Telangana: పిలవని పెళ్లి భోజనానికి వెళ్తున్నారా.? దొరికితే శిక్ష ఎంత పడుతుందో తెల్సా..
ఆహ్వానం లేకుండా పెళ్లిళ్లు, శుభకార్యాలకు వెళ్లి భోజనం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. ఐపీసీ సెక్షన్ 441 ప్రకారం, అనుమతి లేకుండా ఇతరుల ప్రైవేటు ఆస్తిలోకి ప్రవేశించినందుకు మూడు నెలల జైలుశిక్షతో పాటు 5000 రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. ఇలాంటి చర్యల పట్ల జాగ్రత్త వహించాలని సూచన.

పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలకు సాధారణంగా బంధుమిత్రులను ఆహ్వానిస్తుంటాం. అయితే, కొందరు ఎలాంటి ఆహ్వానం లేకుండానే ఇలాంటి వేడుకలకు హాజరై భోజనం చేసి వెళుతుంటారు. ముఖ్యంగా నగరాల్లో హాస్టళ్లలో నివసించే యువకులు ఇలాంటి పనులు తరచు చేస్తుంటారు. కానీ, ఆహ్వానం లేనిదే పెళ్లి వేడుకల్లో పాల్గొని భోజనం చేయడం చట్టవిరుద్ధం. సాధారణంగా శుభకార్యాల్లో ‘అతిథి దేవోభవ’ అని పిలిచి మరీ భోజనాలు పెడతారు. కానీ, ఈ మధ్యకాలంలో పరిస్థితులు మారుతున్నాయి. పిలవని పేరంటానికి వెళ్లే ‘గేట్ క్రాషర్స్’కు చెక్ పెట్టేందుకు నిర్వాహకులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫంక్షన్ హాల్ బోర్డు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఆ బోర్డులో ఏముందంటే? ఒక ఫంక్షన్ హాల్ బయటపెట్టిన ఈ బోర్డులో స్పష్టంగా ఇలా రాసి ఉంది. ఫంక్షన్‌కు సంబంధం లేని వ్యక్తులు దొరికినచో సెక్షన్ 441 ప్రకారం 3 నెలలు జైలు శిక్ష, రూ. 5,000 జరిమానా అని రాసి ఉంది.
సెక్షన్ 441 అంటే ఏమిటి? నిర్వాహకులు పేర్కొన్న సెక్షన్ 441 భారత శిక్షాస్మృతి(IPC) ప్రకారం క్రిమినల్ ట్రెస్పాస్‌ను సూచిస్తుంది. అంటే ఒకరి అనుమతి లేకుండా వారి ప్రైవేట్ ఆస్తిలోకి లేదా వారు నిర్వహిస్తున్న ప్రదేశంలోకి ప్రవేశించడం నేరం. దీని కింద చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి, పిలవని పేరంటాలకు వెళ్లి ఆహారం తీసుకునే వారు ఈ చట్టపరమైన పరిణామాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

ఇది చదవండి: ఎన్ని సంవత్సరాలు రెంట్‌కి ఉంటే.. అద్దె ఇల్లు సొంతమవుతుంది.? ఎవ్వరికీ తెలియని నిజం
