గ్రీన్ టీ కంటే బ్లూ టీ ఆరోగ్య ప్రయోజనాలు డబుల్..!

09  march 2026

Jyothi Gadda

శంఖు పుష్పం దైవారాధనలో వాడుతూ ఉంటారు. శుంఖు పుష్పం ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. శంఖు పుష్పాల టీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు.

శుంఖుపుష్పాన్ని అపరాజిత, గిరికర్ణిక, దింటెన అనే పేర్లతోనూ పిలుస్తుంటారు. ఈ పుష్పాన్ని పూజలో ఎంత ప్రవిత్రంగా భావిస్తారో ఆయుర్వేదంలోనూ అంతే ప్రత్యేకంగానూ బావిస్తుంటారు.

ఆయుర్వేద వైద్యంలో ఎన్నో అనారోగ్యాల చికిత్సకు శంఖుపుష్పాన్ని వాడుతూ ఉంటారు. శంఖుపుష్పాల టీని తరచుగా తీసుకుంటే.. అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

శంఖుపుష్పం టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్‌ నుంచి రక్షిస్తాయి. ఫ్రీ రాడికల్స్ శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలను దెబ్బతీసే హానికరమైన పదార్థాలు.

ఖాళీ కడుపుతో వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఒక కప్పు టీ తాగితే, జీర్ణక్రియలో పేరుకున్న టాక్సిన్స్‌ తొలగుతాయి. జీర్ణక్రియకి మేలు చేస్తాయి. ఎసిడిటీ, మలబద్ధకం, గ్యాస్‌, కడుపుఉబ్బరం వంటి సమస్య తగ్గుతాయి.

బరువు తగ్గేవారికి ఈ టీ ఎంతో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. శంఖుపువ్వుల టీలో కెఫిన్‌ ఉండదు. అలాగే కార్బోహైడ్రేట్స్‌, కొవ్వులు, కొలెస్ట్రాల్‌ ఉండవు. ఇది బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.

శంఖు పుష్పాలటీ మెదడు ఆరోగ్యానికి, ఆందోళన, నిరాశకు చికిత్స చేయడానికి ఆయుర్వేదంలో వాడుతుంటారు. దీనిలోని ఎసిటైల్కోలిన్ సమ్మేళనం అల్జీమర్స్‌తో పోరాడటానికి కూడా సహాయపడుతుంది. మెదడు రిఫ్రెష్ ‌ అవుతుంది

శంఖు పుష్పాలలో ఉండే ప్రోయాంతోసైనిడిన్ కాంప్లెక్స్‌లు కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఈ టీలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనాల్జేసిక్ లక్షణాలు కంటి ఇన్ఫెక్షన్లు, ఎరుపు, వాపు వంటి సమస్యలను తగ్గిస్తాయి.