మహారాష్ట్రలో ఆ ఇరునేతల మధ్య విభేదాలు.. అర్థరాత్రి ఉద్రిక్త వాతావరణం..

మహారాష్ట్రలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శివసేన పార్టీ అధినేత ఉద్దవ్ థాక్రే కాన్వాయ్‎ని అడ్డుకున్నారు కొందరు ఎంఎన్ఎస్ కార్యకర్తలు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని థానేలో అర్థరాత్రి ఉద్దవ్ థాక్రే వర్సెస్ రాజ్ థాక్రే వర్గాల మధ్య స్వల్ప ఘర్షణలు చెలరేగాయి.

మహారాష్ట్రలో ఆ ఇరునేతల మధ్య విభేదాలు.. అర్థరాత్రి ఉద్రిక్త వాతావరణం..
Maharastra
Follow us
Srikar T

|

Updated on: Aug 11, 2024 | 7:57 AM

మహారాష్ట్రలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శివసేన పార్టీ అధినేత ఉద్దవ్ థాక్రే కాన్వాయ్‎ని అడ్డుకున్నారు కొందరు ఎంఎన్ఎస్ కార్యకర్తలు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని థానేలో అర్థరాత్రి ఉద్దవ్ థాక్రే వర్సెస్ రాజ్ థాక్రే వర్గాల మధ్య స్వల్ప ఘర్షణలు చెలరేగాయి. ఉద్దవ్ థాక్రే కాన్వాయ్‏ను అడ్డుకున్నఎంఎన్ఎస్ కార్యకర్తలు కొబ్బరికాయలు విసిరారు. ఇదిలా ఉంటే.. ఆగస్ట్ 9న రాజ్ థాక్రే కాన్వాయ్‎పై ఉద్దవ్ వర్గం దాడికి ప్రయత్నించింది.

దీనికి ప్రతిగా ఆగస్ట్ 10 అర్థరాత్రి ఉద్దవ్ ధాక్రే కాన్వాయ్‎ను అడ్డుకుని ఆందోళనకు దిగారు రాజ్ థాక్రే వర్గానికి చెందిన కొందరు కార్యకర్తలు. దీంతో థానే నగరంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీనిపై స్పందించిన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు పార్టీల శ్రేణులను అడ్డుకుని 50 మంది నిరసనకారులను అరెస్ట్ చేశారు. ఈ అల్లర్లలో అధిక శాతం మహిళలు పాల్గొన్నారు. వారందరినీ పోలీసులు ప్రత్యేక వాహనంలో స్టేషన్‎కు తరలించారు. ఇదిలా ఉంటే ఈ ఘర్షణ వాతావరణానికి దారితీసిన పరిస్థితులపై అటు ఉద్దవ్ థాక్రే, ఇటు రాజ్ థాక్రే నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి స్పందన రాలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..