విజయ్ సాతా, టీవీ 9 క్రైమ్ బ్యూరో చీఫ్‌గా దీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. 15 ఏళ్లకుపైగా క్రైమ్ జర్నలిజంలో తన ప్రయాణం కొనసాగిస్తూ అనేక సంఘటనలను కవర్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో విజయ్ సాతా మొదటి ప్లేస్ లో ఉంటారు అనడానికి అయన చేసిన సెన్సేషనల్ స్టోరీలే ఉదాహరణ.
దేశాన్ని వణికించిన నిర్భయ సంఘటన నుండి గోవాలో డ్రగ్ మాఫియా పై స్ట్రింగ్ ఆపరేషన్ వరకు, అంతే కాకుండా అనేక కుంభకోణాలు, నేరాలు, చీకటి కోణాలు వెలుగు లోకి తెచ్చి ఎన్నో సంచలనాలు సృష్టించారు. ఎవరూ సాహసించని ప్రాంతాల్లో కూడా రిపోర్టింగ్ చేసి విజయ్ సాతా ధైర్యాన్ని ప్రదర్శించారు. స్వయంగా దట్టమైన అటవీ ప్రాంతాల్లో పర్యటించి మావోయిస్టుల సమాచారం తో పాటు, ఎన్నో ఎన్ కౌంటర్ వార్తలను కవర్ చేశారు. ముఖ్యంగా పోలీసు, ఇంటెలిజెన్స్ అధికారులు, మోస్ట్ వాంటెడ్ నేరస్తులతో చేసిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలతో ఆయన ప్రజలందరిని ఆశ్చర్యపరిచారు.
గ్రౌండ్ రిపోర్టింగ్ చేయడమే కాకుండా, సమాజం లో కొత్త నేరాలను గుర్తించి ప్రజలను అవగాహన పరిచే కథనాలు అందించడంలో ఆయన ప్రత్యేకం. అయన అందించే డిజిటల్ కథనాలు సరికొత్త స్టైల్ లో ఉండటమే కాకుండా, మీ రోజూ వారి జీవనంలో మీకు ఉపయోగపడే ఎన్నో విషయాలు అందిస్తాయి.
Hyderabad: రోడ్లపై కంటికి కనిపించని మృత్యువు..! అలర్ట్‌గా లేకపోతే అంతే సంగతులు!
సంక్రాంతి వచ్చిందంటే చాలా జనాల ప్రాణాలు తీసేందుకు కాచుకు కూర్చుంటుంది చైనా మాంజా. ఇక ఈసారైతే సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచే రాష్ట్రంలో వీటి దాడులు మొదలయ్యాయి. ఆకాశంలో ఎగిరే గాలిపటం ఆనంద హేతువైతే, అదే రోడ్డుపై పడే మాంజా దారం మానవుల మృత్యవకు కారణం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ కంటికి కనిపించని మృత్యువు పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
- Vijay Saatha
- Updated on: Jan 2, 2026
- 8:39 pm
Hyderabad: సీపీ సజ్జనార్ పర్సనల్, ప్రొఫెషనల్ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏంటో తెలుసా..?
నూతన సంవత్సరం సందర్భంగా తన ప్రొఫెషనల్, పర్సనల్ సంకల్పాలను ప్రజలతో పంచుకున్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్… నగరాన్ని మరింత సేఫ్‌గా తీర్చిదిద్దడమే తన ప్రాధాన్యమని స్పష్టం చేశారు. సైబర్ క్రైమ్‌పై కఠిన చర్యలు, పోలీస్ సిబ్బంది సంక్షేమం, ఫిట్‌నెస్‌పై ఫోకస్‌తో 2026కి కొత్త కమిట్‌మెంట్ తీసుకున్నారు.
- Vijay Saatha
- Updated on: Jan 2, 2026
- 4:41 pm
Maoist Surrender: మావోయిస్ట్ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్!
మావోయిస్టు పార్టీకి మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. మావోయిస్ట్ పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ (GLA) చీఫ్‌గా ఉన్న బరిసె దేవా తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోనున్నారు. శనివారం డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో అధికారికంగా లొంగిపోనున్నారు. ఈ పరిణామం మావోయిస్టు ఉద్యమానికి తీవ్ర ఎదురుదెబ్బగా భద్రతా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
- Vijay Saatha
- Updated on: Jan 2, 2026
- 4:25 pm
Telangana: తెలంగాణలో అవినీతి అధికారులు ఆ శాఖల్లోనే అధికం..
తెలంగాణలో అవినీతిపై ఏసీబీ ఉక్కుపాదం మోపుతోంది. ఈ ఏడాది 220కి పైగా కేసులు, 150 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగుల అరెస్టులతో రికార్డు స్థాయి చర్యలు చేపట్టింది. ట్రాప్ కేసుల సంఖ్య పెరగడమే కాదు, కీలక శాఖల్లోని అవినీతి అధికారులపై దాడుల తీవ్రత మరింత పెరిగింది.
