AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AR Rahman: నా కొడుకు కూడా రామ్ చరణ్‌లా ఉండాలి.. రెహమాన్

AR Rahman: నా కొడుకు కూడా రామ్ చరణ్‌లా ఉండాలి.. రెహమాన్

Phani CH
|

Updated on: Jun 03, 2026 | 3:19 PM

Share

‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో సంగీత దిగ్గజం ఏఆర్ రెహ్మాన్ రామ్ చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. చిరంజీవి వంటి లెజెండ్ వారసత్వాన్ని అందుకుని, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించడం చిన్న విషయం కాదని అన్నారు. తన కుమారుడు కూడా రామ్ చరణ్‌లా ఎదిగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నట్లు రెహ్మాన్ వెల్లడించారు.

తన తండ్రి వారసత్వాన్ని అందుకొని టాలీవుడ్‌లో చిరు తనయగా గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. తన కష్టంతో.. గ్లోబల్ రేంజ్‌లో సపరేట్ గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. దేవుడంటే భక్తి శ్రద్దలు, పెద్దలంటే గౌరవం, మితంగా మాట్లాడే స్వభావం, పరులకు సాయం చేసే మంచి గుణం, ఎవరినీ నొప్పించని మనస్తత్వం.అంతకు మించి తను ఒప్పుకున్న సినిమా కోసం శక్తి వంచన లేకుండా కష్టపడే స్వభావం. ఇన్ని సుగుణాలు చరణ్‌లో ఉన్నాయి కనుకే ఇండస్ట్రీలో చాలా మంది చరణ్ ను ఇష్టపడుతుంటారు. తమకు కూడా ఇలాంటి వారసుడు ఉంటే బాగుండు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు రెహ్మాన్ కూడా ఇలాంటి కామెంటే చేశాడు. పెద్ది ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నైలో నిర్వహించిన గ్రాండ్ ప్రెస్ మీట్‌లో ఆస్కార్ విన్నర్ , సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి లెజెండరీ నటుడి వారసత్వాన్ని అందుకోవడం, ఆయన స్థాయికి తగ్గట్టుగా రాణించడం ఎంత కష్టమో రెహమాన్ గుర్తుచేశారు. అయితే రామ్ చరణ్ ఆ అంచనాలను తలక్రిందులు చేస్తూ, ఇండస్ట్రీలో తనకంటూ ఒక సొంత ఇమేజ్, ఐడెంటిటీని క్రియేట్ చేసుకుని సరికొత్త ప్రమాణాలను నెలకొల్పారని ప్రశంసించారు. తన కుమారుడు కూడా చరణ్ లాగే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నట్లు ఆయన ఆకాంక్షించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Janhvi Kapoor: దీపికాకు జాన్వీ సాలిడ్ కౌంటర్.. టాలీవుడ్‌ గురించి వాగితే ఇట్లే ఉంటది!

Satyadev: ‘రాజకీయాల గురించి మాట్లాడితే సినిమాకే పెద్ద నష్టం! నోరు మూసుకోవడం బెటర్!

24 గంటల్లో 47,460 మొక్కలు!.. ప్రకృతి కోసం గిన్నిస్ రికార్డు సృష్టించిన పర్యావరణ యోధుడు

వీడెవడండీ బాబూ.. వెనుక రైలు వస్తున్నా నడుస్తూనే ఉన్నాడు!

ఏసీ రిపేర్‌కు వచ్చి.. ఆర్టిస్ట్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన మెకానిక్స్!

Follow Us