Peddi 02: పెద్ది పార్ట్ 2 ఉంటుందా? బుచ్చిబాబు ఏం చెప్పారంటే
‘పెద్ది’ సినిమాకు సీక్వెల్ ఉంటుందా అనే అభిమానుల సందేహాలకు దర్శకుడు బుచ్చిబాబు తాజాగా సమాధానం ఇచ్చారు. కథ పూర్తిగా ఒకే భాగంలో ముగుస్తుందని, ప్రస్తుతం పార్ట్-2 చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. రెండు భాగాలుగా సినిమాలు తీయడం తనకు ఇష్టం లేదని, ఒక కథను పూర్తిగా చెప్పి తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టడం తన పని విధానమని వెల్లడించారు.
ఎన్నో నెలలుగా పెద్ది కోసం వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్.. ఇప్పుడు పెద్దిని సిల్వర్ స్క్రీన్ పై విట్‌నెస్ చేసేందుకు రెడీ అయిపోయారు. పెద్ది మ్యానియాతో ఇప్పటికే థియేటర్ల ముందు క్యూ కట్టారు. పెద్ది బొమ్మను ఊహిస్తూ.. చరణ్ పర్మార్మెన్స్ ఇచ్చే మత్తు గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే అందులో కొంత మంది మాత్రం పెద్దికి పార్ట్ 2 కూడా ఉంటుందేమో అంటూ సందేహ పడుతున్నారు. అయితే దీనిపై తాజాగా బుచ్చిబాబు తన రీసెంట్ ఇంటర్వ్యూలో రియాక్టయ్యాడు. పెద్ది పార్ట్ 2 పై ఫ్యాన్స్‌కు క్లారిటీ ఇచ్చాడు. తన పెద్ది కథలో ఎమోషన్, డ్రామా ఉంటుందని.. అది ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తుందని బుచ్చి తన సినిమా గురించి వివరించాడు. ఈ క్రమంలోనే పెద్ది పార్ట్ 2 పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రంగస్థలం లాంటి చిత్రాలకు పార్ట్-2 అవకాశం ఉన్నట్లుగా, పెద్దికి కూడా భవిష్యత్తులో సీక్వెల్ చేసే ఆలోచన ఉందా అన్న ప్రశ్నకు… తన స్టైల్లో అన్సార్ ఇచ్చాడు బుచ్చి. పెద్ది కథ ఒకేసారి వస్తుందని.. అది ఒకే పార్ట్‌లో ముగుస్తుందని కుండబద్దుకొట్టినట్టుగా బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చాడు. తాను రెండు పార్ట్‌లలో సినిమాలు తీయడాన్ని ఇష్టపడనని, ఒక కథను ఫినిష్ చేసేసి ఇంకో కథకి వెళ్లిపోవాలి అన్నద్దే తన ఆలోచనను అన్నాడు. పెద్ది చిత్రానికి పార్ట్-2 సెట్ కాలేదని, అలాంటి ఆలోచన ప్రస్తుతానికి లేదని చెప్పుకొచ్చాడు. దీంతో, రామ్ చరణ్ అభిమానుల్లో నెలకొన్న పార్ట్-2 ఉత్కంఠకు దర్శకుడు తెరదించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Peddi: పెద్ది ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ.. కారణం అదేనా
కన్ఫర్మ్‌డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు.. ప్రయాణికులకు నష్ట పరిహారం
ఒకరు భారత్ నుంచి, మరొకరు పాక్ నుంచి.. 78 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు
త్వరలో దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఆర్‌బీఐ కీలక అడుగు!
ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్‌లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్‌డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..
78 ఏళ్ల తర్వాత కలిసిన బాల్యమిత్రులు!
ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్‌లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది
24 గంటల్లో 47 వేల మొక్కలు.. గిన్నిస్ రికార్డు!
వీడెవడండీ బాబూ.. వెనుక రైలు వస్తున్నా నడుస్తూనే ఉన్నాడు!
ఏసీ రిపేర్‌కు వచ్చి.. ఆర్టిస్ట్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన మెకానిక్స్!

