పర్సనల్ లోన్ తీసుకుని గోల్డ్ కొంటున్నారా..?

Venkatrao Lella

Images: Pinterest

11  JUNE 2026

ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. బంగారం కొనుగోలు చేసేందుకు భారతీయులు బాగా ఇష్టపడతారు. పెళ్లిళ్లు, పంక్షన్లు వచ్చాయంటే బంగారం ధరించి మురిసిపోతారు.

బంగారానికి డిమాండ్

బంగారాన్ని ఒక ఆభరణంగానే కాకుండా దీనిని ఒక ఆస్తిగా కూడా పరిగణిస్తారు. డబ్బులు ఉన్నప్పుడు బంగారాన్ని కొనుగోలు చేసి దాచుకుంటారు. ఆర్ధిక పరిస్థితులు బాలేనప్పుడు ఈ బంగారం అమ్మి  తమ అవసరాలు తీర్చుకుంటారు. దీంతో కష్టకాలంలో ఆదుకునే ఒక సాధనంగా బంగారం ఉంది.

బంగారం ఆస్తి కూడా

ఇక ఇటీవల స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు, డిజిటల్ రూపంలో బంగారంలో పెట్టుబడులు పెట్టేవారు కూడా ఎక్కువగా ఉన్నారు. అయితే పెళ్లిళ్లు, పంక్షన్ల సమయంలో డబ్బులు లేకపోయినా బంగారం కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటుంది.

బంగారం కొనుగోలు చేస్తున్నారా..

అలాంటప్పుడు పర్సనల్ లోన్ తీసుకుని బంగారం కొనుగోలు చేయాలని చాలామంది భావిస్తున్నారు. ఇది మంచిదా. .కాదా అనేది ఆలోచించకుండా అవసరం కావడంతో కొనుగోలు చేస్తుంటారు. కానీ ఇలా పర్సనల్ లోన్ తీసుకుని కొనుగోలు చేయడం మంచిది కాదని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.

పర్సనల్ లోస్ తీసుకుని.

పర్సనల్ లోన్ తీసుకుని బంగారం కొనుగోలు చేయడం తెలివైన నిర్ణయం కాదంటున్నారు. డబ్బులు లేని సమయంలో రూ.2 లక్షల్లోపు రుణం తీసుకుని కొనుగోల చేయవచ్చు. కానీ అంతకంటే పెద్ద మొత్తంలో లోన్ తీసుకుని కొనుగోలు చేయడం రిస్క్‌తో కూడుకున్న పనిగా చెబుతున్నారు.

తెలివైన నిర్ణయం కాదు..

బ్యాంకు పర్సనల్ లోన్స్ వడ్డీ  15% నుంచి 25% వరకు ఉంటుంది. దీని కోసం పెద్ద మొత్తంలో ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో మినహా ఎప్పుడూ అలాంటి పని చేయకూడదు. ఇక పెట్టుబడి కోసం బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాలనుకుంటే పర్సనల్ లోన్ తీసుకొని కొనుగోలు చేయడం మంచిది కాదు.

వడ్డీ ఎక్కువ.

ఇక బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం కన్నా గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీకు ఆదాయం వస్తుంది. ఇక డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టడం కూడా మంచిది. ప్రస్తుతం అనేక డిజిటల్ గోల్డ్ యాప్ అందుబాటులోకి వచ్చాయి.

గోల్డ్ ఈటీఎఫ్‌లలో

డిజిటల్ గోల్డ్ యాప్స్‌లలో మీరు రూపాయి నుంచి ఎంత అయినా పెట్టుబడి పెట్టవచ్చు. సులువుగా పేమెంట్ చేసి కొనుగోలు చేయడంతో పాటు అవసరమైనప్పుడు సులభంగా విక్రయించి డబ్బులు తీసుకోవచ్చు.

డిజిటల్ గోల్డ్