హైదరాబాద్‎లో కుండపోత.. అప్పటి వరకూ బయటకు రావొద్దన్న జీహెచ్ఎంసీ

హైదరాబాద్ సిటీలో మళ్లీ కుండపోత వర్షం.. ఉరుము లేదు.. మెరుపు లేదు.. ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణ మారిపోయింది. సిటీలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమై చీకట్లు కమ్మేశాయి.

హైదరాబాద్‎లో కుండపోత.. అప్పటి వరకూ బయటకు రావొద్దన్న జీహెచ్ఎంసీ
Hyderabad Rains
Follow us
Srikar T

|

Updated on: Aug 19, 2024 | 5:55 PM

హైదరాబాద్ సిటీలో మళ్లీ కుండపోత వర్షం.. ఉరుము లేదు.. మెరుపు లేదు.. ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణ మారిపోయింది. సిటీలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమై చీకట్లు కమ్మేశాయి. హైదరాబాద్ సిటీలోని బషీర్ బాగ్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్ పేట, మెహదీపట్నం, హిమాయత్ నగర్, ఫిల్మ్ నగర్.. నారాయణగూడ, పంజాగుట్ట, ఎర్రమంజిల్, లక్డికాపుల్ ఏరియాల్లో భారీ వర్షం పడుతుంది. రోడ్లు జలమయం అయ్యాయి. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిదానంగా సాగుతుంది.

నగరంలో కురుస్తున్న జోరు వానతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షం నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు. ద్రోణీ ప్రభావంతో హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది.

షేక్ పేట్ ఫ్లై ఓవర్‎పై తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఫిలింనగర్, గచ్చిబౌలి, గోల్కొండ, మెహిదీపట్నం, టోలిచౌకి, నానకరం గూడా రూట్‎లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఒక్కసారిగా దంచి కొట్టిన వర్షం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై వాటర్ లాగింగ్ ఏరియాను క్లియర్ చేస్తున్న మన్ సూన్ టీమ్స్ & ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీసులు. రాత్రి 8 గంటల వరకూ బయటకు రావొద్దంటూ హెచ్చరిస్తున్న వాతావరణ శాఖ అధికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..