AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: రీల్స్ మోజులో యువత పిచ్చి పీక్స్.. లైకుల కోసం లైఫ్‌నే రిస్క్..

కిక్కు కోసమో.. సోషల్ మీడియాలో వచ్చే లైక్స్ కోసమో రొటీన్‌కి భిన్నంగా పెర్ఫామెన్సులు చూపిస్తే.. చివరకు జిందగీలే ఖర్చయిపోతాయి. రీల్స్ చెయ్యబోయి కొందరు ప్రాణాలుమీదకు తెచ్చుకుంటే..

Viral: రీల్స్ మోజులో యువత పిచ్చి పీక్స్.. లైకుల కోసం లైఫ్‌నే రిస్క్..
Insta Reels
Ravi Kiran
|

Updated on: Aug 19, 2024 | 11:00 PM

Share

కిక్కు కోసమో.. సోషల్ మీడియాలో వచ్చే లైక్స్ కోసమో రొటీన్‌కి భిన్నంగా పెర్ఫామెన్సులు చూపిస్తే.. చివరకు జిందగీలే ఖర్చయిపోతాయి. రీల్స్ చెయ్యబోయి కొందరు ప్రాణాలుమీదకు తెచ్చుకుంటే.. మరికొందరికి పరువు పోయి.. బజార్న పడుతున్నారు. ఆనక బతుకంతా చిందర బందర చేసుకుంటున్నారు. వరుస విషాదాలు నమోదౌతున్నా.. ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు రీల్స్ పిచ్చోళ్లు. వై దిస్‌ రీల్స్‌ వెర్రి..?

సోషల్ మీడియా ఒక పదునైన ఆయుధం. సామాజికంగా ఎదగడానికి, వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోడానికి, సొంత నైపుణ్యాల్ని పదిమందికీ పంచడానికి ఉపయోగిస్తే సోషల్ మీడియాను మించిన సాధనం మరొకటి లేనే లేదు. కానీ.. కొందరు ఆవారాగాళ్ల చేతుల్లో పడి సోషల్ మీడియా వికృత రూపం దాల్చి.. విపరీత పోకడలు పోతోంది. మిగతా ప్రొఫెషన్స్‌లో ప్రావీణ్యతను చాటుకోలేనివాళ్లు, ఏదోఒక పనికొచ్చే పని చెయ్యడంలో ఫెయిలైనవాళ్లు.. మేము ఉన్నామని సొసైటీలో ఫోజు కొట్టాలనుకునేవాళ్లు.. వీళ్లు మాత్రమే సోషల్ మీడియా రీల్స్ పేరుతో పేట్రేగి పోతున్నారు కొందరు. నడుస్తున్న రైలుకు ఎదురెళ్లడం.. రైలు కిటికీలు పట్టుకుని వేళ్లాడ్డం.. ఉధృతంగా ప్రవహించే జలపాతంలో తేలియాడ్డం.. ఎత్తయిన మేడ మీద నుంచి వేళ్లాడుతూ వీడియోలు తీసుకోవడం.. ఉరి వేసుకుంటున్నట్టు నటించబోయి నిజంగానే ఉరేసుకోవడం.. ఎగసిపడే అలల్ని లెక్కచెయ్యకుండా సముద్రంతో చెలగాటమాడ్డం.. ఒకటేమిటి.. రీల్స్ అనబడే వెర్రి వేయి రకాలు. ఇంకొక్క మాటలో చెప్పాలంటే.. ఇన్‌స్టా రీల్స్ కోసం రిస్కీ ఫీట్స్ చెయ్యడం అనేది ఒక మాయరోగం.

సాగినంత కాలం బాగానే సాగుతాయి. కిక్‌ ఎక్కించే స్ట్రంట్స్‌ భలే ధ్రిల్‌నిస్తాయి. కానీ టైమ్ బాగోలేక స్టంట్‌ వికటిస్తే జరిగే డ్యామేజీలకు అంతే లేదు. బైక్‌ రైడింగ్‌లో జరిగే రిస్కీ స్టంట్లు… వీరావేశంతో చేసే గుర్రపు స్వారీలు.. జలపాతాల దగ్గర.. ప్రమాదకర ప్రాంతాల్లో జరిగే ఫీట్లు.. ప్రాణాంతకంగా మారుతున్నాయి. అప్‌లోడ్ చేశాక తమ రీల్స్‌కి వచ్చే వ్యూస్, లైక్స్ ఎంత కిక్కిస్తాయో గాని.. వాటి మేకింగ్‌లతో జరిగే రిస్కు మాత్రం మాటల్లో చెప్పలేనంత. క్రియేటివిటీ పేరిట ఎగస్ట్రాలేది చివరకు మిగిలిదే విషాదంతమే.

