మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
మంచుతో కప్పి ఉండే హిమాలయాల మధ్య సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో జోజి లా సొరంగం నిర్మాణం పూర్తయింది. ఏడాది పొడవునా ఎముకలు కొరికే చలి, 100 రోజులు మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు , మంచు తుపానులతో ఈ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయేవి. సైనిక దళాల తరలింపు, ఇతర వస్తువుల రవాణా పూర్తిగా నిలిచిపోయేది. ప్రస్తుతం ఈ సమస్యకు చెక్ పెడింది. జమ్మూకశ్మీర్-లద్దాఖ్‌ను కలుపుతూ మంగళవారం కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ జోజిలా సొరంగాన్ని ప్రారంభించారు. మేఘా ఇంజినీరింగ్ ఈ సొరంగాన్ని నిర్మించింది. ఇంజినీరింగ్ నిర్మాణంలో ఎంతోమంది తెలుగు ఇంజినీర్లు, నిపుణులు పాల్గొన్నారు.
ఈ సొరంగం వల్ల వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా.. ఇకపై 365 రోజులు లద్దాక్‌కు వెళ్లేందుకు వీలు కలుగుతుంది. అంతేగాక.. దేశంలోని ఇతర ప్రాంతాలతో స్థానికులకు మరింత యాక్సెస్ పెరగనుంది. దేశ వ్యూహాత్మక ప్రయోజనాలు, రక్షణ దృష్ట్యా కూడా ఈ సొరంగం ముఖ్య పాత్ర పోషించనుంది. సాధారణంగా ఇలాంటి సొరంగాల్లో ఒన్ వే రవాణా మాత్రమే ఉంటుంది. కానీ, కానీ, ఈ జోజిలా సొరంగాన్ని.. రెండు వైపులా రాకపోకలు సాగించేలా నిర్మించారు. సాధారణంగా హిమాలయాల్లోని రాతిపొరలు చాలా సున్నితంగా ఉంటాయి. ముందు క్లిష్టమైన రాతి, తర్వాత మెత్తని పొరలతో ముందుకు వెళ్లే కొద్దీ భూగర్భం తీరు మారుతుంటుంది. న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ విధానంలో సున్నితమైన పొరలను కూడా తొలిచి పరిస్థితులను సాంకేతికంగా అంచనా వేస్తూ పనులు చేపట్టారు. ఈ సొరంగంలో 67 సార్లు రాతి స్వభావం మారడంతో కష్టమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ప్రతి మీటరు తవ్వకం ఒక కొత్త పరీక్షగా మారింది. అయినప్పటికీ అనుభవం ఉన్న నిపుణులు సవాళ్లను అధిగమించి సొరంగం నిర్మాణం పూర్తి చేశారు.
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

