Srikar T

Srikar T

Sub Editor, Hyper Local, Politics - TV9 Telugu

sreekhar.thankasala@tv9.com

తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 3 ఏళ్ల అనుభవం ఉంది. 2021లో ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం నుంచి పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం కోర్సు పూర్తి చేసి గ్రేట్ ఆంధ్రా డిజిటల్‌కు సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2022లో ప్రైమ్9 న్యూస్ ఛానల్‌ల్లో స్పీడ్ న్యూస్ బులిటెన్‌కు సబ్ ఎడిటర్‌గా పనిచేశాను. ఆ తరువాత 2023లో డైల్ తెలుగు డిజిటల్ విభాగంలో సబ్ ఎడిటర్‌, కంటెంట్ రైటర్‌గా ఉన్నాను. ప్రస్తుతం టీవీ9లో సబ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను.

Read More
Lok Sabha Elections 2024: కాంగ్రెస్ గెలిస్తే తొలి ప్రాధాన్యత దేనికో చెప్పేసిన మంత్రి కోమటి రెడ్డి..

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ గెలిస్తే తొలి ప్రాధాన్యత దేనికో చెప్పేసిన మంత్రి కోమటి రెడ్డి..

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. మోడీ 10ఏళ్లు ఆదాని అంబానీలకు దోచి పెట్టారని ఆరోపించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‎లో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మాది డబుల్ RR కాదు.. మీది AA టాక్స్ ఆదాని, అంబానీ టాక్స్ అని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్‎కు 14, బిజేపికి 2 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ఒక్కటి గెలవదన్నారు. కేసీఆర్ గురించి మాట్లాడటం సుద్దదండగ అన్నారు. అగ్గిపెట్టే రావు హరీష్, కేటీఆర్‎లను ఘాటుగా విమర్శించారు.

  • Srikar T
  • Updated on: May 8, 2024
  • 2:51 pm
PM Modi: ‘ఏడాదికో ప్రధాని’.. వరంగల్ సభలో ఇండియా కూటమిపై మోదీ చురకలు.

PM Modi: ‘ఏడాదికో ప్రధాని’.. వరంగల్ సభలో ఇండియా కూటమిపై మోదీ చురకలు.

ఎన్డీయే విజయం మొదటి మూడు విడతల్లోనే తేలిపోయిందన్నారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ సీట్లు వెతుక్కోవడానికి మైక్రోస్కోప్ కావాలని ఎద్దేవా చేశారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. 40 ఏళ్లక్రితం దేశంలో ఇద్దరు బీజేపీ ఎంపీలు గెలిస్తే అందులో ఒకరు వరంగల్ ఎంపీ ఉండడం ఈ ప్రాంతానికి గర్వకారణమన్నారు. ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు భద్రకాళిని, రామప్ప శివుడికి దండం పెట్టుకొని ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

  • Srikar T
  • Updated on: May 8, 2024
  • 1:52 pm
Komati Reddy: తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే స్థానాలు ఎన్నంటే.. మంత్రి కోమటి రెడ్డి లెక్క ఇదే..

Komati Reddy: తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే స్థానాలు ఎన్నంటే.. మంత్రి కోమటి రెడ్డి లెక్క ఇదే..

బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‎లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మూడోసారి మోదీ ప్రధాని అయితే దేశంలో ఇక ఎన్నికలు ఉండవన్నారు. మన దేశంలోనూ రష్యా, చైనా తరహా పాలన వస్తుందని కీలక ఆరోపణలు చేశారు. రాజ్యాంగాన్ని మార్చి వాళ్లే పాలకులుగా ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 25 కోట్ల మంది ముస్లింల రిజర్వేషన్లు తీసేస్తామని ఎలా అంటారని బీజేపీకి కౌంటర్ వేశారు. వాళ్లంతా రోడ్ల మీదకు వస్తే ఏం జరుగుతుందో తెలుసా అని హెచ్చరించారు.

  • Srikar T
  • Updated on: May 8, 2024
  • 1:25 pm
Watch Video: ‘ పీఎం మోదీ ఆరడుగుల బుల్లెట్’.. వేములవాడ సభలో బండి సంజయ్..

