1/3 వంతు మంది ప్రతీ రెండు సంవత్సరాలకు సభ్యత్వం పూర్తి చేసుకుంటారు. కొత్త సభ్యులు ఎన్నికవుతారు. శాసనమండలి సభ్యుడిగా ఉండాల్సిన వ్యక్తికి భారత పౌరసత్వం కలిగి ఉండాలి. కనీసం 30 ఏళ్ళ వయసు ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఓటు హక్కు కలిగి ఉండాలి. అతడు/ఆమె అదే కాలంలో పార్లమెంటు సభ్యునిగా ఉండరాదు. 20 మంది సభ్యులు శాసనసభ్యుల ద్వారా, 20 మంది సభ్యులు అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల సముదాయం ద్వారా, 10 మంది సభ్యులు పట్టభద్రులు, ఉపాధ్యాయుల నుండి ఎన్నుకోబడతారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ద్వారా 8 మంది సభ్యులు నామినేట్ చేయబడతారు.

అభ్యర్థుల జాబితా 2024

రాష్ట్రం సీటు అభ్యర్థి పేరు ఓటు పార్టీ స్థితి
Andhra Pradesh SATTENAPALLE Kanna Lakshminarayana 117965 TDP Won
Andhra Pradesh URAVAKONDA Payyavula Keshav 102046 TDP Won
Andhra Pradesh PUNGANUR Peddireddy Ramachandra Reddy 100793 YSRCP Won
Andhra Pradesh PILERU Nallari Kishore Kumar Reddy 105582 TDP Won
Andhra Pradesh DHONE Buggana Rajendranath 24248 YSRCP Lost
Andhra Pradesh PULIVENDULA YS Jagan Mohan Reddy 116315 YSRCP Won
Andhra Pradesh TENALI Nadendla Manohar 123961 JSP Won
Andhra Pradesh MANGALAGIRI Nara Lokesh 167710 TDP Won
Andhra Pradesh KUPPAM Nara Chandrababu Naidu 121929 TDP Won
Andhra Pradesh NUZVID Kolusu Parthasarathy 108229 TDP Won
Andhra Pradesh ALLAGADDA Bhuma Akhila Priya 98881 TDP Won
Andhra Pradesh NARASANNAPETA Dharmana Krishna Das 6668 YSRCP Lost
Andhra Pradesh NAGARI R.K. ROJA 6627 YSRCP Lost
Andhra Pradesh JAGGAMPETA Jyothula Nehru 113593 TDP Won
Andhra Pradesh PEDDAPURAM Nimmakayala Chinarajappa 105685 TDP Won
Andhra Pradesh NELLORE RURAL Kotamreddy Sridhar Reddy 109975 TDP Won
Andhra Pradesh RAPTADU Paritala Sunitha 116140 TDP Won
Andhra Pradesh శ్రీకాకుళం Dharmana Prasada Rao 3733 YSRCP Lost
Andhra Pradesh YEMMIGANUR Butta Renuka 3572 YSRCP Lost
Andhra Pradesh TEKKALI Kinjarapu Atchannaidu 107923 TDP Won
Andhra Pradesh JAGGAMPETA Thota Narasimham 3251 YSRCP Lost
Andhra Pradesh హిందూపూర్ Nandamuri Balakrishna 107250 TDP Won
Andhra Pradesh DHARMAVARAM Kethireddy Venkatarami Reddy - YSRCP Lost
Andhra Pradesh AMADALAVALASA Tammineni Sitaram - YSRCP Lost
Andhra Pradesh VIJAYAWADA WEST Y. Sujana Chowdary 105669 BJP Won
Andhra Pradesh ANAKAPALLE Konathala Rama Krishna 115126 JSP Won
Andhra Pradesh BHIMILI GANTA SRINIVASA RAO 176230 TDP Won
Andhra Pradesh PITHAPURAM PAWAN KALYAN KONIDALA 134394 JSP Won
Andhra Pradesh CHEEPURUPALLI Botsa Satyanarayana - YSRCP Lost
Andhra Pradesh PITHAPURAM Vanga Geetha - YSRCP Lost

ఆంధ్రప్రదేశ్ శాసనసభ చివరి ఎన్నికలు 2019లో జరిగాయి. ఏప్రిల్ 11, 2019న ఆంధ్రప్రదేశ్ 175 అసెంబ్లీ, 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల రోజు ముగిసే సమయానికి 79.88% ఓటింగ్ నమోదైంది, ఇది 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల కంటే 1.92% ఎక్కువ. ఈ ఎన్నికల్లో 15,545,211 మంది పురుషులు, 15,787,759 మంది మహిళా ఓటర్లు తమ ఓటు వేశారు. 39,345,717 మంది ఓటర్లలో మొత్తం 31,333,631 మంది ఎన్నికల్లో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 85.93%, గుంటూరు జిల్లాలో 82.37 %, అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో 73.67% పోలింగ్ నమోదైంది. అద్దంకి నియోజకవర్గంలో అత్యధికంగా 89.82%, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో అత్యల్పంగా 58.19% ఓటింగ్ నమోదైంది.

FAQ’s: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు 2024కు సంబంధించిన ప్రశ్నలు, సమాధానాలు:-

ప్రశ్న:- శాసనమండలి సభ్యుడిగా అర్హత సాధించాలంటే ఎన్ని ఏళ్లు నిండి ఉండాలి.?

సమాధానం:- భారత పౌరసత్వం కలిగి ఉండటంతో పాటు కనీసం 30 ఏళ్ళ వయసు ఉండాలి

ప్రశ్న:- శాసనసభ్యులను ఎవరు ఎన్నుకుంటారు?

సమాధానం:- అర్హులైన ఓటర్లు తమ ఓటు ద్వారా ప్రత్యక్షంగా శాసనసభ్యులను ఎన్నుకుంటారు.

ప్రశ్న:- శాసనసభలో మెజార్టీ కోసం ఎంత మంది సభ్యులు కావాలి?

సమాధానం:- శాసనసభలో మెజార్టీ కోసం 88 మంది సభ్యుల మద్ధతు కావాలి.

ప్రశ్న:- ఎన్నికల్లో అభ్యర్థులు డిపాజిట్ కోల్పోవడం అంటే ఏంటి?

సమాధానం:- నియోజకవర్గంలో పోలైన మొత్తం ఓట్లలో ఆరో వంతు కంటే తక్కువ ఓట్లు పొందిన అభ్యర్థి తాను నామినేషన్ దాఖలు సమయంలో చెల్లించిన డిపాజిట్‌ను కోల్పోవాల్సి ఉంటుంది.

ఎన్నికల వీడియో