AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఇప్పటి వరకు ఎంత మంది అమ్మాయిలు పడ్డారు’.. IPS అక్షయ్‌ UPSC సివిల్స్ ఇంటర్వ్యూలో ఊహించని ప్రశ్న

IPS అక్షయ్‌ తన సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ.. తన ఇంటర్వ్యూ మాత్రం ప్రశ్నలు-జవాబుల పద్ధతిలో కాకుండా ఓ సాధారణ సంభాషణలా సాగిందని తెలిపారు. తన ఇంటర్వ్యూ మార్చి 23న జరిగిందని IPS అక్షయ్‌ తెలిపారు. 1931 మార్చి 23న భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురు అమరులయ్యారు. ఆ సమయంలో భగత్ సింగ్ వయసు 23 ఏళ్లు కాగా, తాను కూడా 23 ఏళ్ల వయసులోనే సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూకు..

'ఇప్పటి వరకు ఎంత మంది అమ్మాయిలు పడ్డారు’.. IPS అక్షయ్‌ UPSC సివిల్స్ ఇంటర్వ్యూలో ఊహించని ప్రశ్న
IPS Akshay Kumar Shares His UPSC Interview Unique Experience
Srilakshmi C
|

Updated on: Oct 02, 2026 | 7:19 PM

Share

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ అంటే అభ్యర్థుల జ్ఞానం, వ్యక్తిత్వం, ఆలోచనా విధానం, సమయస్ఫూర్తిని పరీక్షించే కీలక దశ. సాధారణంగా అభ్యర్థులు కఠినమైన ప్రశ్నలు ఎదురవుతాయని భావిస్తారు. అయితే IPS అక్షయ్‌ తన సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ.. తన ఇంటర్వ్యూ మాత్రం ప్రశ్నలు-జవాబుల పద్ధతిలో కాకుండా ఓ సాధారణ సంభాషణలా సాగిందని తెలిపారు. తన ఇంటర్వ్యూ మార్చి 23న జరిగిందని IPS అక్షయ్‌ తెలిపారు. 1931 మార్చి 23న భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురు అమరులయ్యారు. ఆ సమయంలో భగత్ సింగ్ వయసు 23 ఏళ్లు కాగా, తాను కూడా 23 ఏళ్ల వయసులోనే సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూకు హాజరైనట్లు చెప్పారు. భగత్ సింగ్ దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. నేను దేశానికి సేవ చేయడానికి వస్తున్నాను. ఆ రోజు మా ఇద్దరి మధ్య ఉన్న తేడా అంతే అని ఆయన పేర్కొన్నారు. తన వయసు, భగత్ సింగ్ వయసు ఒకటే కావడంతో ఇంటర్వ్యూలో ఆయన గురించి ప్రశ్న అడుగుతారని తాను ఊహించినట్లు చెప్పారు. అయితే అలా జరగలేదన్నారు.

తొలి ప్రశ్నే ఊహించనిది..

IPS అక్షయ్‌ ఇంటర్వ్యూ బోర్డుకు రిటైర్డ్ ఎయిర్ మార్షల్ అజిత్ బోన్స్లే నాయకత్వం వహించారు. సుమారు 20-25 నిమిషాల పాటు ఇంటర్వ్యూ సాగిందని ఆయన తెలిపారు. ‘మీకు ఇప్పటివరకు ఎంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు?’ అనే ప్రశ్నతో తన ఇంటర్వ్యూ ప్రారంభమైందని IPS అక్షయ్‌ చెప్పారు. ఈ ప్రశ్న తనను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. అయితే దానికి పెద్దగా స్పందించకుండా నవ్వుతూ ‘ఎవరూ లేరు’ అని సమాధానమిచ్చానని తెలిపారు. ఇంటర్వ్యూ బోర్డు తనను ఒత్తిడికి గురిచేయకుండా చాలా సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించిందన్నారు.

