EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఈ విషయం మర్చిపోతే డబ్బులు లాస్ అవుతారు.. ఇది మర్చిపోకండి..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. కొంతమంది తరచూ కంపెనీలు మారుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో పీఎఫ్ అకౌంట్ గురించి పట్టించుకోరు. అయితే మీరు కొత్త కంపెనీలోకి మారినప్పుడు పీఎఫ్ సర్వీస్ పీరియడ్‌ను బదిలీ చేసుకోవాలి. లేకపోతే పెన్షన్ ప్రయోజనాల్లో ఇబ్బందులు ఎదురుకావొచ్చు.

ఈపీఎఫ్ సౌకర్యం ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం పెన్షన్ సదుపాయం కల్పిస్తోంది. ఉద్యోగం మానేసిన రెండు నెలల తర్వాత మీరు పెన్షన్ సొమ్మును తీసుకోవచ్చు. లేదా 60 ఏళ్ల నెలనెలా పెన్షన్ పొందవచ్చు. 60 ఏళ్ల కంటే ముందే తీసుకుంటే ఒకసారి మొత్తం విత్ డ్రా చేసుకోవచ్చు. అదే 60 ఏళ్ల తర్వాత తీసుకుంటే ప్రతీ నెలా పెన్షన్ రూపంలో అందిస్తారు. ఇక 50 ఏళ్ల తర్వాత నుంచే పెన్షన్ సొమ్ము కావాలంటే కొత విధింపు జరుగుతుంది. అయితే కొన్ని పొరపాట్లు చేస్తే మీరు పెన్షన్ సొమ్మును కోల్పోవచ్చు. ఈ పొరపాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బదిలీ చేసుకోండి..
చాలామంది ఉద్యోగులు తాము పనిచేస్తున్న కంపెనీలో ఉద్యోగం మానేసిన తర్వాత తమ అకౌంట్లోని పీఎఫ్ సొమ్మును విత్ డ్రా చేసుకుంటారు. అయితే ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ గురించి పెద్దగా పట్టించుకోరు. పీఎఫ్‌తో పోలిస్తే పెన్షన్ సొమ్ము అనేది కాస్త భిన్నంగా ఉంటుంది. మీరు పీఎఫ్ ఉపసంహరించుకున్నా కూడా పెన్షన్ సర్వీస్ సీరియడ్ అనేది పాత కంపెనీ ఖాతాతో లింక్ చేయబడి ఉంటుంది. దీంతో మీరు దానిని మీరు కొత్త కంపెనీలో బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు పీఎఫ్ విత్ డ్రా చేసుకున్నాక పెన్షన్ సర్వీస్ పీరియడ్ అనేది ఆటోమేటిక్‌గా బదిలీ జరగదు. మీ సర్వీస్ హిస్టరీ పాత మెంబర్ షిప్ ఐడీకి లింక్ చేసి ఉండే పెన్షన్ లెక్కించేటప్పుడు ఆ సంవత్సరాలు పరిగణలోకి తీసుకోరు. దీంతో పెన్షన్ ప్రయోజనాలు తగ్గే అవకాశముంటుంది. మీరు మునుపటి ఉద్యోగాల సర్వీస్ రికార్డులను బదిలీ చేసుకోకపోతే పింఛన్ రికార్డులో లోపాలు ఏర్పడవచ్చు. దీని వల్ల మీ పెన్షన్ అర్హత కాలం తగ్గిపోవచ్చు. అందుకే కొత్త కంపెనీలో చేరగానే బదిలీ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం.
బదిలీ చేసుకోవడం ఎలా..?
-ఈపీఎఫ్‌వో పోర్టల్‌లోకి వెళ్ళండి
-యూఏఎన్ నెంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి
-హోమ్ పేజీలో ఆన్‌లైన్ సర్వీసెస్ ఆప్షన్ ఎంచుకోండి
-‘One Member – One EPF Account అనే ట్యాబ్‌పై క్లిక్ చేయండి
-మీ వ్యక్తిగత వివరాలతో పాటు మీ ప్రస్తుత కంపెనీ PF అకౌంట్ వివరాలు చెక్ చేస్కోండి
-పాత అకౌంట్ వివరాల కోసం మీ UAN లేదా పాత Member IDని ఎంటర్ చేసి ‘Get Details’ పై క్లిక్ చేయండి
-మీ బదిలీ రిక్వెస్ట్‌ను మీ పాత కంపెనీ యాజమాన్యం ఆమోదించాలనుకుంటే Previous Employer మీద క్లిక్ చేయాలి
– ప్రస్తుతం కంపెనీ ద్వారా అయితే Present Employer ఆప్షన్‌పై క్లిక్ చేయండి
– ‘Get OTP’ బటన్‌పై క్లిక్ చేయండి
-మీ ఆధార్ కార్డ్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తే సరిపోతుంది
సబ్మిట్ చేయండి: ఆ OTP ని ఎంటర్ చేసి ‘Submit’ చేయండి.
