AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Central Government: జూన్ 15 వరకే డెడ్ లైన్.. ఆ తర్వాత వడ్డీ కట్టాల్సిందే.. వెంటనే అలర్ట్ అవ్వకపోతే..

కేంద్ర ప్రభుత్వం జూన్ నుంచి పలు నిబంధనల్లో మార్పులు చేసింది. ఇన్‌కమ్ ట్యాక్స్ ముందస్తు చెల్లింపు గడువు జూన్ 15తో ముగుస్తుంది. అలాగే ఈ నెల నుంచి పాన్ నిబంధనలు, ఏటీఎం రూల్స్‌లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక పొదుపు పథకాలపై వడ్డీని కూడా ప్రకటించింది.

Central Government: జూన్ 15 వరకే డెడ్ లైన్.. ఆ తర్వాత వడ్డీ కట్టాల్సిందే.. వెంటనే అలర్ట్ అవ్వకపోతే..
Pan Card
Venkatrao Lella
|

Updated on: Jun 11, 2026 | 9:32 PM

Share

ఆదాయపు పన్నుదారులకు అలర్ట్. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి ముందస్తు పన్ను చెల్లింపు గడువు జూన్ 15తో ముగుస్తుంది. సంవత్సరానికి రూ.10 వేలు మించిన అంచనా పన్నును ఈ తేదీ నాటికి తమ ముందస్తు పన్ను బాధ్యతలో 15 శాతం చెల్లించాల్సి ఉంటుంది. కొత్త ఆదాయపు పన్ను చట్టం, 2025, ఆదాయపు పన్ను నియమాలు, 2026 కింద పూర్తిగా అమలు చేయబడుతున్న మొదటి ముందస్తు పన్ను ఇదే. గడువు తేదీలోగా అవసరమైన మొత్తాన్ని చెల్లించకపోతే పన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

లావాదేవీల్లో మార్పులు

పలు బ్యాంకులు కొన్ని ఏటీఎం లావాదేవీలు, సంబంధిత సేవలపై విధించే ఛార్జీలను సవరించాయి. ఉచిత లావాదేవీ పరిమితిని మించి నగదు ఉపసంహరణలు, మినీ స్టేట్‌మెంట్, ఏటీఎంల వద్ద బ్యాలెన్స్ ఎంక్వైరీకి వర్తించే రుసుములలో మార్పులు చేసింది. బ్యాంకులను బట్టి ఛార్జీలు వేర్వేరుగా ఉండే అవకాశం ఉంటాయి. దీంతో వినియోగదారులు తమ తమ బ్యాంకులు జారీ చేసిన తాజా రుసుములను తనిఖీ చేసుకోవాలి.

మార్పులు లేనట్టే

కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ది యోజన, KVPలతో పాటు చిన్న పొదుపు పథకాల కోసం జూలై-సెప్టెంబర్ 2026 త్రైమాసికానికి కొత్త వడ్డీ రేట్లను ప్రకటించనుంది. ప్రస్తుత త్రైమాసికానికి కేంద్రం చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. పీపీఎఫ్ పథకాలపై 7.1 శాతం వడ్డీ అందిస్తుండగా.. సుకన్య సమృద్ధి యోజన 8.2 శాతం వడ్డీని అందిస్తోంది.

మారిన పాన్ నిబంధనలు

కేంద్ర ప్రభుత్వం పాన్ నిబంధనల్లో మార్పులు చేసింది. రూ.50 వేలు పైబడిన కొన్ని సాధారణ నగదు డిపాజిట్లకు పాన్ నంబర్ అందించడం ఇకపై తప్పనిసరి కాదు. ఇక ఆస్తి లావాదేవీలలో పాన్ అవసరాన్ని రూ. 10 లక్షల నుండి రూ. 20 లక్షలకు పెంచారు. రూ.20 లక్షలు పైబడిన లావాదేవీదలకు పాన్ అవసరం. ఇక రూ. 45 లక్షలకు మించిన ఆస్తి లావాదేవీలకు పాన్ తప్పనిసరి. అలాగే భారీ బహుతులకు పాన్ తప్పనిసరిగా అందించాలి. ఈ నెల నుంచి పాన్ నిబంధనల్లో మార్పులు జరిగాయి.

Follow Us