AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi: పెద్ది సినిమా హిట్ అవ్వాలంటే.. 450కోట్లు వసూలు చేయాలి?

Peddi: పెద్ది సినిమా హిట్ అవ్వాలంటే.. 450కోట్లు వసూలు చేయాలి?

Phani CH
|

Updated on: Jun 03, 2026 | 7:02 PM

Share

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ట్రైలర్‌కు వచ్చిన స్పందనతో పాటు చరణ్ లుక్, పాత్రపై భారీ హైప్ ఏర్పడింది. ఇప్పటికే ఓటీటీ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైనట్లు ప్రచారం జరుగుతుండగా, థియేట్రికల్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరిగినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా… బుచ్చిబాబు సనా డైరెక్షన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ పెద్ది. క్రాస్ ఓవర్ అథ్లెట్‌గా చరణ్‌ ఈ సినిమాలో ప్రాణం పెట్టి నటించాడు. తన దేహాన్ని పర్ఫెక్ట్ పహల్వాన్‌లా తీర్చిదిద్దాడు. తన లుక్‌తో అందర్నీ అవాక్కయ్యేలా చేశాడు. అంతేకాదు పెద్ది ట్రైలర్‌తో తన సినిమాపై మంచి పాజిటివ్ బజ్ తీసుకొచ్చాడు. దీంతో పెద్ది మూవీ థియేట్రికల్ బిజినెస్ భారీగా జరిగినట్టు తెలుస్తోంది. పెద్ది సినిమాకు దాదాపు 350 కోట్ల వరకు బడ్జెట్ అయిందని స్వయంగా బుచ్చిబాబే విజయవాడలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు. ఇప్పటికే ఓటీటీ బిజినెస్ కూడా అయిపోయిందని, నెట్ ఫ్లిక్స్ సంస్థ పెద్ది సినిమాను దాదాపు 130 కోట్లకు కొనుగోలు చేసిందని ఇన్‌సైడ్ టాక్. ఇక పెద్ది సినిమాకున్న హైప్ తో థియేటరికల్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కన్ఫర్మ్‌డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు.. ప్రయాణికులకు నష్ట పరిహారం

ఒకరు భారత్ నుంచి, మరొకరు పాక్ నుంచి.. 78 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు

త్వరలో దేశవ్యాప్తంగా ప్లాస్టిక్‌ కరెన్సీ నోట్లు.. ఆర్‌బీఐ కీలక అడుగు!

ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్‌లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది

Save The Tigers 3: ‘పెళ్లి తెచ్చిన తంటాలు..’కడుపుబ్బా నవ్విస్తున్న సేవ్ ది టైగర్స్ 3 ట్రైలర్‌

Follow Us