AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్.. ముహూర్తం ఫిక్స్..

రైల్వేాశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. కొత్త ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయంపై క్లారిటీ ఇచ్చారు, వచ్చే నెల 15వ తేదీన కొత్త వెబ్ సైట్ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఇందులో అనేక కొత్త ఫీచర్లను జోడించారు.

IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్.. ముహూర్తం ఫిక్స్..
Irctc
Venkatrao Lella
|

Updated on: Jun 11, 2026 | 9:51 PM

Share

రైల్వే ప్రయాణికులకు భారీ గుడ్ న్యూస్. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. జులై 15వ తేదీలోగా ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్ సైట్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ 1999లో తీసుకొచ్చారు. కానీ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకోవడం మాత్రం 2002లో ప్రారంభమైంది. మొదటి రోజు వెబ్‌సైట్‌లో కేవలం 29 టిక్కెట్లు మాత్రమే బుక్ చేసుకోగా.. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్ ద్వారా ప్రతిరోజూ సగటున 14 లక్షలకు పైగా టిక్కెట్లు బుక్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ కేవలం రైలు టిక్కెట్ల బుకింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా.. హోటల్, బస్సు, రైల్వే టికెట్ల బుకింగ్ వంటి సేవలను అందిస్తోంది.

కొత్త వెబ్‌సైట్ ఎలా ఉంటుంది..?

ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ అధునాతన ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌పై పనిచేయనుంది. సర్వర్ సామర్థ్యం మరింతగా పెంచారు. దీంతో వెబ్ సైట్ వేగంగా లోడ్ అవ్వడంతో పాటు టికెట్లు వేగంగా పూర్తవుతాయి. ఇక బుకింగ్ సమయంలో అన్ని తరగతుల టికెట్ల లభ్యతను ఒకే ఒకేసారి చూడవచ్చు. అలాగే కొత్త ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్లో డైనమిక్ ఛార్జీల క్యాలెండర్ అందుబాటులోకి తెచ్చారు. అలాగే పేమెంట్ గేట్‌వే వైఫల్యాలను నివారించేందుకు, తత్కాల్ టిక్కెట్ల బుకింగ్‌ను వేగవంతం చేసేందుకు వెబ్‌సైట్‌లో ఈ-వాలెట్ ఫీచర్‌ ప్రవేశపెట్టారు. నిధులను ముందుగానే లోడ్ చేసుకోవడం వల్ల చెల్లింపు సమయంలో ఓటీపీల కోసం వేచి ఉండాల్సిన పని ఉండదు.

ఏఐ చాట్ బాట్

అలాగే ఈ వెబ్‌సైట్‌లో “దిశా” అనే ఏఐ ఆధారిత చాట్‌బాట్ తీసుకొచ్చారు. ప్రయాణికులు లాగిన్ చేయకుండానే తమ PNR స్టేటస్‌, టిక్కెట్ల రద్దు, రీఫండ్ స్టేటస్‌ వంటి చెక్ చేసుకోవచ్చు. ఈ ఏఐ చాట్ బాట్ వాయిస్, టెక్స్ట్ కమాండ్‌లు రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. అలాగే కొత్త వెబ్‌సైట్‌లో టూఫ్యాక్టర్ అథెంటికేషన్, క్యాప్చా వెరిఫికేషన్ తప్పనిసరి చేశారు. అలాగే అనధికార ఏజెంట్లు లేదా చట్టవిరుద్ధ సాఫ్ట్‌వేర్‌లు బల్క్ టిక్కెట్ బుకింగ్ చేయకుండా నిరోధించడానికి నిబంధనలు నిరంతరం కఠినతరం చేసేలా రూల్స్ తీసుకొచ్చారు. ఇక వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కన్పార్మ్ అవుతాయా.. లేదా అనేది 100 శాతం ఖచ్చితత్వంతో ముందుగానే తెలుసుకోవచ్చు. దీని వల్ల ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తమ ప్రయాణానికి చేసుకోవచ్చు. ఇందుకోసం కొత్త రిజర్వేషన్ సిస్టమ్‌లో ఏఐ ఫీచర్లు ప్రవేశపెట్టారు. ఈ ఏఐ ఫీచర్ గత రికార్డులను పరిశీలించి టికెట్ కన్పామ్ అవుతుదా.. లేదా అనేది ముందే అంచనా వేసి చెబుతోంది.

Follow Us
కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పెళ్లైన 6 రోజులకే వరుడు..
కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పెళ్లైన 6 రోజులకే వరుడు..
జూనియర్ ఆర్టిస్ట్‌గా రూ. 600తో మొదలు పెట్టి.. ఇప్పుడు ఇలా
జూనియర్ ఆర్టిస్ట్‌గా రూ. 600తో మొదలు పెట్టి.. ఇప్పుడు ఇలా
తలస్నానం చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. జుట్టు డ్యామేజ్‌
తలస్నానం చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. జుట్టు డ్యామేజ్‌
పాత బెడ్‌షీట్‌తో ఇన్ని ఉపయోగాలా? ఇంట్లో ఇలా రీయూజ్ చేసుకోండి!
పాత బెడ్‌షీట్‌తో ఇన్ని ఉపయోగాలా? ఇంట్లో ఇలా రీయూజ్ చేసుకోండి!
బిగ్‌బాస్ 10 ఎనిమిదో కంటెస్టెంట్‌గా షాలినీ పటేల్.. అసలు ఎవరీమే?
బిగ్‌బాస్ 10 ఎనిమిదో కంటెస్టెంట్‌గా షాలినీ పటేల్.. అసలు ఎవరీమే?
తుక్కుగూడ నర్సు హత్య కేసు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
తుక్కుగూడ నర్సు హత్య కేసు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హౌస్‌లోకి ఎంట్రీఇచ్చిన చైత్ర రాయ్ గురించి ఈ విషయాలు తెలుసా
హౌస్‌లోకి ఎంట్రీఇచ్చిన చైత్ర రాయ్ గురించి ఈ విషయాలు తెలుసా
ఏ దేవుడిని ఎప్పుడు పూజిస్తే మంచిది? దేవతలకు ఇష్టమైన ప్రత్యేక..
ఏ దేవుడిని ఎప్పుడు పూజిస్తే మంచిది? దేవతలకు ఇష్టమైన ప్రత్యేక..
బిగ్‌బాస్‌లోకి జబర్దస్త్ రామ్ ప్రసాద్ ఎంట్రీ.. ఈ విషయాలు తెలుసా?
బిగ్‌బాస్‌లోకి జబర్దస్త్ రామ్ ప్రసాద్ ఎంట్రీ.. ఈ విషయాలు తెలుసా?
అమెరికాను నెట్టి.. ప్రపంచంలో నెం. 2 మెట్రో నెట్‌వర్క్ గా భారత్
అమెరికాను నెట్టి.. ప్రపంచంలో నెం. 2 మెట్రో నెట్‌వర్క్ గా భారత్