AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పండక్కి ముందే సామాన్యులకు షాక్.. భారీగా పెరగనున్న వీటి ధరలు.. కష్టమే..

సామాన్యులకు షాకింగ్ న్యూస్. పండుగ సీజన్‌లో వస్తువుల ధరలు భారీగా పెరగనున్నాయి. ఇప్పటికే పలు వస్తువుల ధరలు పెరగ్గా.. పండుగ సీజన్‌లో డిమాండ్ కారణంగా మరిన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి. ఏయే వస్తువుల ధరలు పెరగనున్నాయి..? సామాన్యులపై ఎంత ప్రభావం పడనుంది?

పండక్కి ముందే సామాన్యులకు షాక్.. భారీగా పెరగనున్న వీటి ధరలు.. కష్టమే..
Cost
Venkatrao Lella
|

Updated on: Oct 02, 2026 | 9:41 PM

Share

దీపావళికి ముందే సామాన్యులకు షాక్ తగలనుంది. అక్టోబర్‌లో దసరా పండుగ వస్తుండగా.. నవంబర్‌లో దీపావళి రానుంది. వరుస ప్రధాన పండుగల క్రమంలో షాపింగ్ చేసేందుకు చాలామంది ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇక నుంచి షాపింగ్ చేయాలంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. నిత్యావసర వస్తువులతో పాటు ఎలక్ట్రానిక్, బంగారం ధరలు పెరగనున్నాయి. విమాన ప్రయాణం కూడా మరింత ఖరీదైనదిగా మారనుంది. ఎల్‌నీవో ప్రభావం, రూపాయి విలువ పడిపోతుండటం, ఇంధన ధరలు పెరగడం వల్ల అనేక వస్తువుల ధరలు పెరగనున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుండటంతో.. రాబోయే రోజుల్లో అనేక వస్తువుల ధరలు పెరిగే అవకాశముంది. దీంతో పండుగల కంటే ముందే సామాన్యులకు షాక్ తగలనుంది. ఏయే ధరలు పెరుగతాయనేది ఒకసారి చూద్దాం.

ఈ ధరలు పెరుగుతున్నాయ్..

ఇంధన ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు పెరిగాయి. దీంతో ఇవి వస్తువుల ధరలపై నేరుగా ప్రభావితం చూపిస్తున్నాయి. దీంతో కూరగాయలు, బట్టలు, స్వీట్లు, ఇతర ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా పెరుగుతున్నాయి. ఈ కారణంతో పండుగ సీజన్‌లో స్వీట్ల ధరలు పెరగనున్నాయని చెప్పవచ్చు. ఇక హోటళ్లు, రెస్టారెంట్లలో మెనూ ధరలు కూడా పెరగనున్నాయని నిపుణులు చెబుతున్నారు. స్వీట్లు, స్నాక్స్ ధరలు పండుగ సీజన్‌లో పెరగనున్నాయి. ఇప్పటికే షుగర్, ఉల్లిపాయల ధరలు పెరగ్గా.. నిత్యావసర సరుకుల ధరలు కూడా పుంజుకున్నాయి. ఎల్‌నీవో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు లేవు. తక్కువ వర్షపాతం వల్ల పంట దిగుబడి తగ్గడంతో.. సరఫరా కొరత ఏర్పడటంతో ఆహార ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి.

పండుగల సమయంలో బంగారం ఎక్కువమంది కొనుగోలు చేస్తుంటారు. దీంతో వాటి ధరలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. వీటితో పాటు వెండి ధరలు కూడా పెరగనున్నాయి. ఇక ఎయిర్ కండిషనర్లు, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, స్మార్ట్ ఫోన్ల ధరలు కూడా పెరుగనున్నాయి. వాటికి ఉపయోగించే లోహల ధరలు పెరగడం వల్ల కంపెనీలు ధరలను పెంచేస్తున్నాయి. ఇక మెమరీ చిప్‌ల కొరత వల్ల స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్ ధరలు పెరుగుతున్నాయి. ఇక విమానయాన టర్బైన్ ఇంధన ధరలు పెరగడంతో.. విమానయాన సంస్థలు ఛార్జీలను పెంచనున్నాయి. మొత్తానికి పండుగల సీజన్‌లో సామాన్య, మధ్యతరగతిపై పెంపు భారం పడనుందని చెప్పవచ్చు.

Follow Us