Satyadev: ‘రాజకీయాల గురించి మాట్లాడితే సినిమాకే పెద్ద నష్టం! నోరు మూసుకోవడం బెటర్!
రాజకీయాలపై మాట్లాడకపోవడమే మంచిదని నటుడు సత్యదేవ్ అభిప్రాయపడ్డారు. ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తే ప్రేక్షకులను కోల్పోయే ప్రమాదం ఉంటుందని, అందుకే చాలామంది సెలబ్రిటీలు తమ రాజకీయ అభిప్రాయాలను బయటపెట్టరని తెలిపారు. సినిమా ఒక పెద్ద వ్యాపారమని, ప్రేక్షకులందరినీ గౌరవించాల్సిన బాధ్యత తమపై ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
చేసే పని గురించి తప్పితే.. స్వతహాగా కాంట్రో కామెంట్స్‌కు దూరంగా ఉంటే సత్యదేవ్.. తన రీసెంట్ పాడ్ కాస్ట్ షోలో రాజకీయాలను గురించి మాట్లాడకపోవడమే బెటర్ అంటూ చెప్పుకొచ్చారు. తాను కాదే చాలా మంది సెలబ్రిటీలు తమ రాజకీయ అభిప్రాయాలను దాచుకుంటారంటూ చెప్పుకొచ్చాడు. ఎంటర్‌టైన్మెంట్ రంగంలో ఉన్నప్పుడు సెలబ్రిటీలు డిప్లోమసీ పాటించడం అలవాటు చేసుకోవాలన్నాడు. సినిమా అనేది ఒక భారీ వ్యాపారమని, థియేటర్లకు వచ్చే పది మంది ప్రేక్షకులలో ఒక్కరిని కూడా రాజకీయాల వల్ల కోల్పోవడానికి తాను సిద్ధంగా లేనని సత్యదేవ్ అన్నాడు. ఒకవేళ ఏదైనా ఒక రాజకీయ పార్టీ వైపు నిలబడాలి అనుకుంటే, ఆ తర్వాత వచ్చే నష్టాలను కడిగేసేంత భారీ ఆర్థిక బలం ఉండాలని, లేనప్పుడు నోరు మూసుకుని ఉండటమే మంచిదని చెప్పుకొచ్చాడు. సామాజిక అంశాలపై స్పందిస్తే నెటిజన్లు ప్రతి వివాదంలోకి లాగుతూ సెలబ్రిటీలపై ఒత్తిడి పెంచుతున్నారని, అందుకే సినిమా వాళ్లు మౌనంగా ఉండటానికే మొగ్గు చూపుతారని సత్యదేవ్ చెప్పుకొచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
24 గంటల్లో 47,460 మొక్కలు!.. ప్రకృతి కోసం గిన్నిస్ రికార్డు సృష్టించిన పర్యావరణ యోధుడు
వీడెవడండీ బాబూ.. వెనుక రైలు వస్తున్నా నడుస్తూనే ఉన్నాడు!
ఏసీ రిపేర్‌కు వచ్చి.. ఆర్టిస్ట్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన మెకానిక్స్!
ఈ కోడిని కూర వండుకుని తిన్నారో.. మూడేళ్ల జైలు శిక్ష తప్పదు
గొర్రెల కాపరి ఉద్యోగానికి భారీ క్యూ.. జీతం ఎంతో తెలిస్తే షాకవుతారు
24 గంటల్లో 47 వేల మొక్కలు.. గిన్నిస్ రికార్డు!
వీడెవడండీ బాబూ.. వెనుక రైలు వస్తున్నా నడుస్తూనే ఉన్నాడు!
ఏసీ రిపేర్‌కు వచ్చి.. ఆర్టిస్ట్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన మెకానిక్స్!
ఈ కోడిని కూర వండుకుని తిన్నారో.. మూడేళ్ల జైలు శిక్ష తప్పదు
గొర్రెల కాపరి ఉద్యోగానికి భారీ క్యూ.. జీతం తెలిస్తే షాకవుతారు
దోమలపై కత్తికట్టిన గూగుల్.. 3.2 కోట్ల దోమల విడుదలకు రెడీ
యువకుడిగా ఉండగా పరీక్ష.. వృద్ధుడయ్యాక వచ్చిన కొలువు!

