Telangana: ఆ జిల్లా వాసులకు గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త బస్టాండ్.. మంత్రి ప్రకటన
రాయిచూర్- మహబూబ్‌నగర్- నారాయణపేట మధ్య రాకపోకలు సాగించే ఆర్టీసీ ప్రయాణికులకు ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ మార్గంలో త్వరలోనే మరో కొత్త ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం కాబోతుంది. అవును మక్తల్ పట్టణంలో రూ.4కోట్ల వ్యయంతో కొత్త ఆర్టీసీ బస్టాండ్‌ను నిర్మించబోతున్న మంత్రి వాకిటి శ్రీహరిం ప్రకటించారు. ఇప్పటికే ఉన్న పాత బస్టాండ్ శిథిలావస్తకు చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ వాసులకు మంత్రి వాకిటి శ్రీహరి శుభవార్త చెప్పారు. స్థానికంగా ఉన్న బస్టాండ్ శిథిలావస్తకు చేరడంతో దాని స్థానింలో కొత్త ఆర్టీసీ బస్టాండ్‌ను నిర్మించబోతున్నట్టు తెలిపారు. గత కొన్ని రోజులుగా పెరిగిన ప్రయాణికుల రద్దీ కారణంగా ప్రస్తతం ఉన్న బస్టాండ్ ఇరుకుగా మారిందని.. దీంతో ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నట్టు ఆయన తెలిపారు. అందుకే రూ.4కోట్ల వ్యవయంతో విశాలమైన కొత్త బస్టాండ్‌ను నిర్మించబోతున్నట్టు తెలిపారు. అంతేకాదు ఇకపై రాత్రి వేళల్లో లోకల్ స్టేజీల వద్ద కూడా మహిళ కోసం ఎక్స్‌ప్రెస్ బస్సులను ఆపాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.
మక్తల్ బస్టాండ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత బస్సు పథకం ప్రచారంలో ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టీసీలో ప్రయాణాలు పెరిగాయని.. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 290 కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. దీని వల్ల ఆర్టీసీకి రూ. 10 వేల కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.
కేవలం నారాయణపేట జిల్లాలోని మహిళా ప్రయాణికుల ద్వారానే ఆర్టీసికి రోజుకూ రూ.12లక్షల ఆదాయం వస్తుంది.. దీని ద్వారా ఆర్టీసీ కూడా లాభాల్లో నడుస్తోందని తెలిపారు. ఈ విషయాలను అధికారులు ఎందుకు బయటకు చెప్పడం లేదన్నారు. గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చే విద్యార్థులకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులను నడపాలని సూచించారు. అలాగే మహిళలు, విద్యార్థుల భద్రత దృష్ట్యా రాత్రి వేళలల్లో లోకల్ స్టేజ్‌ల వద్ద కూడా ఎక్స్‌ప్రెస్ బస్సులను ఆపాలని ఆదేశించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