Watch Video: ‘ పీఎం మోదీ ఆరడుగుల బుల్లెట్’.. వేములవాడ సభలో బండి సంజయ్..

కాంగ్రెస్ పార్టీ గుర్తు 'గాడిద గుడ్డు' అనేలా ఆ పార్టీ ప్రచారం చేస్తోందన్నారు బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. 'కాంగ్రెస్ ప్రభుత్వమే పెద్ద గాడిద గుడ్డు' అని కీలక వ్యాఖ్యలు చేశారు. వేములవాడలో నిర్వహించిన బహిరంగలో బండి సంజయ్ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో విఫలమ్యారని ధ్వజమెత్తారు. మహిళలకు ప్రతినెలా రూ. 2500 ఇస్తామన్న హామీని అటకెక్కించారన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో చెప్పిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజలను మోసం చేశారని విమర్శించారు.

  • Srikar T
  • Updated on: May 8, 2024
  • 12:59 pm
Watch Video: ‘ఏపీలో సంక్షేమ పథకాలు అడ్డుకోవడం దారుణం’.. వల్లభనేని వంశీ

Watch Video: ‘ఏపీలో సంక్షేమ పథకాలు అడ్డుకోవడం దారుణం’.. వల్లభనేని వంశీ

గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈసీపై కీలక వ్యాఖ్యలు చేశారు. పథకాల విషయంలో ఈసీ పక్షపాత ధోరణి అవలంభిస్తోందన్నారు. గత ఎన్నికలకు ముందు పసుపు-కుంకమ పంపిణీకి అనుమతిచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు నాలుగేళ్లుగా నడుస్తున్న స్కీమ్స్‌ నిలిపివేశారని వివరించారు. పేదలను బాధపెట్టడమే చంద్రబాబు లక్ష్యం అని మండిపడ్డారు. ఓటు అనే ఆయుధంతో చంద్రబాబుకు సమాధానం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో రైతుబంధు పంపిణీకి అనుమతిచ్చారని గుర్తుచేశారు.

  • Srikar T
  • Updated on: May 8, 2024
  • 11:58 am
PM Modi: ‘కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే’.. వేములవాడ సభలో ప్రధాని మోదీ..

PM Modi: ‘కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే’.. వేములవాడ సభలో ప్రధాని మోదీ..

తెలంగాణలో బీజేపీ విజయం ఖాయమన్నారు ప్రధాని మోదీ. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బండి సంజయ్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మే 7న దేశంలో మూడోవిడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరిగిందని అందులో ఇండియా కూటమి ఫ్యూజ్ పోయిందని విమర్శించారు. ఇప్పటి వరకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగితే మూడింటిలో ఇండియా కూటమి ఫ్యూజ్ పోయిందని ఎద్దేవా చేశారు. వేములవాడకు చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు.

  • Srikar T
  • Updated on: May 8, 2024
  • 11:33 am
Telangana: రాజన్న సన్నిధిలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు..

Telangana: రాజన్న సన్నిధిలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు..

వేములవాడ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు ప్రధాని మోదీ. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈరోజు రెండు సభల్లో పాల్గొన్ని ప్రచారం నిర్వహించనున్నారు. అయితే ఇందులో భాగంగా ముందుగా వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు బయలుదేశారు. హైదరాబాద్ రాజ్ భవన్ లో మంగళవారం బస చేసిన ప్రధాని బుధవారం బేగంపేట నుంచి వేములవాడ చేరుకున్నారు. అక్కడ ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు.

  • Srikar T
  • Updated on: May 8, 2024
  • 10:30 am
Rain Effect: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఏడుగురు దుర్మరణం..

Rain Effect: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఏడుగురు దుర్మరణం..