వరంగల్‌ అనగానే నక్సలిజంపై ప్రశ్న

తర్వాత తన విద్య, నేపథ్యానికి సంబంధించిన అంశాలపై ప్రశ్నలు వచ్చాయని IPS అక్షయ్‌ వివరించారు. వరంగల్‌ నుంచి వచ్చినట్లు చెప్పగానే నక్సలిజంపై ప్రశ్న అడిగారని తెలిపారు. నక్సలిజం సిద్ధాంతంపై తనకు ఆసక్తి ఉండటంతో ఆ ప్రశ్న తనకు నచ్చిందన్నారు. అయితే దానితో పాటు అమెరికాలో జాతి వివక్ష, బ్రిటిష్‌ వలస పాలన ప్రభావం, భారతదేశంపై దాని సానుకూల, ప్రతికూల ప్రభావాలు వంటి అంశాలపైనా ప్రశ్నలు ఎదురయ్యాయని చెప్పారు. తాను వైల్డ్‌లైఫ్‌పై ఆసక్తి ఉందని అప్లికేషన్‌లో పేర్కొనడంతో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు, నార్తర్న్ వైట్ రైనో గురించి కూడా బోర్డు ప్రశ్నలు అడిగిందని IPS అక్షయ్‌ తెలిపారు. అలాగే ఉడాన్‌ పథకం, హన్మకొండ అనే పేరు ఎలా వచ్చిందనే విషయం, చైనా-శ్రీలంకతో భారత సంబంధాలు వంటి అంశాలపై కూడా ప్రశ్నలు వచ్చాయని చెప్పారు. తన ఆప్షనల్ సబ్జెక్ట్ పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కావడంతో అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించిన ప్రశ్నలు కూడా అడిగినట్లు వివరించారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో అప్పట్లో చర్చకు వచ్చిన హర్ష్ మందర్, రామచంద్ర గుహ మధ్య డిబేట్‌కు సంబంధించిన ప్రశ్న కూడా తనకు ఎదురైందని IPS అక్షయ్‌ తెలిపారు.

‘ఇంటర్వ్యూ తర్వాత ఢిల్లీ తిరుగు’..

ఇంటర్వ్యూ ముగిసే సమయంలో బోర్డు సభ్యుడు అజిత్ బోన్స్లే ‘ఈరోజు మీ ప్లాన్స్ ఏంటి?; అని అడిగారని IPS అక్షయ్‌ చెప్పారు. తాను అప్పటివరకు ఏమీ నిర్ణయించుకోలేదని చెప్పడంతో.. ‘ఇప్పుడు నిర్ణయించుకోండి. నేను మీకు సమయం ఇస్తాను’ అని బోన్స్లే చెప్పినట్లు తెలిపారు. తాను మొదటిసారి ఢిల్లీకి వచ్చానని చెప్పడంతో, కుతుబ్ మినార్, కన్నాట్ ప్లేస్ తదితర ప్రాంతాలను సందర్శించవచ్చని బోన్స్లే సూచించినట్లు చెప్పారు. ఆ సమయంలో తనకు అది అసలు ఇంటర్వ్యూలా అనిపించలేదని, స్నేహపూర్వక సంభాషణలా సాగిందని అక్షయ్‌ పేర్కొన్నారు. ఇంటర్వ్యూ సమయంలో అంతా ప్రశాంతంగానే సాగినప్పటికీ, బయటకు వచ్చిన తర్వాత మాత్రం తాను ఆందోళనకు గురయ్యానని అక్షయ్‌ తెలిపారు. ‘నేను చాలా చదువుకుని ఇంటర్వ్యూకు వెళ్లాను. కానీ నేను ఊహించిన ప్రశ్నలు పెద్దగా రాలేదు. ప్రశ్నలు తక్కువగా, చర్చ ఎక్కువగా సాగినట్లు అనిపించింది. ఈ చర్చ ఆధారంగా నన్ను ఎలా అంచనా వేస్తారు? ఎన్ని మార్కులు ఇస్తారు? అని బయటకు వచ్చిన తర్వాత అనుకున్నాను’ అని వివరించారు. అయితే ఫలితాలు వచ్చిన తర్వాత తనకు మంచి మార్కులు రావడంతో ఆ ఆందోళన అంతా తొలగిపోయిందన్నారు.

