క్యూట్ స్మైల్ తోనే కవ్వితున్న కుర్ర భామ ప్రియా భవాని శంకర్ 

03June 2026

Pic credit - Instagram

Rajeev 

ప్రియ భవాని శంకర్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన న్యూస్‌రీడర్‌ ఈ అమ్మడు. ఆతర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

ప్రియ భవాని శంకర్ మొదట్లో న్యూస్‌రీడర్‌గా కెరీర్ ప్రారంభించి, 2014లో సీరియల్స్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది.

2017లో మేయా దమాన్‌ అనే తమిళ సినిమా ద్వారా నటిగా సినిమారంగంలోకి అడుగుపెట్టింది. తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది ఈ చిన్నది.

ఈ అమ్మడు నటించిన తమిళ్ సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆతర్వాత డైరెక్ట్ గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

కళ్యాణం కమనీయం అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ప్రియ భవాని శంకర్ ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ మెప్పించింది.

సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేసింది ఈ చిన్నది. అక్కినేని అందగాడు నాగచైతన్య నటించిన దూత అనే వెబ్ సిరీస్ లో కనిపించింది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన క్యూట్ ఫొటోలతో ఆకట్టుకుంటుంది. కుర్రాళ్ళు ఈ బ్యూటీ అందానికి ఫిదా అవుతున్నారు.