AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Online Game: ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. మామను కొట్టి చంపిన అల్లుడు!

తెల్లవారుజామున మూడు గంటల సమయంలో అల్లుడు ఆన్ లైన్ గేమ్ ఆడుతుండగా గుర్తించాడు మామ. దీంతో కోపాలకు గురైన అల్లుడు అనుకున్నంత పని చేశాడు. ఇంతలోనే కోపంతో కట్టలు తెంచుకున్న అల్లుడు.. మామను దారుణంగా కొట్టి చంపాడు. హత్యచేసిన తర్వాత అల్లుడు వెంటనే..

Online Game: ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. మామను కొట్టి చంపిన అల్లుడు!
Online Game Addiction
Raju M P R
| Edited By: |

Updated on: Aug 16, 2026 | 10:28 PM

Share

Online Game: పూతలపట్టు మండలం తేనేపల్లిలో ఆన్ లైన్ గేమ్ ఒక వ్యక్తి హత్యకు కారణమైంది. ఆన్ లైన్ గేమ్ ఆడుతున్న అల్లుడిని మందలించిన పాపానికి మామ హత్య కు గురయ్యాడు. టి.రంగంపేట ఎస్టీ కాలనీ లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. తేనేపల్లి రంగంపేట కు చెందిన సుబ్రహ్మణ్యం కు ఇద్దరు కూతుళ్లు. 60 ఏళ్ల సుబ్రహ్మణ్యం ఉప్పు అమ్మడం, లేదంటే కూలీ పనులు చేసుకుంటూ ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేశాడు. మదనపల్లి చెందిన అశోక్ కు పెద్ద కూతురును ఇచ్చి పెళ్లి చేయగా, అశోక్ దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. సెలవు పై భార్య పిల్లలతో మామగారి ఇంటికి వచ్చిన అశోక్ ఆన్‌లైన్‌ గేమ్ ఆడుతూ ఉన్నాడు.

తెల్లవారుజామున మూడు గంటల సమయంలో అల్లుడు ఆన్ లైన్ గేమ్ ఆడుతుండగా గుర్తించాడు. ఈ మేరకు ఈరోజు ఉదయం అల్లుడు అశోక్ ను మామ సుబ్రహ్మణ్యం మందలించాడు. ఆన్‌లైన్‌ జూదానికి బానిస కావద్దని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఆగ్రహానికి లోనైనా అల్లుడు అశోక్ మామ మందలింపును జీర్ణించుకోలేక పోయాడు. మామ సుబ్రహ్మణ్యంతో గొడవపడ్డాడు. ఆగ్రహనికి గురైన అల్లుడు అశోక్ మామపై పిడుగులతో దాడికి దిగాడు. దీంతో మామ సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే మృతి చెందండంతో భయంతో అశోక్ పరారీ అయ్యాడు. కుటుంబ సభ్యులు చేరుకునే లోపు కనిపించకుండా పోయిన అశోక్ ను పోలీసులు వెతుకుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పూతలపట్టు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో