AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rent House: ఎన్ని సంవత్సరాలు రెంట్‌కి ఉంటే.. అద్దె ఇల్లు సొంతమవుతుంది.? ఎవ్వరికీ తెలియని నిజం

అద్దెకున్న వ్యక్తులు 12 సంవత్సరాలకు పైగా అద్దె చెల్లిస్తే ఆస్తికి యజమానులుగా మారతారనేది ఒక అపోహ. అయితే, భారతీయ చట్టాల ప్రకారం, అద్దెదారుడు అద్దె చెల్లిస్తూనే ఉంటే శాశ్వత అద్దెదారుడిగా మారతారే తప్ప, ఆస్తి యాజమాని టైటిల్ డీడ్ ద్వారా మాత్రమే బదిలీ అవుతుంది. యజమాని ఆస్తి పన్ను చెల్లింపుదారుగా కొనసాగుతాడు.

Rent House: ఎన్ని సంవత్సరాలు రెంట్‌కి ఉంటే.. అద్దె ఇల్లు సొంతమవుతుంది.? ఎవ్వరికీ తెలియని నిజం
Rent Vs Buy
Ravi Kiran
|

Updated on: Mar 09, 2026 | 4:32 PM

Share

అద్దెకున్న వ్యక్తులు ఆస్తికి పూర్తి యజమానిగా మారగలడా? అనే ప్రశ్న అనేక మందిలో గందరగోళాన్ని సృష్టిస్తుంది. అద్దెదారులు, యజమానుల మధ్య ఆస్తి హక్కులు, బాధ్యతలు, ముఖ్యంగా దీర్ఘకాలిక అద్దెకు సంబంధించిన చట్టపరమైన అంశాలను ఇప్పుడు తెలుసుకుందామా.. అద్దెదారుడు 12 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం అద్దె చెల్లిస్తూ ఉంటే, ఆ ఆస్తి అతనికి సొంతం అవుతుందనే ఒక అపోహ ఉంది. అయితే, వాస్తవ చట్టపరమైన స్థితిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

అద్దెదారుడి పట్ల యజమానుల తీరు, అద్దెదారుడి సమస్యలు:

అద్దె ఇళ్లల్లో నివసించేవారు అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. ఉదాహరణకు, 25 సంవత్సరాలకు లీజుకు ఇచ్చిన షాపులను, గడువు ముగియకముందే మూడు రోజుల్లో ఖాళీ చేయమని ఆదేశించారు. జిమ్ వంటివి దశాబ్దాలుగా అద్దెకు నడుస్తున్నప్పటికీ, కొత్త యజమానులు ఖాళీ చేయమంటే తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. దీర్ఘకాలం ఒకేచోట వ్యాపారం చేయడం వల్ల ఏర్పడిన కస్టమర్ బేస్, సెటిల్మెంట్ వదిలి వెళ్లడం అద్దెదారులకు కష్టతరం. యజమానులు రెంట్ పెంచడం లేదా సమస్యలు సృష్టించడం ద్వారా వారిని ఖాళీ చేయించే ప్రయత్నాలు చేస్తుంటారు.

యజమానుల సమస్యలు, 12 సంవత్సరాల నిబంధన:

అద్దెదారులకు సమస్యలు ఉన్నట్టే, యజమానులకు కూడా కొన్ని సవాళ్లు ఉంటాయి. కొందరు అద్దెదారులు దీర్ఘకాలం ఒక ఆస్తిలో నివసిస్తున్నప్పుడు, “12 ఏళ్లు దాటితే ఇది నాదే” అని వాదిస్తారు. దీనికి ఢిల్లీలోని కరోల్ బాగ్ ఉదాహరణ. అక్కడ ఒక ఆస్తిని 150 రూపాయల అద్దెకు తీసుకుని 50 సంవత్సరాలుగా ఖాళీ చేయకుండా ఉన్న సందర్భం ఉంది. హైదరాబాదులోని ఓల్డ్ సిటీలో వక్ఫ్ బోర్డు ఆస్తుల్లో కొందరు నెలకి ఐదు రూపాయల అద్దె కడుతూ 50 ఏళ్లుగా ఉంటున్నారు. ఇక్కడ కీలకమైన అంశం ఏమిటంటే, 12 సంవత్సరాల నిబంధన అద్దెదారుకు ఆస్తిపై యాజమాని హక్కులను కల్పించదు. చట్టం దృష్టిలో, మీరు “శాశ్వత అద్దెదారు”గా మాత్రమే ఉంటారు.