- Vijay Saatha
- Updated on: Dec 31, 2025
- 9:12 am
Telangana: మహిళలకు గుడ్ న్యూస్.. ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం.. మిస్ అవ్వకండి..
హైదరాబాద్ మహిళలకు గుడ్ న్యూస్. జనవరి 3న అంబర్‌పేట్‌లో ప్రత్యేక డ్రైవర్ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు. బైక్, ఈ-ఆటో డ్రైవింగ్‌లో ఆసక్తి ఉన్న 21-45 ఏళ్ల మహిళలకు ఉచిత శిక్షణ, డ్రైవింగ్ లైసెన్స్ సహాయం, 100శాతం ఉద్యోగ హామీ వంటివి కల్పించనున్నారు.
- Vijay Saatha
- Updated on: Dec 29, 2025
- 5:33 pm
Telangana: ఏంది బై.. ఆయన ఏదో అన్నాడని.. అమ్మానాన్నలు వదిలేసి పోయినవ్..
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం గోపులారం గ్రామంలో ఓటు వేయలేదని మందలించడంతో మనస్థాపానికి గురైన యువకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. కావలి అనిల్ కుమార్ (25) మృతి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ..
- Vijay Saatha
- Updated on: Dec 25, 2025
- 10:54 am
Hyderabad: సాఫ్ట్‌వేర్ గర్ల్ ఫ్రెండ్.. బద్మాష్ బాయ్ ఫ్రెండ్.. ఇద్దరు కలిసి ఏం చేశారో తెలుసా..
ఆమె ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్న ఆమె లగ్జరీ జీవనశైలికి అలవాటు పడింది. ఆఫీస్‌లో వచ్చే సాలరీ సరిపోకపోవడంతో.. అడ్డదారిలో డబ్బు సంపాదనకు ప్లాన్ చేసింది. బాయ్ ఫ్రెండ్‌తో కలిసి.. డ్రగ్స్ దందా మొదటుపెట్టింది. చివరకు డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసులకు పట్టుపడింది. దీంతో యవతితో పాటు ఆమె భాయ్ ప్రెండ్, మరో ఇద్దరి అరెస్ట్ చేశారు పోలీసులు.
- Vijay Saatha
- Updated on: Dec 24, 2025
- 3:37 pm
ఒక్క పెన్ డ్రైవ్.. ఐపీఎస్ ప్రభాకర్ రావుకు చుక్కలు చూపిస్తుంది.. కూపీ లాగుతున్న సిట్!
ఫోన్ టాపింగ్ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆధారంగా ఒక పెన్ డ్రైవ్ మారడంతో దానిపైనే ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ మొత్తం కేంద్రీకృతమైంది. ఫోన్ టాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కీలక డేటా ఈ పెన్ డ్రైవ్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించడంతో కేసు మరింత కీలక దశకు చేరుకుంది.
- Vijay Saatha
- Updated on: Dec 24, 2025
- 10:30 am
Telangana: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్.. కానీ పట్టుబడ్డారంటే రూ. 10 వేలు కట్టాల్సిందే
తెలంగాణ మందుబాబులకు గుడ్ న్యూస్. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మద్యం విక్రయాలను డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి వరకు పొడిగించింది ప్రభుత్వం. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.. ఓ సారి ఈ స్టోరీపై లుక్కేయండి మరి. వివరాలు ఇవిగో
- Vijay Saatha
- Updated on: Dec 24, 2025
- 9:44 am
హైడ్రా కమిషనర్ గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం.. గన్ తో కాల్చుకుని ఘాతుకం..!
హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్న కృష్ణ చైతన్య ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. హయత్‌నగర్ పరిధిలోని తన నివాసంలో గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు అప్రమత్తమై కృష్ణ చైతన్యను అత్యవసరంగా కామినేని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
- Vijay Saatha
- Updated on: Dec 21, 2025
- 6:49 pm
Hyderabad: ధైర్యమున్నోళ్లే చూడండి.. భయపెట్టే ఘోర యాక్సిడెంట్.. ఎక్కడో కాదు.. హైదరాబాద్‌లోనే
రియల్‌గా యాక్సిడెంట్ చూశారా.? హైదరాబాద్‌లో జరిగింది ఈ ఘటనా. ఇంటర్నెట్లో అందుకు సంబంధించిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి. అదేంటో మీరు ఇప్పుడే చూసేయండి. ఓ సారి ఈ స్టోరీలో లుక్కేయండి మరి. లేట్ ఎందుకు ఇది మీకోసమే. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
- Vijay Saatha
- Updated on: Dec 21, 2025
- 10:48 am
Hyderabad: ఇకపై భాగ్యనగరంలో ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే అంతే సంగతులు.. తాట తీస్తున్న పోలీసులు!
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. వారం రోజులపాటు ముందస్తు నిఘా, గూఢచర్య సమాచారంతో పాటు మఫ్టీ పోలీసుల సహకారంతో చేపట్టిన ఈ ఆపరేషన్‌లో మొత్తం 66 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
- Vijay Saatha
- Updated on: Dec 20, 2025
- 5:18 pm