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గోడ కూలి ఏకంగా ఏడుగురు మృతి చెందారు. నిన్న మొన్నటి వరకు మాడు పగిలే ఎండల నుంచి కాస్త ఉపశమనం కలిగించింది మంగళవారం సాయంత్రం కురిసిన వర్షం. అయితే ఉపశమనంతో పాటు ఘోర ప్రమాదాన్ని కూడా వెంటపెట్టుకువచ్చింది. బాచుపల్లిలో భారీ వర్షాలకు నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ గోడకూలి ఏకంగా ఏడుగురు కార్మికుల మృతి చెందారు. రాత్రి కురిసిన వర్షాలకు గోడ నాని కార్మికులు ఉంటున్నన షెడ్డుపై పడింది.సెంట్రింగ్‌ పనుల కోసం వచ్చిన కార్మికులు కన్‌స్ట్రక్షన్‌ సైట్‌లోనే రేకుల షెడ్డు వేసుకుని ఉంటున్నారు.

  • Srikar T
  • Updated on: May 8, 2024
  • 8:42 am
PM Modi: తెలుగు రాష్ట్రాల్లో మోదీ టూర్.. రోడ్ షోలు, సభలతో ప్రధాని బిజీ షెడ్యూల్

PM Modi: తెలుగు రాష్ట్రాల్లో మోదీ టూర్.. రోడ్ షోలు, సభలతో ప్రధాని బిజీ షెడ్యూల్

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్త్‌ ఏర్పాటు చేశారు. పలు ఆంక్షలు విధించారు. నిన్న రాత్రి రాజ్‌భవన్‌లోనే బస చేసిన ప్రధాని మోదీ.. కాసేపట్లో వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కి మద్దతుగా వేములవాడ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. అక్కడి నుంచి వరంగల్‌కు చేరుకుంటారు. లక్ష్మీపూర్‌లో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జన సభలో ప్రధాన మంత్రి మోదీ పాల్గొంటారు.

  • Srikar T
  • Updated on: May 8, 2024
  • 8:09 am
Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..

Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..

పసిడి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది బంగారం ధర. ఈరోజు మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగింది. బంగారాన్ని కొనేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది సుముఖత చూపిస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న ధరలు కొనుగోలుదారులను షాకులమీద షాకులకు గురిచేస్తున్నాయి. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పాడిన ఆర్థిక పరిస్థితులు, డాలర్ విలువలో మార్పు, స్టాక్ మార్కెట్లలో నెలకొన్న గడ్డుపరిస్థితులే అని అంటున్నారు నిపుణులు.

  • Srikar T
  • Updated on: May 8, 2024
  • 7:32 am
Watch Video: ‘సినిమాలో నటించాలి రాజకీయాల్లో కాదు’.. పవన్ కళ్యాణ్‎పై ముద్రగడ సంచలన వ్యాఖ్యలు..

Watch Video: ‘సినిమాలో నటించాలి రాజకీయాల్లో కాదు’.. పవన్ కళ్యాణ్‎పై ముద్రగడ సంచలన వ్యాఖ్యలు..

ఈ మధ్య తన కుటుంబంలో చిచ్చుపెట్టారని.. అయినా తాను భయపడను అన్నారు ముద్రగడ పద్మనాభం. తన సొంత నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తన అమ్మాయి తన ఆస్తి కాదన్నారు. తన కుటుంబాన్ని కాదు మీ కుటుంబాల్లో భరోసా కల్పించుకోండని సూచించారు. తన కూతురును మీకు అనుకూలంగా మార్చుకున్నారన్నారు. ఆమె తన బిడ్డ కాదని అత్తింటి బిడ్డ అని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి కుటుంబాలను లాగారు కాబట్టి తాను కూడా లాగాల్సి వస్తుందన్నారు.

  • Srikar T
  • Updated on: May 6, 2024
  • 1:50 pm
CM Jagan: ‘నాడు-నేడుతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేశాం’.. రేపల్లె ప్రచారంలో సీఎం జగన్..

CM Jagan: ‘నాడు-నేడుతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేశాం’.. రేపల్లె ప్రచారంలో సీఎం జగన్..

మరికొన్ని రోజుల్లో ఎన్నికల కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోందరన్నారు సీఎం జగన్. బాపట్ల లోక్‌సభ పరిధిలోని రేపల్లెలో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించ ప్రసంగించారు. ఇవి పేదల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలన్నారు. జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపు అని ఎద్దేవా చేశారు. తన హయాంలో మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 99శాతం హామీల అమలు జరిగాయన్నారు.

  • Srikar T
  • Updated on: May 6, 2024
  • 1:05 pm