AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: కేంద్రం గుడ్ న్యూస్.. వచ్చే నెలలోనే అకౌంట్లోకి రూ.2 వేలు..! అప్లై చేసుకోండిలా..

కేంద్ర ప్రభుత్వం రైతులకు త్వరలో గుడ్ న్యూస్ తెలపనుంది. పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ ఇవ్వనుంది. ఇప్పటివరకు 22 విడదల సాయం అందించగా.. త్వరలో 23వ విడత జమ చేసేందుకు సిద్దమవుతోంది. జులైలో తర్వాతి ఇన్‌స్టాల్‌మెంట్ పంపిణీ చేయనుందని తెలుస్తోంది.

PM Kisan: కేంద్రం గుడ్ న్యూస్.. వచ్చే నెలలోనే అకౌంట్లోకి రూ.2 వేలు..! అప్లై చేసుకోండిలా..
Indian Money
Venkatrao Lella
|

Updated on: Jun 11, 2026 | 9:08 PM

Share

కేంద ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ.2 వేల చొప్పున అందిస్తోంది. అంటే ప్రతీ ఏడాది రూ.6 వేల ఆర్ధిక సాయం పంపిణీ చేస్తోంది. ఈ డబ్బును ప్రతి సంవత్సరం ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి అనే మూడు విడతల్లో విడుదల చేస్తున్నారు. ఆర్ధిక సంవత్సరం లెక్కన నిధులు జమ చేస్తున్నారు. ఈ నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లోకి రిలీజ్ చేస్తున్నారు. ప్రధాని మోదీ స్వయంగా ఈ నిధులను ప్రతీ విడతలో బటన్ నొక్కి విడుదల చేస్తున్నారు. త్వరలో 23వ విడత నగదును విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో అసలు ఈ పథకానికి అర్హులు ఎవరు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అనే విషయాలు చూద్దాం.

పీఎం కిసాన్ పథకానికి ఎవరు అర్హులు?

-భారత పౌరుడై ఉండాలి

-సాగుకు అనుకూలమైన భూమి కలిగి ఉండాలి

-చిన్న లేదా సన్నకారు రైతు అయి ఉండాలి. అంటే ఐదు ఎకరాల్లోపు పోలం కలిగి ఉండాలి.

-నెలకు కనీసం రూ. 10 వేల పింఛను పొందే పదవీ విరమణ పొందిన వ్యక్తి అయి ఉండకూడదు

-ఆదాయపు పన్ను దాఖలు చేసి ఉండకూడదు

-సంస్థాగత భూస్వామిగా ఉండకూడదు

దరఖాస్తు చేసుకోవడం ఎలా?

– https://pmkisan.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి

– ‘కొత్త రైతు నమోదు’పై క్లిక్ చేయండి

-మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి

– క్యాప్చాను ఎంటర్ చేయండి

-అవసరమైన వివరాలను నమోదు చేసి ‘అవును’పై క్లిక్ చేయండి

-పీఎం కిసాన్ దరఖాస్తు ఫారంలో అడిగిన సమాచారాన్ని ఎంటర్ చేసి భద్రపరచండి. ఫారంను ప్రింటవుట్ తీసుకోండి

స్టేటస్ తెలుసుకోవడం ఎలా..?

-https://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌కు వెళ్లండి

-హోమ్ పేజీలో కుడి వైపున ఉన్న ‘మీ స్థితిని తెలుసుకోండి’ అనే ట్యాబ్‌పై క్లిక్ చేయండి

– మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేసి క్యాప్చా కోడ్‌ను పూరించండి

-అనంతరం ‘గెట్ డేటా’పై క్లిక్ చేయండి

-మీ స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

లబ్ధిదారుల జాబితాలో మీ పేరు తెలుసుకోవడం ఎలా..?

-PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ను ఓపెన్ చేయండి

-‘లబ్ధిదారుల జాబితా’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి

-మీ రాష్ట్రం, జిల్లా, ఉప-జిల్లా, బ్లాక్, గ్రామం వంటివి ఎంచుకోండి

-‘గెట్ డీటైల్స్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి

23వ విడత ఎప్పుడు..?

పీఎం కిసాన్ 23వ విడత డబ్బులు 2026 జూలైలో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే అధికారిక తేదీని ఇంకా ప్రకటించలేదు. మార్చి 13న అస్సాంలోని గౌహతిలో 22వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. 9.32 కోట్ల మంది రైతులకు రూ. 18,640 కోట్లు పంపిణీ చేశారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా రైతులకు 22 విడతలలో మొత్తం రూ. 4.25 లక్షల కోట్లు పంపిణీ చేశారు.

Follow Us
బంగారు అభరణాలపై రుణం తీసుకుంటున్నారా? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు
బంగారు అభరణాలపై రుణం తీసుకుంటున్నారా? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు
పంక్షన్‌ కోసం చెన్నై వెళ్లారు.. తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఘోరం..
పంక్షన్‌ కోసం చెన్నై వెళ్లారు.. తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఘోరం..
వామ్మో వర్షాకాలంలో పుదీనా తింటే ఇన్ని కష్టాలా? ఆయుర్వేదం ప్రకారం
వామ్మో వర్షాకాలంలో పుదీనా తింటే ఇన్ని కష్టాలా? ఆయుర్వేదం ప్రకారం
నాగుపాము కంటే డేంజర్.. నిద్రలోనే ప్రాణాలు తీసే ఈ పాము గురించి..
నాగుపాము కంటే డేంజర్.. నిద్రలోనే ప్రాణాలు తీసే ఈ పాము గురించి..
గంభీర్ కోపాన్ని తొలిసారి చూసిన వైభవ్ సూర్యవంశీ!
గంభీర్ కోపాన్ని తొలిసారి చూసిన వైభవ్ సూర్యవంశీ!
భారీ వర్షంలో వందే భారత్ .. నీటిని చీల్చుకుంటూ దూసుకెళ్లిన దృశ్యం
భారీ వర్షంలో వందే భారత్ .. నీటిని చీల్చుకుంటూ దూసుకెళ్లిన దృశ్యం
ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. 14 ఏళ్లకే ఏకంగా బుర్జ్ ఖలీఫాలోనే AI..
ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. 14 ఏళ్లకే ఏకంగా బుర్జ్ ఖలీఫాలోనే AI..
రోజు రూ.50 ఆదా చేస్తే చాలు.. గ్యారంటీగా మీ చేతికి రూ.30 లక్షలు..!
రోజు రూ.50 ఆదా చేస్తే చాలు.. గ్యారంటీగా మీ చేతికి రూ.30 లక్షలు..!
నాగబంధంలో ఆ సీన్స్ కట్..
నాగబంధంలో ఆ సీన్స్ కట్..
మద్యం మత్తులో బస్సు కిందకు దూరి మందుబాబు హంగామా..
మద్యం మత్తులో బస్సు కిందకు దూరి మందుబాబు హంగామా..