AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: జైలులో స్నేహం చేశాడని.. బయటికి రాగానే హత్య! అసలు మ్యాటరేంటంటే?

హైదరాబాద్ నగరంలోని మంగళ్‌హాట్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన రుషబ్ అగర్వాల్ హత్య కేసును పోలీసులు చేదించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి మూడు సెల్‌ఫోన్లు, రెండు యాక్టివా బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి 27న మధ్యాహ్నం ప్రత్యేక బృందాలు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

Hyderabad: జైలులో స్నేహం చేశాడని.. బయటికి రాగానే హత్య! అసలు మ్యాటరేంటంటే?
Rishabh Agarwal Murder
Vijay Saatha
| Edited By: |

Updated on: Feb 28, 2026 | 5:18 PM

Share

హైదరాబాద్ నగరంలోని మంగళ్‌హాట్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన రుషబ్ అగర్వాల్ హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. రుషబ్ గతంలో చర్లపల్లి జైలులో ఉన్న సమయంలో తన బరాక్‌లో మున్నా సింగ్‌పై కక్ష కట్టిన పాత నేరస్తులతో కలిసి ఉన్నానని మున్నాకు చెప్పినట్లు సమాచారం. ఈ విషయంతో మున్నాకు అనుమానం మొదలై, రుషబ్‌పై దాడికి పథకం రచించినట్లు పోలీసులు వెల్లడించారు.ఈ క్రమంలో రుషబ్‌ను ఆరాంఘర్ ప్రాంతంలోని ఒక గణేష్ తయారీ యూనిట్‌కు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టినట్లు తెలుస్తోంది. దాడి కారణంగా అతనికి అంతర్గత గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఘటన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు నిందితులను గుర్తించారు. సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా విశ్లేషణ ఆధారంగా ఐదుగురిని అరెస్ట్ చేయగా, మిగిలిన ముగ్గురి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.ఈ హత్య కేసు నేపథ్యంలో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. నిందితుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, లొకేషన్ డేటా, సీసీటీవీ దృశ్యాలను సేకరించి సంఘటనకు ముందు, తర్వాత జరిగిన పరిణామాలను విశ్లేషిస్తున్నారు.

హత్యకు ఉపయోగించిన వస్తువులు, ఘటన జరిగిన ప్రదేశంలో లభించిన ఆధారాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు తెలిపారు. ఈ కేసులో వ్యక్తిగత విభేదాలే ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో వెల్లడైంది.మరోవైపు పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us