AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Account: బ్యాంక్ అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్లు చేస్తున్నారా..? మీరు డేంజర్‌లో ఉన్నట్లే..

బ్యాంక్ అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో లావాదేవీలు చేస్తున్నారా.. ఐటీ శాఖ విధించిన పరిమితి దాటి ట్రాన్సాక్షన్లు చేస్తున్నారా.. అయితే మీరు డేంజర్‌లో పడ్డట్లే.. ఐటీ శాఖ మీపై నిఘా పెట్టవచ్చు. మీకు ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంటుది.

Bank Account: బ్యాంక్ అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్లు చేస్తున్నారా..? మీరు డేంజర్‌లో ఉన్నట్లే..
Money
Venkatrao Lella
|

Updated on: Jun 03, 2026 | 10:09 PM

Share

దేశంలో ఎక్కువమంది ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉంటారు. ఇక ఉద్యోగాలు, వ్యాపారులు చేసేవారికి ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. ఉద్యోగం మారితే శాలరీ బ్యాంక్ అకౌంట్ మారుతుంది. దీందో ఉద్యోగస్తులకు బ్యాంక్ అకౌంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇక వ్యాపారులు వివిధ అవసరాల కోసం ప్రత్యేకంగా అకౌంట్లను నిర్వహిస్తూ ఉంటారు. అయితే బ్యాంక్ అకౌంట్లపై కూడా ఇన్‌కమ్ ట్యాక్స్ ఫోకస్ పెట్టింది. బ్యాంక్ అకౌంట్లలో పరిమితికి మించి ట్రాన్సాక్షన్లు జరిగితే ఐటీ శాఖ మీపై దృష్టి పెడుతుంది. మీకు ఐటీ శాఖ నుంచి నోటీసులు కూడా రావొచ్చు.

జాగ్రత్తగా ఉండాల్సిందే..

బ్యాంక్ అకౌంట్ల నుంచి పరిమితికి మించి నగదు లావాదేవీలు జరిగితే బ్యాంకులు ఐటీ శాఖకు నివేదిస్తాయి. ఆదాయం కన్నా ఎక్కువగా ట్రాన్సాక్షన్లు జరిగితే ఐటీ శాఖ నుంచి నోటీసులు అందే అవకాశం కూడా ఉంటుంది. కొంతమంది పిల్లల పెళ్లి, వారిని విదేశాలకు పంపడం కోసం బ్యాంక్ అకౌంట్లలో పెద్ద మొత్తంలో నగదు ఉంచుకుంటారు. లేదా ఇల్లు, కారు కొనుగోలు కోసం అకౌంట్లో భారీ మొత్తంలో నగదు నిల్వ చేసుకుంటారు. ఒక పరిమితి దాటితే ఐటీ శాఖ నిఘాలోకి మీరు వెళతారు. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ మీ లావాదేవీలను పరిశీలించి నోటీసులు పంపించవచ్చు.

రూ.10 లక్షల కంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే..

మీరు ఒక ఏడాదిలో రూ.10 లక్షల కంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే ఐటీ శాఖ నిఘాలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. చట్టబద్దంగా వచ్చిన డబ్బులు అయితే ఇబ్బంది ఉండదు. కానీ అక్రమంగా లావాదేవీలు జరిగితే సమస్యలో పడతారు. ఆదాయం ఎక్కడ నుంచి వచ్చిందనే ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. ఇక కరెంట్ అకౌంట్లో రూ.50 లక్షలకు మించి ఒక ఏడాదిలో ట్రాన్సాక్షన్లు జరిగినా బ్యాంకులు ఐటీ శాఖకు నివేదిస్తాయి. కానీ భారీగా క్యాష్ విత్ డ్రాలు, పెద్ద మొత్తంలో డిపాజిట్ వంటివి ఎక్కువ చేస్తే ఐటీ శాఖ నుంచి సమస్యలు ఎదురుకావొచ్చు. దీంతో మీరు పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపినప్పుడు వాటికి సంబంధించి ఆధారాలు, పత్రాలు భద్రపర్చుకోండి. దీని వల్ల ఐటీ శాఖ విచారణకు పిలిచినా వాటిని చూపించవచ్చు.

Follow Us
Nag Ashwin: అంతా తెలిసే చేస్తున్నా.. నాగ్ అశ్విన్ సీరియస్..!
Nag Ashwin: అంతా తెలిసే చేస్తున్నా.. నాగ్ అశ్విన్ సీరియస్..!
'ఓ.! సుకుమారి' మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది: ఐశ్వర్యా రాజేష్
'ఓ.! సుకుమారి' మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది: ఐశ్వర్యా రాజేష్
అలర్ట్!డ్రైవింగ్ లైసెన్స్,ఆర్‌సీ కార్డులపై రవాణా శాఖ కీలక ఆదేశాలు
అలర్ట్!డ్రైవింగ్ లైసెన్స్,ఆర్‌సీ కార్డులపై రవాణా శాఖ కీలక ఆదేశాలు
చిప్స్, మొబైల్స్ తయారీకి మోదీ సర్కార్ భారీ నజరానా!
చిప్స్, మొబైల్స్ తయారీకి మోదీ సర్కార్ భారీ నజరానా!
1600, 140 సిరీస్‌ నంబర్ల నుంచి కాల్స్‌ వస్తున్నాయా?ఎవరు చేస్తారు?
1600, 140 సిరీస్‌ నంబర్ల నుంచి కాల్స్‌ వస్తున్నాయా?ఎవరు చేస్తారు?
పెన్షన్‌ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్‌ చూసి షాక్‌
పెన్షన్‌ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్‌ చూసి షాక్‌
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!
500 ప్రభుత్వ డాక్టర్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల.. వెరిఫికేషన్..
500 ప్రభుత్వ డాక్టర్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల.. వెరిఫికేషన్..
కదులుతున్న రైలులో పూజ‌లు.. రైల్వే అధికారుల రియాక్షన్‌ ఇదే!
కదులుతున్న రైలులో పూజ‌లు.. రైల్వే అధికారుల రియాక్షన్‌ ఇదే!
పోలీసువైనంత మాత్రాన చట్టం నీ చుట్టం కాదు బాస్‌!
పోలీసువైనంత మాత్రాన చట్టం నీ చుట్టం కాదు బాస్‌!