చిరంజీవి ‘విశ్వంభర’కు విజువల్ ఎఫెక్ట్స్ తలనొప్పులు
ఇటీవలి కాలంలో విడుదలైన చిత్రాలకు మాత్రమే కాకుండా, నిర్మాణ దశలో ఉన్న భారీ చిత్రాలకు కూడా విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్‌ఎక్స్) కష్టాలు తప్పడం లేదు. సినిమా కోసం ఎంత సమయం కేటాయించినా, వీఎఫ్‌ఎక్స్ పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో రిలీజ్ డేట్లు మళ్ళీ మళ్ళీ వాయిదా పడుతున్నాయి.
చిరంజీవి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సోషియో-ఫాంటసీ చిత్రం విశ్వంభర గతేడాదిన్నరగా గ్రాఫిక్స్ సమస్యలతో సతమతమవుతోంది. విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో, ఈ భారీ చిత్రం విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. అలాగే, నిఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా పీరియాడిక్ చిత్రం స్వయంభుకు కూడా వీఎఫ్‌ఎక్స్ అవుట్‌పుట్ సంతృప్తికరంగా లేకపోవడంతో ఆలస్యం అవుతోంది. ఏప్రిల్ నుండి వాయిదా పడిన ఈ చిత్రం కొత్త విడుదల తేదీ కోసం ఎదురుచూస్తోంది. నాగబంధం చిత్రం కూడా గ్రాఫిక్స్ నాణ్యత కోసం మేకర్స్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. మేలో విడుదల కావాల్సిన ఈ చిత్రం జూలై 3కి వాయిదా పడింది. పెద్ద సినిమాలకు గ్రాఫిక్స్ ప్రాణం. అయితే, షూటింగ్ మధ్యలో మేకర్స్, వీఎఫ్‌ఎక్స్ టెక్నీషియన్ల మధ్య కమ్యూనికేషన్ లోపం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. ముందు నుంచే పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో రంగంలోకి దిగితే ఈ జాప్యాలను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్న బయోపిక్స్
ఐమ్యాక్స్ ఐమాక్స్ కోసం ఆ రేట్లు తప్పవా..?
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..
ఇంటి పెరట్లో అర్ధరాత్రి వింత ఆకారం..
బావిలో రాకాసి అలలు.. చూసి షాకవుతోన్న జనం!
చెత్తలో రూ.11 కోట్ల లాటరీ టికెట్.. చివరికి ఊహించని ట్విస్ట్!
ట్రాక్‌పై దూసుకెళ్తున్న రైలు.. ఒక్కసారిగా ఊడిపోయిన చక్రాలు
హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు

