కన్ఫర్మ్‌డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు.. ప్రయాణికులకు నష్ట పరిహారం
రిజర్వేషన్ చేసుకుని రైలెక్కిన నలుగురు ప్రయాణికులకు కేటాయించిన బెర్తులను రైల్వే సిబ్బంది ఆక్రమించడంతో వారు నిలబడి ప్రయాణించాల్సి వచ్చింది. ఫిర్యాదులను పట్టించుకోకపోవడంతో వారు భోజ్‌పూర్ కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం రైల్వే సేవల్లో లోపం ఉందని గుర్తించిన కోర్టు, టికెట్ డబ్బులు వడ్డీతో తిరిగి చెల్లించడంతో పాటు నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది.
యూపీ స్టేషన్‌లో నలుగురు ప్రయాణికులు పాట్నా రైలు ఎక్కారు. రిజర్వేషన్ చేసుకుని రైలు ఎక్కిన వారు.. తమకు కేటాయించిన బెర్తుల దగ్గరికి వెళ్లి చూసేసరికి షాక్ తిన్నారు. అప్పటికే తమ బెర్తులను రైల్వే సిబ్బంది ఆక్రమించుకున్నట్లు గుర్తించారు. అవి తాము రిజర్వ్ చేసుకున్న సీట్లు అని, ఖాళీ చేయమని సిబ్బందిని కోరినప్పటికీ వారు ఖాళీ చేయలేదు. దీంతో తాము నిలబడి ప్రయాణం చేయాల్సి వచ్చిందంటూ భోజ్‌పూర్ కన్సూమర్ కోర్టుకు ఫిర్యాదుచేశారు. తమ సమస్య ను రైల్వే హెల్ప్ లైన్‌కి మంత్రిత్వ శాఖకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఫిర్యాదులో రాసుకొచ్చారు, స్టేషన్ టీటీఈని అడిగితే.. రైలులో రద్దీ ఎక్కువుందని, సర్దుకుపోవాలని సూచించారని తెలిపారు. ఈ విషయం రైల్వే పోలీసుల పరిధిలోకి వస్తుందని తమకు సంబంధం లేదని రైల్వే అధికారులు కోర్టుకు తెలియచేసారు. ప్రయాణికుల ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నామన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న కమిషన్.. ప్రయాణికులు సమర్పించిన టిక్కెట్లు, ఫిర్యాదుల రికార్డులు, ఫోటోలను పరిశీలించింది. ఆ తరవాత రైల్వే అధికారులు సేవలను అందించడంలో విఫలమయ్యారని గుర్తించింది. రైల్వే సేవల లోపం కారణంగా ప్రయాణికులు మానసిక, శారీరక, ఆర్థిక వేధింపులకు గురయ్యారని తెలిపింది. రైల్వే శాఖ, నార్త్ సెంట్రల్ రైల్వే, .. ఆ నలుగురు ప్రయాణికుల బుకింగ్ అమౌంట్ 1,876 రూపాయల మొత్తం 8 శాతం వడ్డీతో కలిపి రీఫండ్ చేయాలని ఆదేశించింది. అలాగే నష్టపరిహారంగా 2 వేలు, పిటిషన్ ఖర్చుల కింద 15 వేలను 60 రోజులలోపు చెల్లించాలని ఆదేశించింది. నిర్ణీత సమయంలోగా చెల్లించకపోతే, ఫిర్యాదుదారుడు 10 శాతం వడ్డీతో మొత్తాన్ని తిరిగి పొందేందుకు అర్హులవుతారని భోజ్‌పూర్ కన్జ్యూమర్ కోర్టు తెలిపింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒకరు భారత్ నుంచి, మరొకరు పాక్ నుంచి.. 78 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు
త్వరలో దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఆర్‌బీఐ కీలక అడుగు!
ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్‌లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది
Save The Tigers 3: ‘పెళ్లి తెచ్చిన తంటాలు..’కడుపుబ్బా నవ్విస్తున్న సేవ్ ది టైగర్స్ 3 ట్రైలర్
కన్ఫర్మ్‌డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..
78 ఏళ్ల తర్వాత కలిసిన బాల్యమిత్రులు!
ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్‌లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది
24 గంటల్లో 47 వేల మొక్కలు.. గిన్నిస్ రికార్డు!
వీడెవడండీ బాబూ.. వెనుక రైలు వస్తున్నా నడుస్తూనే ఉన్నాడు!
ఏసీ రిపేర్‌కు వచ్చి.. ఆర్టిస్ట్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన మెకానిక్స్!
ఈ కోడిని కూర వండుకుని తిన్నారో.. మూడేళ్ల జైలు శిక్ష తప్పదు