179 మార్కులు.. జాబితాలో స్థానం

సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలో తనకు 179 మార్కులు వచ్చాయని అక్షయ్‌ తెలిపారు. దాదాపు 180 మార్కులు వస్తాయని ఊహించలేదని, తాను 120-130 మార్కులు వస్తే గొప్ప అనుకున్నానని చెప్పారు. ‘179 మార్కులు రావడం చాలా మంచి స్కోర్. ఆ మార్కులే నన్ను తుది జాబితాలో నిలబెట్టడానికి ఎంతో ఉపయోగపడ్డాయి. అందుకే బోన్స్లే సర్‌ ఎక్కడ ఉన్నా ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి’ అని అక్షయ్‌ తన ఇంటర్వ్యూ అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన చెప్పిన అనుభవం చూస్తే సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలో కేవలం పుస్తక పరిజ్ఞానమే కాకుండా, అభ్యర్థి ఆలోచనా విధానం, సమయస్ఫూర్తి, వ్యక్తిత్వం, వివిధ అంశాలపై అవగాహనను కూడా బోర్డు సంభాషణ ద్వారా అంచనా వేయగలదని తెలుస్తోంది.

Follow Us
ఈ స్కూల్ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్
ఈ స్కూల్ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్
ఉడికించిన గుడ్లు బయట పెడుతున్నారా? ఈ టైమ్ దాటితే తినకండి!
ఉడికించిన గుడ్లు బయట పెడుతున్నారా? ఈ టైమ్ దాటితే తినకండి!
Video: చీర కొంగును ఇంజిన్‌కు కట్టి .. ట్రైన్ ముందు మహిళ డ్యాన్స్!
Video: చీర కొంగును ఇంజిన్‌కు కట్టి .. ట్రైన్ ముందు మహిళ డ్యాన్స్!
ఉల్లిపాయ, టమాటాలు ఇంట్లో ఉన్నాయా?.. అదిరిపోయే చట్నీ రెసిపీ
ఉల్లిపాయ, టమాటాలు ఇంట్లో ఉన్నాయా?.. అదిరిపోయే చట్నీ రెసిపీ
ట్రైన్‌లోకి పాములతో ఎంట్రీ ఇచ్చిన ఆరుగురు వ్యక్తులు.. కట్‌చేస్తే.
ట్రైన్‌లోకి పాములతో ఎంట్రీ ఇచ్చిన ఆరుగురు వ్యక్తులు.. కట్‌చేస్తే.
వెండి వస్తువులపై నల్లటి పొర పోవాలంటే.. ఈ ట్రిక్ ట్రై చేయండి!
వెండి వస్తువులపై నల్లటి పొర పోవాలంటే.. ఈ ట్రిక్ ట్రై చేయండి!
బీపీ, కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడుతున్నారా?
బీపీ, కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడుతున్నారా?
నడవలేని స్థితిలో సీనియర్ నటి శారద.. ? ఫొటోస్ వైరల్
నడవలేని స్థితిలో సీనియర్ నటి శారద.. ? ఫొటోస్ వైరల్
భర్తగా ఉద్యోగం కావాలా? 36 ఏళ్ల యువతి పెట్టిన గూగుల్ ఫార్మ్ వైరల్
భర్తగా ఉద్యోగం కావాలా? 36 ఏళ్ల యువతి పెట్టిన గూగుల్ ఫార్మ్ వైరల్
'ఇప్పటి వరకు ఎంత మంది అమ్మాయిలు పడ్డారు’.. UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
'ఇప్పటి వరకు ఎంత మంది అమ్మాయిలు పడ్డారు’.. UPSC ఇంటర్వ్యూ ప్రశ్న