పైన కనిపిస్తున్న వయ్యారిని చూడండి.. చెక్కిన శిల్పం లాంటి రూపం.. కలువల్లాంటి కళ్లు.. చురకత్తుల్లాంటి చూపుతో ఎలాంటి కుర్రాడినైనా కట్టిపడేస్తుంది ఆ చిన్నది.
ఇంతకు ఆమె ఎవరో గుర్తుపెట్టారా.? ఆమె అందం వర్ణించడానికి మాటలు సరిపోవు.. ఇంతకు ఆమె ఎవరో కనిపెట్టరా.? ఆమె చేసింది తక్కువ సినిమాలే కానీ తన అందంతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
ఆమె అందాల భామ దక్ష నాగర్కర్. ఈ చిన్నది 2007లో కన్నడ సినిమా భూగత సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టింది.
2015లో ‘ఏకే రావు పీకే రావు’ సినిమా ద్వారా తెలుగు సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. దక్ష నగార్కర్ 2021లో విడుదలైన జాంబీ రెడ్డి సినిమా మంచి గుర్తింపు తెచ్చింది.
ఆ తర్వాత హీరోయిన్ గా మారిపోయింది. హోరాహోరీ, హుషారు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ఆతర్వాత వచ్చిన జాంబీ రెడ్డి సినిమాలో కీలక పాత్రలో నటించింది.
బంగార్రాజు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించింది. ఆతర్వాత ఈ చిన్నది నటించిన సినిమాలు ఏవి కనిపించలేదు.
మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన రావణాసుర సినిమాలో నటించినప్పటికీ ఆ సినిమా సక్సెస్ కాకపోవడంతో ఈ చిన్నదానికి గుర్తింపు రాలేదు.