బుగ్గన రాజేంద్రనాథ్ ఎన్నికల ఫలితాలు 2024
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 1970 సెప్టెంబరు 27న జన్మించారు. ఆయన రాజకీయ నాయకుడే కాదు.. వ్యాపారవేత్త. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా లోని బేతంచర్ల లో బుగ్గన రామనాథరెడ్డి (ఐఐటి ఖరగ్‌పూర్ గ్రాడ్యుయేట్, బేతంచర్ల గ్రామ సర్పంచి), పార్వతీ దేవి దంపతులకు జన్మించాడు. బుగ్గన రాజేంద్రనాథ్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించాడు. ఆ తర్వాత చెన్నైలోని మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించాడు. తరువాత 1992 లో బళ్లారిలోని రావు బహదూర్ వై మహాబలేశ్వరప్ప ఇంజనీరింగ్ కళాశాల (పూర్వం విజయనగర ఇంజనీరింగ్ కళాశాల) నుండి కంప్యూటర్ సైన్స్ లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పట్టభద్రుడయ్యాడు. అతను తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ భాషలలో నిష్ణాతుడు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆర్థిక, ప్రణాళిక, శాసన వ్యవహారాల మంత్రిగా వ్యవహరిస్తున్నారు. 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ధోన్ నియోజకవర్గానికి శాసన సభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2016-19 వరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (ఇండియా) (పిఎసి) ఛైర్మన్‌గా కూడా పనిచేశాడు. మృధుస్వభావి, సంస్కారవంతుడైన రాజేంద్రనాథ్ శాసనసభ చర్చల్లో సరళమైన, ఛలోక్తులతో, విషయపరిఙ్ఞానంతో కూడిన ప్రసంగాలు ఇస్తుంటాడు.