AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: కరీంనగర్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం.. కీలక నిర్ణయాలు

కరీంనగర్, తెలంగాణ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ఆధ్వర్యంలో సోమవారం (మార్చి09) కరీంనగర్‌లో నిర్వహించిన సమావేశం విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశం సందర్భంగా తెలంగాణలో తమ అభిమాన సంఘాన్ని మరింత బలోపేతం అలాగే విస్తరించే దిశగానూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Allu Arjun: కరీంనగర్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం.. కీలక నిర్ణయాలు
Allu Arjun Fans
Basha Shek
|

Updated on: Mar 09, 2026 | 6:36 PM

Share

AAFA తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అంజి యాదవ్ గారు నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణలోని 5 జిల్లాలకు జిల్లా కమిటీలను ఏర్పాటు చేశారు. కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లా కమిటీలను ఎన్నుకున్నారు. ఈ కమిటీల ఏర్పాటు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అభిమానుల కార్యక్రమాలను సమన్వయం చేయడం, సామాజిక సేవా కార్యక్రమాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్   ఇచ్చిన “One Good Deed Every Year” అనే సందేశాన్ని అనుసరిస్తూ, ప్రతి సంవత్సరం కనీసం ఒక మంచి పని చేసి సమాజానికి సేవ చేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు. సమావేశానికి సంబంధిత జిల్లాల ప్రతినిధులు, అభిమానులు హాజరై రాష్ట్ర నాయకత్వం మార్గదర్శకత్వంలో సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని సంకల్పించినట్లు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు.

కాగా ఇటీవలే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్  ఆధ్వర్యంలో, రెండు తెలుగు రాష్ట్రాల కమిటీ సభ్యులతో హైదరాబాద్‌లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.  ఈ సందర్భంగా అల్లు అర్జున్   ఇచ్చిన “One Good Deed Every Year” అనే సందేశాన్నిబలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా  ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు, అభిమానుల మధ్య ఐక్యతను పెంపొందించేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తన సోదరుడు అల్లు శిరీష్ పెళ్లి వేడుకతో బిజీ బిజీగా ఉంటున్నాడు అల్లు అర్జున్. ఈ పెళ్లి తంతు పూర్తయిన వెంటనే అట్లీ సినిమా పనుల్లో బిజీ కానున్నాడు. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా హాలీవుడ్ స్టైల్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. తమిళ సినిమా పరిశ్రమకు చెందిన సన్ పిక్చర్స్ సంస్థ సుమారు రూ. 800 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలోనూ ఓ సినిమాకు కమిట్ అయ్యాడు బన్నీ. త్వరలోనే ఈ రెండు సినిమాల నుంచి మరిన్న అప్టేట్స్ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us