అబ్బబ్బా.. ఇక్కడ లీటర్ పెట్రోల్ కేవలం రూ.2.21 మాత్రమే.. ఎంత లక్కీనో కదా..

Venkatrao Lella

Images: Pinterest

21 OCT 2026

పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం అనేక రంగాలపై ఉంటుంది. ఇంధన ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. దీని వల్ల నిత్యావసర వస్తువులతో పాటు అనేక వస్తువులపై ప్రభావం పడుతుంది.

పెట్రోల్ అన్ని దేశాల్లో ఒకేలా ఉండవు. దేశం, ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. దేశాలు విధించే ట్యాక్సులు, సెస్‌ల‌తో పాటు స్థానిక ప్రభుత్వాలు విధించే ట్యాక్సులను బట్టి ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి.

ప్రపంచంలో కొన్ని దేశాల్లో ధరలు ఎక్కువగా ఉండగా.. మరికొన్ని దేశాల్లో అతి తక్కువగా ఉన్నాయి. ధరలు తక్కువగా ఉన్న టాప్ 10 దేశాలు ఏంటో చూద్దాం.

ప్రపంచంలో పెట్రోల్ ధర తక్కువగా ఉన్న దేశాల జాబితాలో లిబియా తొలి స్థానంలో ఉంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.2.21 మాత్రమే. ఆ తర్వాత రెండో స్థానంలో ఉన్న ఇరాన్‌లో లీటర్ పెట్రోల్ రూ.2.71 మాత్రమే.

మూడో ప్లేస్‌లో వెనిజులా ఉండగా.. ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ.3.32కే లభిస్తోంది. ఆ తర్వాతి స్థానంలో ఉన్న అంగోలాలో లీటర్ పెట్రోల్ ధర రూ.31 పలుకుతోంది. ఐదో స్థానంలో కువైట్ దేశంలో ఉండగా.. లీటర్ పెట్రోల్ రూ.32గా ఉంది.

అల్జీరియా ఆరో స్థానంలో ఉంది. ఆ దేశంలో లీటర్ రూ.33 పలుకుతోంది. తుర్క్‌మెనిస్తాన్ ఏడో స్థానంలో ఉండగా.. ఈ దేశంలో లీటర్ పెట్రోల్ రూ.40కే లభిస్తోంది.

ఎనిమిదో స్ధానంలో ఈజిప్ట్ కొనసాగుతోండగా.. లీటర్ పెట్రోల్ ధర ఇక్కడ రూ.43 పలుకుతోంది. ఆ తర్వాతి స్థానంలో ఖతార్ ఉండగా.. ఇక్కడ రూ.54కే కొనుగోలు చేయవచ్చు.

చివరిగా పదో స్థానంలో బొలీవియా దేశం ఉంది. ఈ దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ.56గా ఉంది. బొలీవియాలో పెట్రోల్‌పై సబ్సిడీ అందిస్తున్నారు.

ఇండియా విషయానికొస్తే.. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు లీటర్ పెట్రోల్ ధర 25 పైసలుగా ఉండేది. 2000లో రూ.26, 2004లో రూ.36గా ఉంది. ప్రస్తుతం రూ.100గా ఉంది.