లైకులు, వ్యూస్ కోసం ప్రాణాలకు తెగించి ఫీట్స్ చేస్తూ కొందరు ప్రమాదవశాత్తూ మరణిస్తుంటే.. రీల్స్ మోజు..క్రేజ్‌ పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. భర్త రీల్స్‌ చేయోద్దనడంతో మనస్థాపంచెందిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్‌ కు ముందు సెల్ఫీ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారామె.

భార్య రీల్స్‌ చేయడం వాటిపై ఫ్రెండ్స్‌ కామెంట్స్‌ చేయడం.. రీల్స్‌ మానేయమని భర్త హుకూం జారీ చేయడం.. గొడవ ముదిరి విడాకుల వరకు వెళ్లడం ..వద్దన్నా వినకుండా రీల్స్‌ చేస్తుందనే కోపంతో భర్త.. భార్యను కడతేర్చడం.. ఇలాంటి ఘటనలు పరిపాటిగా మారాయి. ఇక రీల్స్‌కు బానిసలుగా మారిన కొందరు పోరళ్లు చోరీల బాటపడుతున్నారు. ఇన్‌స్టాలో రీల్స్‌ చేయడం కోసం బైక్‌లను కొట్టేస్తూ ఖాకీలకు అడ్డంగా బుక్కయిన వాళ్లూ ఉన్నారు. మద్యం, జూదం లాగే సామాజిక మాధ్యమం కూడా ఒక వ్యసనంలా మారడం ఆందోళనకర అంశం. ఎందుకిలా జరుగుతోంది?

క్రియేటివిటీ, టాలెంట్‌ చూపించుకోవాలనే తాపత్రయం..ఓవర్‌ నైట్‌లో ఫేమ్‌ కావాలనే ఉబలాటం వెరసి రీల్స్‌ మానియాతో యువత రిస్కీ ఫీట్లతో లైఫ్‌ను రిస్క్‌లో పడేసుకుంటున్నారు. రీల్స్‌కు బానిసలుగా మారితే మారుమనసు పొందడం కష్టం. తాము అప్‌లోడ్ చేసిన వీడియోలకు, ఫొటోలకు లైకులు రాకపోయినా మానసిక ఒత్తిడికి గురవుతారు. ఫాలోయర్లను సంతృప్తి పర్చడం కోసం ఒక్కోసారి అసభ్యకరంగా మాట్లాడటం.. అవసరం లేకున్నా అర్ధనగ్న ప్రదర్శనలు చేయడం కూడా దాడులకు హత్యలకు దారి తీస్తోంది. రీల్స్‌ చేయడం తప్పు కాదు. కానీ సరదా ముసుగులో క్రియేటివిటీ హద్దు మీరితే ముప్పు తప్పదు. రీల్స్‌‌కు దుస్సాహసాలు చేయాల్సిన పనిలేదు.సమాజానికి మంచి సందేశం ఇచ్చే రీల్స్‌ చేస్తున్న వాళ్లు ఎందరో వున్నారిలా. ఒక్క వీడియో వైరల్ అయితే చాలు రాత్రికి రాత్రే స్టార్‌డమ్‌ వచ్చేస్తుంది. కానీ వ్యూస్‌ ,లైకులతో దండిగా డబ్బులు వస్తాయనే ఆశే, యమపాశంలా మారుతోంది. రీల్స్‌ కోసం రిస్క్‌ తీసుకోవడం ఏమాత్రం హీరోయిజం కానేకాదు. రీల్స్‌తో పాపులార్టీ కోసం పాకులాడే కన్నా బాధ్యతగా నడుచుకోవడం ముఖ్యం.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..