చట్టపరమైన వివరణ – యాజమాని Vs. శాశ్వత అద్దె:

భారతీయ చట్టం ప్రకారం, 12 సంవత్సరాలకు పైగా అద్దె చెల్లించినప్పటికీ, అద్దెదారు ఆస్తికి యజమానిగా మారడు. యజమానిని  టైటిల్ డీడ్ ద్వారా నిర్ణయిస్తారు. ప్రాపర్టీ టాక్స్ ఎప్పుడూ ఆస్తి యజమాని పేరు మీదే ఉంటుంది. యజమానే దానిని చెల్లిస్తాడు. అద్దెదారుడు తన పేరు మీద ప్రాపర్టీ టాక్స్ రసీదు తెచ్చుకున్నా లేదా ఇతర బిల్లులను(ఎలక్ట్రిసిటీ, వాటర్) తన పేరు మీద మార్చుకున్నా, అది అతనికి టైటిల్ డీడ్ హక్కును ఇవ్వదు. యజమానిగా కావాలంటే, సదరు యజమాని ఆస్తిని అమ్మడానికి అంగీకరించాలి. అందుకు సంబంధించిన చట్టపరమైన పత్రాలు(అగ్రిమెంట్ ఆఫ్ సేల్, మనీ రిసీప్ట్) ఉండాలి. ఒక తెల్ల కాగితంపై యజమాని సంతకం తీసుకుని, దానిని అమ్మకం ఒప్పందంగా, డబ్బు అందుకున్న రసీదుగా చూపిస్తే తప్ప, కేవలం అద్దె చెల్లింపు ద్వారా ఆస్తి యజమాని కాలేరు. అందువల్ల, 12 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం అద్దెకు నివసించడం వల్ల ఒక వ్యక్తి “శాశ్వత అద్దెదారు”గా మారతాడే తప్ప, ఆస్తికి పూర్తి యజమానిగా మారడు. యజమాని ఆస్తిని ఖాళీ చేయించాలంటే, చట్టపరమైన ప్రక్రియను పాటించాలి, కొన్నిసార్లు అద్దెదారుకు నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది.

ఇది చదవండి: ఆ చెత్త సినిమా ఎందుకు చేశారు సర్.! ఓపెన్‌గా అడిగేసిన బిచ్చగాడు.. ఏఎన్నార్ ఏం చెప్పారంటే

Follow Us
ఎన్ని సంవత్సరాలు రెంట్‌కి ఉంటే.. అద్దె ఇల్లు సొంతమవుతుంది.?
ఎన్ని సంవత్సరాలు రెంట్‌కి ఉంటే.. అద్దె ఇల్లు సొంతమవుతుంది.?
ఆ విషయంలో NTPCకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వండి-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఆ విషయంలో NTPCకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వండి-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
బంగారం ధరలు మరింతగా తగ్గనున్నాయా..?
బంగారం ధరలు మరింతగా తగ్గనున్నాయా..?
ఇంట్లో శివలింగం ప్రతిష్టిస్తున్నారా? ఈ తప్పులు మాత్రం చేయొద్దు..!
ఇంట్లో శివలింగం ప్రతిష్టిస్తున్నారా? ఈ తప్పులు మాత్రం చేయొద్దు..!
దూబే మెరుపులకు కివీస్ విలవిల.. భార్య చేసిన ప్రార్థన ఫలించింది
దూబే మెరుపులకు కివీస్ విలవిల.. భార్య చేసిన ప్రార్థన ఫలించింది
నేనెప్పుడు ఇంతలా భావోద్వేగానికి గురికాలేదు.. రష్మిక ఎమోషనల్..
నేనెప్పుడు ఇంతలా భావోద్వేగానికి గురికాలేదు.. రష్మిక ఎమోషనల్..
మొక్కలు ఏపుగా పెరగాలంటే ఈ ఒక్కటి చాలు.. మీ గార్డెన్ బంగారమే!
మొక్కలు ఏపుగా పెరగాలంటే ఈ ఒక్కటి చాలు.. మీ గార్డెన్ బంగారమే!
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మరో నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు..
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మరో నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు..
మారిన ఆధార్ కార్డు అప్డేట్ రూల్స్.. యాప్ నుంచి అన్నీ సేవలు
మారిన ఆధార్ కార్డు అప్డేట్ రూల్స్.. యాప్ నుంచి అన్నీ సేవలు
పృథ్వీ షా మనసు దోచిన ముద్దుగుమ్మ తెలుగు హీరోయిన్ అంట
పృథ్వీ షా మనసు దోచిన ముద్దుగుమ్మ తెలుగు హీరోయిన్ అంట