AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెండి పట్టీలు, గొలుసులు నల్లగా మారాయా? ఈ చిట్కాలతో క్షణాల్లో కొత్త వాటిలా మెరిపించండి

మీ ఇంట్లో ఉన్న వెండి ఆభరణాలు నల్లగా మారాయి. చూడ్డానికి పాతవాటిలా కనిపిస్తున్నాయా? వాటిని మళ్లీ కొత్త వాటిలా చేయాలి అనుకుంటున్నారా? ఇందుకోసం కెమికల్స్ వాడుతున్నారా? ఆడంగి.. ఇకపై మీరు పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ కిచెన్‌ దొరికే 3 పదార్థాలతో ఈజీగా మీ వెండి వస్తువులను ఈజీగా కొత్త వాటిలా మర్చుకోవచ్చు. అదెలానో ఇక్కడ తెలుసుకోండి.

వెండి పట్టీలు, గొలుసులు నల్లగా మారాయా? ఈ చిట్కాలతో క్షణాల్లో కొత్త వాటిలా మెరిపించండి
How To Clean Silver Jewelry At Home
Anand T
|

Updated on: Jun 11, 2026 | 9:38 PM

Share

బంగారం మనం కొన్నప్పుడు ఎలా ఉంటుందో కొన్నాళ్లు గడిచిన తర్వాత కూడా అలానే కనిపిస్తుంది. కానీ వెండి ఆభరణాలు మాత్రం అలా కాదు.. వాడే కొద్ది ఇవి తన మెరుపును కోల్పోతాయి. కొన్నాళ్లు వాడిన తర్వాత ఇవి నల్లరంగులోకి మారుతాయి. వీటిని మళ్లీ కొత్తవాటిలా మార్చేందుకు చాలా మంది అనేక కెమికల్స్‌ను వాడుతుంటారు. కానీ దీనివల్ల వెండి పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతో ఈ వెండి ఆభరణాలను క్షణాల్లో కొత్త వాటిలా ఎలా మార్చుకోవచ్చని చాలా మందికి తెలియదు.

అవును మన వంట గదిలో దొరికే నిమ్మకాయ, బేకింగ్ సోడా, టూత్‌పేస్ట్ వంటి వాటితో కొన్ని నిమిషాల్లోనే వెండిపై ఉన్న నలుపును ఈజీగా మనం తొలగించవచ్చు. ఇవన్నీ మన కిచెన్‌లోనే దొరుకుతాయి కాబట్టి వీటికి మనం పెద్దగా ఖర్చు కూడా చేయాల్సిన పనిలేదు.వీటితో వెండి ఆభరణాలను ఎలా క్లీన్ చేయాలో స్టెప్‌ బై స్టెప్ చూద్దాం.

వెండి వస్తువులను కొత్తగా మార్చే చిట్కాలు ఇవే

నిమ్మకాయ,ఉప్పు: వెండి ఆభరణాలపై ఉన్న మురికిని తొలగించడంలో నిమ్మకాయ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.నిమ్మకాయలో ఉండే సహజసిద్ధమైన యాసిడ్, వదిలించడంలో బాగా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకోండి. అందులో సగం నిమ్మకాయ రసాన్ని పిండి, ఒక చిటికెడు ఉప్పు వేసి బాగా కలపండి. ఇప్పుడు మీ వెండి నగలను కొద్దిసేపు ఆ నీటిలో నానబెట్టండి. తర్వాత ఒక బ్రష్ సహాయంతో తేలికగా రుద్ది, ఆపై మంచి శుభ్రమైన నీటితో కడిగేయండి. అంతే మీ ఆభరణాలపై ఉన్న మొండి మరకలు క్షణాల్లో తొలగిపోతాయి.

బేకింగ్ సోడా పేస్ట్: చాలా రకాల వంటకాల్లో వాడే బేకింగ్ సోడా వెండిని శుభ్రం చేయడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందుకోసం మీరు ఒక గిన్నెలో కొద్దిగా బేకింగ్ సోడా తీసుకుని, అందులో కొద్దిగా నీరు కలిపి చిక్కటి పేస్ట్‌లా తయారు చేసుకోండి. ఈ పేస్ట్‌ను వెండి గొలుసు లేదా పట్టీలకు పట్టించి కొద్దిసేపు అలాగే వదిలేయండి. ఆ తర్వాత పాత టూత్‌బ్రష్‌తో మెల్లగా రుద్ది, చివరగా శుభ్రమైన నీటితో కడిగి పొడి గుడ్డతో తూడ్చుకోండి. దీనివల్ల నలుపు అంతా పోయి వెండి కొత్తదానిలా మెరుస్తుంది.

టూత్‌పేస్ట్: సాధారణంగా టూత్‌పేస్ట్‌ను పళ్లను మెరిపించడానికి వాడతాం, కానీ ఇది వెండిని మెరిపించడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అవును వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.ఇందుకోసం కొద్దిగా టూత్‌పేస్ట్‌ను తీసుకుని వెండి పట్టీలు లేదా గొలుసుపై రాయండి. తర్వాత ఒక మెత్తటి బ్రష్‌తో తేలికగా చేతులతో రుద్దండి.ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడిగేయండి. ఈ చిట్కాతో కూడా వెండిపై ఉన్న నల్లటి పొర త్వరగా వదిలిపోతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us